– నేను నీకు రక్ష, నీవు నాకు రక్ష, మనిద్దరం దేశానికి రక్ష
– పెవిలియన్ వాకర్స్ సోదరీమణులతో అసోసియేషన్ అధ్యక్షులు బుడిగం శ్రీనివాస్
ఖమ్మం, ఆగస్టు 31 (జనవిజయం) : అన్నా చెల్లెల్లు, అక్కా తమ్ముళ్ల ప్రేమాను బంధానికి ప్రతీక రాఖీ పౌర్ణమి అని పెవిలియన్ వాకార్స్ అసోసియేషన్ అధ్యక్షులు బుడిగం శ్రీనివాస్ అన్నారు. రాఖీ పౌర్ణమి వేడుకలను పురస్కరించుకుని బుడిగం శ్రీనివాస్ మాట్లాడుతూ… కుల, మత, ప్రాంతాల కతీతంగా అమ్మానాన్నల వారసత్వాన్ని పుణికిపుచ్చుకొని ఒకరికొకరు ప్రేమాభిమానాలు పంచుకుంటూ జీవితాంతం అండదండగా నిలిచి ఉండేందుకు అన్నా చెల్లెల్లు, అక్కా తమ్ముళ్ళు రాఖీ పౌర్ణమి జరుపుకుంటారన్నారు. గురువారం పెవిలియన్ గ్రౌండ్ నందు వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రాఖీ పౌర్ణిమి వేడుకలను ఎంతో ఘనంగా జరుపుకున్నారు.
సభ్యులందరూ రాఖిలు కట్టుకుంటూ నాకు నీవు, నీకు నేను, మనిద్దరం అనురాగల ఆప్యాయతకు మనమే దేశానికి రక్ష, ఆదర్శం అంటూ వాకర్స్ సోదరీమణులతో రాఖీలు కట్టించుకొని, మిఠాయిలు తినిపించుకుని రాఖీ పౌర్ణమి పండుగను ఘనంగా నిర్వహించుకున్నారు.
ఈ కార్యక్రమంలో సుదర్శన్, రాకం శ్యామ్ బాబు, రామనాథం, నర్సింహారావు, నర్సింహరెడ్డి, శ్రీనివాస్ గుప్త, అంబాల వెంకటేశ్వర్లు, సత్యం, డాక్టర్ నర్సింహారావు, నారాయణ, దామోదర్ రెడ్డి, రాణి, భాగ్య, మాధవి, జ్యోతి, రాజ్యలక్ష్మి, రమ, కళావతి తదితరులు పాల్గొన్నారు.