- అఖిలపక్ష నేతలకు అవగాహన సదస్సు!
- 21 నుండి 30 వరకు బూత్ లలో ఈ వి ఏమ్ ల పై అవగాహన:నాయబ్ తహశీల్దార్ కరుణ శ్రీ
- వృద్దులకు,వికలాంగులకు ఇక పోస్టల్ బ్యాలెట్
- మూస దోరణిలో ఓటర్ జాబితా మార్పులు నో
వేంసూరు,ఆగస్ట్4(జనవిజయం): అన్ని రాజకీయ పార్టీల సహకారం రానున్న ఎన్నికలలో ఎన్నికల అధికారులకు కావాలని సహృదయంతో అందరు సహకరించాలని తహశీల్దార్ ఏమ్.ఏ.రాజు కోరారు.శుక్రవారం సాయంత్రం మండల కేంద్రంలోని తహశీల్దార్ కార్యాలయంలో గల తహశీల్దార్ ఛాంబర్ లో ఎన్నికల నిబంధనలపై అన్ని రాజకీయ పార్టీల నేతలకు నిర్వహించిన అవగాహన సదస్సులో రాజు మాట్లాడుతూ ఇక నుండి గతంలో మాదిరిగా మూస దోరణిలో,మూజుమాయిషి పద్దతిలో ఓట్ల తొలగింపు లకు అవకాశం లేదని,సంబంధిత ఓటరు కు నోటీస్ లు తప్పనిసరిగా జారీ చేసి ఓటరు ఇచ్చే సమాధానం పై మాత్రమే చేర్పులు,మార్పులు చేయడం జరగుతుందని తెలిపారు.మరణించిన వారి ఓట్లను తొలగించడానికి సాధారణ మరణం చెందిన వారికైతే మరణధృవీకరణపత్రం తప్పనిసరి అని,ప్రమాద మరణం చెందిన వారికైతే మరణ ధృవీకరణపత్రంతో పాటుగా పోలీస్ శాఖ వారితో దృవీకరించిన ఎఫ్. ఐ.ఆర్ పత్రాలు జత పర్చాలని తెలిపారు.ఈ నెల 21 నుండి 30 వ తేది వరకు ఓట్లు వేసే ఈవిఏమ్ ల పై,వి వి ప్యాడ్ లపై బూత్ లలో ఓటరులకు అవగాహన బి.ఎల్.ఓ ల ద్వారా కల్పిస్తామని నాయబ్ తహశీల్దార్ కరుణశ్రీ తెలిపారు.80 ఏoడ్లు వున్న వృద్దులకు,వికలాంగులకు ఎన్నికల విధులకు హాజరు అయ్యే అధికారులకు, ఉద్యోగులకు ఉన్న మాదిరిగా పోస్టల్ బ్యాలెట్ అవకాశం వుందని ముందుగా దరఖాస్తులు చేయాలని కరుణశ్రీ తెలిపారు.పోలీస్ ఎస్ ఐ ఎస్ వీర ప్రసాద్ మాట్లాడుతూ ఎక్కడైనా శాంతి భద్రతలకు విగాధం కలిగే పరిస్థితులు వుంటే ముందుగా పోలీస్ శాఖ కు తెలియపర్చాలని సూచించారు.బిఆర్ఎస్ పార్టీ నుండి పాల్గొన్న ఎంపిపి పగుట్ల వెంకటేశ్వరరావు,కాంగ్రెస్ పార్టీ నుండి పాల్గొన్న సీనియర్ నేత పుచ్చకాయల సోమిరెడ్డి,కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కాసర చంద్రశేఖర్ రెడ్డి,సీపీఎం నేత మల్లూరు చంద్రశేఖర్ లు మాట్లాడుతూ మండల పరిధిలోని చిన్న గ్రామాలైన లక్ష్మీనారాయణపురం,దూళ్ళకొత్తూరు,సత్యనారాయణపురం గ్రామాల ఓటరులకు,అడసర్లపాడు గ్రామ దళితవాడ ఓటరులకు పోలింగ్ బూత్ లు రెండు నుండి మూడు కిలో మీటర్ల దూరంలో వున్నాయని ఆయా ప్రాంతాలలో నూతన పోలింగ్ బూత్ లు ఏర్పాటుకు కృషి చేయాలని కోరగా ఉన్నత అధికారులకు ప్రతిపాదనలు పంపుతామని,1500 ఓట్లు ఉన్న ప్రాంతంలో అయితే నూతన బూత్ ల ఏర్పాటుకు అవకాశాలు వున్నాయని తెలిపారు.ఒకే కుటుంబ సభ్యుల ఓట్లు ఒకే బూత్ లో కాకుండా ఇతర బూత్ లలో ఉంటే ఎలా మార్చుకోవాలని,వలస వెళ్లిన వారు స్వంత నివాస గ్రామాలలో ఓట్లు వుంచుకుంటే తొలగిస్తారా”వుంచుతార అని మల్లూరు చంద్రశేఖర్ ప్రశ్నిoచారు.కుటుంబం లోని అందరికీ ఒకే బూత్ లో ఓట్లు కావాలంటే ఫామ్ 8 నమూనాలో బి ఎల్ ఓ లకు దరఖాస్తులు చేయాలని,వలస వెళ్లిన వారి ఓట్లను తొలగించడానికి అవకాశం లేదని కరుణశ్రీ అన్నారు.అనంతరం కాంగ్రెస్ సీనియర్ నేత పుచ్చ కాయల సోమిరెడ్డి మాట్లాడుతూ బి ఎల్ ఓ లుగా బాధ్యతలు నిర్వహిస్తున్న కొందరికి అవగాహన లేదని తెలపగా అవగాహన ఇటీవల కల్పించామని కరుణ శ్రీ తెలిపారు.అక్టోబర్ 1 నాటికి 18 ఏoడ్లు నిండిన వారిని నూతన ఓటరులుగ నమోదు చేయించాలని కోరారు.ఈ కార్యక్రమంలో:- బిఆర్ఎస్,సిపిఎం,కాంగ్రెస్,బీజేపీ,ఏమ్ఎస్ పి,తెలుగుదేశం పార్టీల నేతలు లింగపాలెం ఎంపిటిసి నున్నా రాంబాబు,రామన్నపాలెం సిడిసి డైరెక్టర్ పుచ్చకాయల శంకర్ రెడ్డి,వేంసూరు బిఆర్ఎస్ గ్రామ కార్యదర్శి రామాల మోహనరావు, మర్లపాడు ఎంపిటిసి రాఘవరెడ్డి,కలపాల ఏసు,పర్సా రాంబాబు,మట్టా ప్రసాద్,భీమిరెడ్డి మురళీరెడ్డి లు పాల్గొన్నారు.