జనవిజయంఅంతర్జాతీయంఆనందయ్య వైద్యాన్ని కొనసాగించడమే ఉత్తమం !

ఆనందయ్య వైద్యాన్ని కొనసాగించడమే ఉత్తమం !

త్మవిశ్వాసం..నమ్మిక ఎప్పుడూ భరోసాను ఇస్తాయి. వైద్యుడిపై గురి కుదిరతే అతడిచ్చే ఏ మందయినా రోగాన్ని నయం చేస్తుంది. అందుకే వైద్యులు ఈ కరోనా సమయంలో ఆత్మవిశ్వాసంతో ఉండాలని పదేపదే చెబుతున్నారు. ఎట్టి పరిసస్థితుల్లోనూ ధైర్యం కోల్పోవద్దంటున్నారు. ధైర్యంగా ఉంటే రోగనిరోధక శక్తి పెరుగుతుందని, యాంటీబాడీస్‌ ఉత్పత్తి అవుతాయని అంటున్నారు. ఆపరేషన్‌ చేసిన డాక్టర్లు సైతం భగవంతడుపై భారం వేయండని చెబుతారు. అలాంటప్పుడు కరోనా నుంచి మనిషిని బతికించే ఓ ఆత్మస్థయిర్యానికి చెందిన మందును పంపిణీ చేయకుండా ఎందుకు అడ్డుకోవాలి? ఆయుర్వేద వైద్యులు మనదేశంలో పురాతన కాలం నుంచి ఎన్నో మొండిరోగాలను నయం చేస్తూ వస్తున్నారు. పసర్లు, మూలికలతో ఎన్నో రోగాలకు వైద్యం చేస్తున్నారు. కేరళలో ఇప్పటికీ అనేక మొండి రోగాలను అక్కడి ఆయుర్వేద వైద్యులు నయం చేస్తున్నారు. కేరళ ఆయుర్వేదానికి అంతటి మహత్తు ఏర్పడింది. ఇకపోతే మనవద్దా అప్పుడప్పుడు గ్రామాల్లో ఆయుర్వేద వైద్యులు ఆయా రోగాలను నయం చేస్తూనే ఉన్నారు. హైదరాబాద్‌లో బత్తిన సోదరులు ఇచ్చే ఉబ్బసవ్యాధి మందు కూడా అనేకుల్లో ఇలాగే పనిచేసింది. అంతా రచ్చ చేయడంతో ఇప్పుడు వారిచ్చే మందులకు కొంద ఆదరణ తగ్గినా ప్రజల్లో మాత్రం నమ్మకం తగ్గలేదు. అయినంత మాత్రాన వాటిని తక్కువ చేయడం లేదా..అవి పనికి రానివనడం సరికాదు. మనిషి నమ్మకంగా ఉంటే వైద్యుడు ఇచ్చేది విషం అయినా అది అమృతంగా పనిచేస్తుంది. ఇప్పుడు నెల్లూరు జిల్లా కృష్ణపట్టణంలో ఆయుర్వేద వైద్యుడు ఆనందయ్య చేస్తున్న పని అదే. కరోనా వచ్చిన వారు ఆనందయ్య మూలికా వైద్యంతో లేచి కూర్చుంటున్నారు. ఆక్సిజన్‌ లెవల్స్‌ పెరిగాయి. కరోనా పాజిటివ్‌ నుంచి నెగెటివ్‌కు వచ్చింది. కొందరు పేరొందిన వైద్యులు ఈ ప్రక్రియను పరీక్షించి ముక్కున వేలేసు కున్నారు. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయమేమిటంటే ఆయనేవిూ మంత్రాలు చేయడం లేదు. ఆయుర్వేద వైద్యంలో వాడుతున్న మూలికలు అన్నీ మన కళ్లముందు ఉన్నవే. కాకపోతే ఆయుర్వేదంలో వాటిని సమపాళ్లలో ఉపయోగిస్తే లేదా…ఏది ఎంత ప్రమాణాంలో వాడాలో అన్నది తెలిస్తే అది దివ్యమైన ఔషధంగా మారుతుంది. ఆయుర్వేదంలో ఉన్న రహస్యమే ఇది. అలాగే కొన్ని మందులను పుటం పెట్టి తయారు చేస్తారు. ఇప్పుడు ఆనందయ్య అదేపనిచేసి, కరోనా రోగులకు భరోసా కల్పించారు. ఆక్సిజన్‌ లెవల్స్‌ పడిపోయిన వారికి కంటిలో మందు చుక్కలు వేస్తే నిమిషాల వ్యవధిలో లెవల్స్‌ పెరుగుతున్నాయన్న బాధితుల వ్యాఖ్యలు వైరల్‌ కావడంతో ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న పలువురు అంబులెన్సుల్లో కృష్ణపట్నం చేరుకున్నారు. పాజిటివ్‌ పేషెంట్లు, హోం ఐసొలేషన్‌లో ఉన్నవారు, ఒక్కసారి మందు తింటే ఇక కరోనా రాదన్న నమ్మకంతో ఆరోగ్యవంతులు సైతం భారీగా తరలివచ్చారు. కరోనాకు ఆనందయ్య మొత్తం ఐదు రకాల మందులను పంపిణీ చేస్తున్నారు. కరోనా రాకుండా రోగనిరోధక శక్తి పెంచడానికి ఒక మందు, పాజిటివ్‌ వచ్చిన వారికి నాలుగు రకాల మందులను ఇస్తున్నారు. కరోనా రాకుండా పీ రకం మందును, కోవిడ్‌ వచ్చిన వారికి పీ, ఎఫ్‌, ఎల్‌, కే రకాలను ఇస్తున్నారు. ఆక్సిజన్‌ లెవల్స్‌ పడిపోయిన వారికి నాలుగు రకాలతో పాటు పసరు డ్రాప్స్‌ ఇస్తున్నారు. ఇది ఊపిరితిత్తులను శుభ్రం చేస్తుంది. పాజిటివ్‌ వచ్చిన వారు రోజుకు రెండు సార్లు చొప్పున మూడు రోజులు, పాజిటివ్‌ లేని వారు రోగనిరోధక శక్తి పెంచుకోవడం కోసం ఒక్కరోజు రెండు సార్లు వినియోగించాలి. కానీ ప్రభుత్వ ఆ ప్రక్రియను నిలిపివేసింది. