భద్రాద్రి కొత్తగూడెం, ఆగస్ట్ 9 (జనవిజయం): గత 15 సంవత్సరాల నుండి ఎన్ఎచ్ఎం లో రెండవ ఏఎన్ఎం గావిధులు నిర్వర్తిస్తున్న వారందరినీ బేషరతుగా రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు. ఏఐటీయూసీ ఆధ్వర్యంలో కొత్తగూడెంలో ఎ ఎన్ ఏం లు బతుకమ్మ ఆడారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు ప్రసాద్ మాట్లాడుతూ 32 రికార్డ్ లను ఆన్లైన్, ఆఫ్ లైన్ చేస్తూ ప్రభుత్వ ఆదేసాలన్నింటినే పూర్తి చేస్తున్నారని ఆయన తెలిపారు. వీరు చేస్తున్న శ్రమకు ప్రభుత్వం తగిన ఫలితం ఇవ్వడం లేదని అయన ఆవేదన వ్యక్తం చేశారు . ఎటువంటి పరీక్షలు లేకుండా బేషరతుగా రెగ్యులర్ చేయాలని ఆయన అన్నారు. పోరాటం చేస్తుంటే ప్రభుత్వం నోటిఫికేషన్ ను విడుదల చేసిందన్నారు. ఇందుకు నిరసనగా ఏఐటీయూసి ఆధ్వర్యంలో చేపట్టిన ఛలో అసెంబ్లీ కార్యక్రమం లో మహిళలని చూడకుండా అర్థరాత్రి అరెస్టు చేసిన విషయాలను ప్రజల గమనించాలన్నారు. అక్రమ అరెస్టులకు నిరసనగా ఈనెల 5 న అన్ని కలెక్టర్ కార్యాలయాలను ముట్టడించినట్లు ఆయన తెలిపారు. 2018లో విడుదల చేసిన నోటిఫికేషన్ లో 30 శాతం మార్కులు వెయిటేజీ ఉండగా ప్రస్తుతం కేవలం 20 శాతం మాత్రమే ఇచ్చారని, వాస్తవానికి 40 శాతం మార్కులు ఇవ్వవలసి ఉందని ఆయన ఈ సందర్భంగా తెలిపారు. హేతుబద్ధత లేని కారణంగా అట్టి నోటిఫికేషన్ ని రద్దుచేసి ఎటువంటి పరీక్షలు లేకుండా రెండవ ఏఎన్ఎం అందరినీ రెగ్యులర్ చేయాలని ఆమే ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ విషయంపై త్వరలో న్యాయపోరాటం చేయాలని నిర్ణయించుకున్నట్టు ఆయన ఈ సందర్భంగా వెల్లడించారు. ఈ కార్యక్రమం లో జిల్లా ప్రెసిడెంట్ ఎండి సజ్జు బేగం , ప్రధాన కార్యదర్శి బానోత్ ప్రియాంక , బాలనాగమ్మ ,పార్వతి , వెంకటమ్మ , ఇందిర , తదితరులు పాల్గొన్నారు.