భద్రాద్రి కొత్తగూడెం, ఆగస్ట్ 21 (జనవిజయం): భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ఐదు అసెంబ్లీ స్థానాలకు బిఆర్ఎస్ అభ్యర్ధులను కెసిఆర్ ప్రకటించారు. అందరూ పాత వారికే టిక్కెట్లు కేటాయించారు. ఎటువంటి అసమ్మతులు, అసంతృప్తులు ఫిర్యాదులను కెసిఆర్ పట్టించుకోలేదు. ప్రకటించిన ఐదుగురు అభ్యర్థుల్లో ఒక్క భద్రా చలం లో తెల్లం వెంకట్ రావు మినహా, మిగతా నలుగురు అభ్యర్ధులు ప్రస్తుత ఎమ్మెల్యే లు గా ఉన్నవారే ! జిల్లాలోని కొత్తగూడెం స్థానం లో వనమా వెంకటేశ్వరరావు, ఇల్లందు లో బానోతు హరిప్రియ, పినపాక లో రేగా కాంతారావు, అశ్వారావుపేట లో మెచ్చ నాగేశ్వర రావు, భద్రా చలం లో తెల్లం వెంకట్రావు రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో బిఆర్ఎస్ అభర్డులు గా పోటీచేయనున్నారు. భద్రాచలం, అశ్వారావుపేట, ఇల్లందు, పినపాక నియోజకవర్గాలు గిరిజన రిజర్వడ్ స్థానాలు కాగా, కొత్తగూడెం ఒక్కటి మాత్రం జనరల్ స్థానం గా ఉంది. ఇపుడు ప్రకటించిన ఐదుగురు అభ్యర్థుల్లో తెల్లం వెంకట్రావు మాత్రమే 2018 ఎన్నికల్లో టిఆర్ఎస్ అభ్యర్థి గా పోటీ చేసి ఓడిపోయారు. కొత్తగూడెం లో వనమా వెంకటేశ్వరరావు, పినపాక లో రేగా కాంతారావు, ఇల్లందు లో హరిప్రియ కాంగ్రెస్ అభ్యర్థులు గా పోటీచేసి టిఆర్ఎస్ గెలిచారు. అశ్వాావుపేట లో మెచా నాగేశ్వరరావు కాంగ్రెస్ మద్దతు తో తెలుగుదేశం అభర్ధి గా పోటీ చేసి టిఆర్ఎస్ పై గెలిచారు. ఆ తరువాత ఈ నలుగురు ఆయా పార్టీలను వీడి టిఆర్ఎస్ పార్టీ లో చేరారు. తెల్లం వెంకట్రావు మాత్రం రెండు నెలల క్రితం మాజీ ఎంపి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తో పాటు కాంగ్రెస్ లో చేరారు. తిరిగి నాలుగు రోజుల క్రితం టికెట్ హామీ తో బిఆర్ఎస్ లో చేరారు.