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని..ఆస్పత్రుల్లో ఐసియూల్లో ఉన్నవారు సైతం లేచి ఆనందయ్య దగ్గరకు పరుగులు తీసిన వారికి మందు పంపిణీ నిలిపివేయడం అశనిపాతంలాంటిదే. ఆయన ఇచ్చిన వైద్యం లేదా మూలికా మందులతో కరోనా నుంచి అనేకులు బయటపడ్డారు. ఇప్పుడు దేశంలో కరోనా సెకండ్‌ వేవ్‌ తీవ్రంగా ఉంది. బెడ్స్‌ దొరకడమే గగనంగా మారిన సమయంలో నెల్లూరు జిల్లాలో అనేక ఆస్పత్రుల్లో బెడ్స్‌ ఖాళీగా దర్శనమిస్తున్నాయి. ఆనందయ్య ఇస్తున్న మందులతో ఎలాంటి దుష్ఫలితాలు అంటే సైడ్‌ ఎఫెక్ట్స్‌ రాలేదు. అలాగని ఎవరూ ఆయన మందు తిని చనిపోలేదు. అలాగే కరోనా నుంచి కోలుకుని ఆనందంగా ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. ఈ క్రమంలో ప్రజలకోసం ముందుగా ఆనందయ్య మూలికా వైద్యాన్ని కొనసాగించి ఉంటే వేలాదిమంది కరోనా నుంచి బయట పడతారు. ఓ వైపు వైద్యానికి అనుమతులు ఇస్తూనే ఆనందయ్య వైద్యంపై ఐసిఎంఆర్‌ లేదా మరే ఇతర శాస్త్రవేత్తయినా పరిశోధనలు చేయొచ్చు. ఇకపోతే ప్రజల్లో ఏర్పడిన నమ్మికతో కరోనా నివారణ కోసం ఇచ్చే ఆయుర్వేద మందు కోసం వేలాదిగా తరలివచ్చిన ప్రజలతో నెల్లూరు జిల్లా కృష్ణపట్నం కిటకిటలాడడం చూస్తుంటే మందుపై ఎంతగా నమ్మకం ఏర్పడిరదో కూడా గ్రహించవచ్చు. ఇది ప్రసార మాధ్యమాల్లో వైరల్‌ కావడంతో ఇక్కడికి వేలాదిగా జనం గ్రామానికి క్యూ కట్టారు. భారీగా వచ్చిన వాహనాలతో రహదారిపై సుమారు 10కి.విూ. దూరం ట్రాఫిక్‌ స్తంభించిపోయింది. బాధితులను తీసుకొని వారి కుటుంబ సభ్యులు, బంధువులు అంబులెన్సుల్లో నేరుగా కృష్ణపట్నం చేరి పోయారు. నెల్లూరు జీజీహెచ్‌, ఇతర ప్రైవేటు ఆస్పత్రుల్లో చికిత్స కోసం ఎదురు చూస్తున్న వందలాది మంది బాధితులు అట్నుంచి అటే కృష్ణపట్నం పరుగు తీశారు. వేలాదిగా తరలి వచ్చిన రోగులందరికీ పంపిణీ చేయడానికి మందు చాలలేదు. ఈ క్రమంలో సహజంగానే ఆయుర్వేద మందుపై విమర్శలు రావడం..ప్రభుత్వం పరిశీలనకు అనుమతివ్వడం జరిగిపోయింది. దీంతో ఆయుష్‌ కమిషనర్‌ లెప్టినెంట్‌ కల్నల్‌ రాముతో సహా పలువురు ఆయుష్‌ డాక్టర్ల బృందం శుక్రవారం సాయంత్రం కృష్ణపట్నం చేరుకుంది. రాత్రి వీరు ఆయుర్వేద వైద్యుడు ఆనందయ్యతో మాట్లాడారు. ఆయుష్‌ డాక్టర్ల సమక్షంలో ఆనందయ్య మందు తయారీ విధానాన్ని ప్రదర్శించనున్నారు. వైద్యుల బృందం సంతృప్తి చెందితే మందుల పంపిణీకి అధికారికంగా అనుమతి భించే అవకాశం ఉందని అంటున్నారు. ఇప్పటికే ఆయుష్‌ ఆధికారులు ఇచ్చిన రిపోర్టుల్లో ఈ మందులో వినియోగించే పదార్థాల వల్ల ఎలాంటి హాని జరగదని, మందు తయారీ కూడా ప్రమాణాలకు లోబడే ఉందని పేర్కొన్నారు. చివరిగా మందు తయారీ విధానాన్ని ప్రత్యక్షంగా పరిశీలించిన తరువాత ప్రభుత్వానికి తుది నివేదిక ఇవ్వనున్నారు. ఆ వెనువెంటనే మందు పంపిణీపై ప్రభుత్వం అధికారిక ప్రకటన చేయనుంది. కరోనా వ్యాధికి ఆనందయ్య నెల రోజులుగా ఆయుర్వేద మందును పంపిణీ చేస్తున్న విషయం తెలిసిందే. కరోనా రోగులకు నమ్మకం ఉన్నంత వరకు, సైడ్‌ ఎఫెక్ట్స్‌ లేనంత వరకు దీనిని కొనసాగించడమే ఉత్తమం. ఇది కొందరి ప్రాణాలను అయినా నిబెడుతుంది. ప్రామాణికంగా శాస్త్రీయత రుజువైతే మూలికా వైద్యాలపై మరింత అవగాహన పెంచేందుకు పాలకులు క్రుషి చేయాల్సి ఉంటుంది. కార్పోరేట్, ఫార్మా మాఫియాలకు కొంతైనా అడ్డుకట్ట వేయగలిగితే సమాజానికి ఎంతో మేలు జరుగుతుంది

