జనవిజయంఆరోగ్యంఅందరికీ ఆరోగ్యం అసాధ్యమా?!

అందరికీ ఆరోగ్యం అసాధ్యమా?!

రోగ్యమే మహా భాగ్యం అన్నారు పెద్దలు. మహాభాగ్యంతో ఆరోగ్యం కొనుక్కోవచ్చనుకుంటున్నారు నేటి జనులు. అంటే ఆరోగ్యం పట్ల, దానికి సంబంధించిన అలవాట్లు పట్ల మనకంటే మన పెద్దలే ఎక్కువ ప్రాధాన్యతనిచ్చారని తెలుస్తోంది. అందుకేనేమో ‘పెద్దల మాట చద్దన్నం మూట’ అన్నారు. గతంతో పోలిస్తే టెక్నాలజీ, వైద్య రంగం చాలా అభివృద్ధి చెందింది. విప్లవాత్మకమైన ఎన్నో మార్పులు ఈ రంగంలో ఆవిష్కృతమైనాయి. అనేక మొండి జబ్బులకు మందులు కనుక్కున్నారు. ఒకప్పుడు ప్రాణాంతకం అనుకున్న చాలా వ్యాధులు నేడు తేలికగా నయమవుతున్నాయి. కొన్ని వ్యాధులు కనిపించకుండా పోయాయి. అవయవాల మార్పిడి విజయవంతంగా జరుగుతోంది. మందులతో, ఆధునిక వైద్య సదుపాయాలతో మనిషి జీవిత కాలాన్ని పెంచుతున్నారు. అనేక విధాలుగా వైద్యరంగం, డాక్టర్లు మనిషికి సేవలు, మేలు చేస్తున్నారు. మరోవైపు చూస్తే మన పెద్దలకీ, మనకీ ఆరోగ్య సమస్యలు రావడంతో, శారీరక మానసిక శక్తిలో చాలా వ్యత్యాసం ఉంటోంది. ఈ విషయంలో ఎవరిని అడిగినా ఇట్టే చెప్పేస్తారు. నాటి తరం మనుషుల శరీరాలకున్న శక్తి, మానసిక స్థైర్యం నేటితరం వారి శరీరాలకు ఉండటం లేదు. దీనికి అనేక కారణాలున్నాయి.

డాక్టర్లు, ఆసుపత్రుల సంఖ్య పెరుగుతున్నా, వైద్యరంగం అభివృద్ది అవుతున్నా రోగాల సంఖ్య, రోగుల సంఖ్య పెరుగుతూనే ఉన్నది. డాక్టర్ల శరీరాలకూ రోగాలు వస్తున్నాయి. 25ఏండ్లకే షుగరు, వచ్చేస్తున్నది. బిపి, గుండె జబ్బులు, కీళ్ళ వ్యాధులు, జుట్టు తెల్లబడడం, మానసిక అశాంతి, సెక్స్‌ సమస్యలు, చిన్నతనంలోనే కళ్ళజోళ్ళు పెట్టుకోవాల్సి రావడం…. ఇలా చెప్పుకుంటూ పోతే నేటిజనుల శరీరాలు రోగాలమయంగా ఉంటున్నాయి. మందులతో జీవితాల్ని నెట్టుకొస్తున్నారు. వైద్యం కూడా నేడు ఖరీదైంది. సామాన్యుడికి వైద్యం అందుబాటులో ఉండటం లేదు. ఆరోగ్యశ్రీ వంటి కొన్ని పథకాలు ఊరటనిస్తున్నా వైద్యం నేడు ఖరీదైన సరుకే. ఈ పరిస్థితిలో మార్పు రావాలంటే ఏమి చేయాలి? అందరికీ ఆరోగ్యం అందడం అసాధ్యమా? ఈ విషయమై ప్రభుత్వాలు ఏమి చేస్తున్నాయి? రాజకీయ నాయకులు ఏమి చేస్తున్నారు? ప్రజలకు రోగాల పట్ల అవగాహన సరైన పద్ధతిలో అందుతున్నదా? రోగాలు రాకుండా ఉండాలంటే ఏమి చేయాలి? రోగాలు వస్తే నివారణకు ఏ జాగ్రత్తలు పాటించాలి? ఏ రోగానికి ఎలాంటి మందులు, ఎంత కాలం వాడాలి? ఆహారం, వ్యాయామం వంటి విషయాలలో రావల్సిన మార్పులు ఏమిటి? రానున్న తరం వారికైనా ఆరోగ్యం విషయంలో తగు జాగ్రత్తలు,వారసత్వం అందించలేమా? ఆరోగ్యం విషయంలో ఏ వైద్య విధానం మంచిది? ఒక్కొక్క రోగానికి ఒక్కొక్క వైద్యవిధానం మంచిదా? అందరు డాక్టర్లు ఒకే జబ్బుకి, ఒకే రకం మందులు ఎందుకు వ్రాయరు? మనం వాడే మందులన్నీ మంచివేనా? మందు ఏ మోతాదులో వాడాలి? విదేశాలలో నిషేధించిన మందులు మన మార్కెట్‌లో అమ్ముతున్నారా?