'జనవిజయం' జనరల్ ఆర్టికల్స్, విశ్లేషణలు పొందడానికి, సమస్యలను 'జనవిజయం' దృష్టికి తీసుకురావడానికై జనవిజయం సోషల్ మీడియా ప్రొఫైల్స్ లలో జాయిన్ అవ్వండి:
జనవిజయం Join Link
జనవిజయం Join Link
జనవిజయం
జనవిజయం
 
ఇవీ చూడండి..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ఈ వారంలో ఎక్కువగా వీక్షించినవి:

- Advertisment -

ఎక్కువగా వీక్షించిన పోస్టులు (ఆల్-టైం):

వ్యాఖ్యలు

కట్టెకోల చిన నరసయ్య on పరిశీలన,సాధన.. రచనకు ప్రయోజనకరం

విభాగాలు

తెలంగాణజాతీయంరాజకీయంపరిపాలనఆరోగ్యంఆంధ్రప్రదేశ్ప్రత్యేకంసినిమాసాహిత్యంవాణిజ్యంస్పూర్తిఅంతర్జాతీయంప్రముఖులువ్యవసాయంవీడియోలుఆయుర్వేదంఅధ్యయనంపోల్స్వినదగునెవ్వరు చెప్పినమంతెన ఆరోగ్య సలహాలువిద్యఎడిటర్ వాయిస్జర్నలిజంవికాసంవార్త-వ్యాఖ్యతెలుసుకుందాంపర్యావరణంపిల్లల పెంపకంవీరమాచనేని డైట్ సలహాలునేర వార్తలుఎన్నికలువిజ్ఞానంసమాజంన్యాయంఆధ్యాత్మికంజీవనంఆర్ధికంఉపాధిప్రకృతిరాజ్యాంగంవాతావరణంవార్తలువినోదంసాంకేతికతకుటుంబంక్రీడలుచరిత్రనాడు-నేడుపర్యాటకంప్రకృతి వ్యవసాయంటెక్నాలజీప్రజఎడిట్ఈపేపర్టీవీపల్లెప్రపంచంపీపుల్స్ ఇంటర్వ్యూబ్లాగ్మంచిమాటమన భూమిమహా విశ్వంమా బృందంవిజయపథంవివిధసంప్రదించండి