ఆరోగ్యానికి సంబంధించి ప్రజలలో కనీస ఛైతన్యం తీసుకువచ్చేందుకు, ప్రజారోగ్యం కోసం సమిష్ఠిగా ఆలోచనలు చేసేందుకు, అందుకు కావలసిన మార్గాలు, చర్యలు అన్వేషించేందుకు జనవిజయం తరపున చిరు ప్రయత్నం చేయదలచుకున్నాము. వివిధ వ్యాధులు, వాటిపట్ల వైద్య రంగం ఏమి చెపుతుందనే దానిపై జనవిజయం ద్వారా వ్యాసాలు, సలహాలు అందించాలని నిర్ణయించాము. ప్రముఖ వైద్యులు, ఆహార, ఆరోగ్య నిపుణులు వివిధ సమస్యలపై అవగాహన కలిగిచేందుకు, పాఠకుల ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చేందుకు అంగీకరించారు. వారందరికీ ‘జనవిజయం’ తరపున హృదయపూర్వక ధన్యవాదాలు. అభినందనలు. మీ సందేహాలు మాకు మెయిల్‌ చేయండి. ఆయా సమస్యపై అవగాహన ఉన్న వైద్యుల చేత సమాధానాలు అందిస్తాము. ‘జనవిజయం’ పాఠకులకు అందిస్తున్న ఈ అవకాశాన్ని అందరూ వినియోగించుకోవలసిందిగా విజ్ఞప్తి. ఎవరిని ఏ ప్రశ్న అడగాలి? ఎవరెవరు రెగ్యులర్ గా అందుబాటులో ఉంటారు? అనే విషయాలను ఈ శీర్షికకు పాఠకులనుండి లభించే ఆదరణ, వారినుండి లభించే సూచనలు, సలహాలు తీసుకున్న కొద్ది రోజుల అనుభవం తరువాత మరింత వివరంగా తెలియజేస్తాము.

మీ ఆరోగ్య సమస్యలను, సలహాలను మెయిల్‌ ద్వారా [email protected] కు పంపించగలరు. వీలయితే మీ ఫోటో, వాట్సాప్ నెంబరు, మెయిల్ ఐ.డిలు పంపగలరు.

– ఎడిటర్‌

…..

'జనవిజయం' జనరల్ ఆర్టికల్స్, విశ్లేషణలు పొందడానికి, సమస్యలను 'జనవిజయం' దృష్టికి తీసుకురావడానికై జనవిజయం సోషల్ మీడియా ప్రొఫైల్స్ లలో జాయిన్ అవ్వండి:
జనవిజయం Join Link
జనవిజయం Join Link
జనవిజయం
జనవిజయం
 
ఇవీ చూడండి..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ఈ వారంలో ఎక్కువగా వీక్షించినవి:

- Advertisment -

ఎక్కువగా వీక్షించిన పోస్టులు (ఆల్-టైం):

వ్యాఖ్యలు

కట్టెకోల చిన నరసయ్య on పరిశీలన,సాధన.. రచనకు ప్రయోజనకరం

విభాగాలు

తెలంగాణజాతీయంరాజకీయంపరిపాలనఆరోగ్యంఆంధ్రప్రదేశ్ప్రత్యేకంసినిమాసాహిత్యంవాణిజ్యంస్పూర్తిఅంతర్జాతీయంప్రముఖులువ్యవసాయంవీడియోలుఆయుర్వేదంఅధ్యయనంపోల్స్వినదగునెవ్వరు చెప్పినమంతెన ఆరోగ్య సలహాలువిద్యఎడిటర్ వాయిస్జర్నలిజంవికాసంవార్త-వ్యాఖ్యతెలుసుకుందాంపర్యావరణంపిల్లల పెంపకంవీరమాచనేని డైట్ సలహాలునేర వార్తలుఎన్నికలువిజ్ఞానంసమాజంన్యాయంఆధ్యాత్మికంజీవనంఆర్ధికంఉపాధిప్రకృతిరాజ్యాంగంవాతావరణంవార్తలువినోదంసాంకేతికతకుటుంబంక్రీడలుచరిత్రనాడు-నేడుపర్యాటకంప్రకృతి వ్యవసాయంటెక్నాలజీప్రజఎడిట్ఈపేపర్టీవీపల్లెప్రపంచంపీపుల్స్ ఇంటర్వ్యూబ్లాగ్మంచిమాటమన భూమిమహా విశ్వంమా బృందంవిజయపథంవివిధసంప్రదించండి