జనవిజయంఆంధ్రప్రదేశ్ఆనందయ్య మందుపై దుష్ప్రచారాలు వద్దంటున్న మిత్రులు

ఆనందయ్య మందుపై దుష్ప్రచారాలు వద్దంటున్న మిత్రులు

  • ఆనందయ్య మందుతో కోటయ్య మృతి చెందలేదు
  • ఆయన వివిధ రకాల వ్యాధుల వల్లే మరణించారు
  • దుష్పచారాలను ఆపాలన్న మిత్రులు

నెల్లూరు,మే31(జనవిజయం): జీజీహెచ్ లో చికిత్స పొందుతూ రిటైర్డ్ హెడ్ మాస్టర్ కోటయ్య మృతి చెందారు. ఆయన మృతిపై స్పందించిన ఆనందయ్య మిత్రుడు ఓ వీడియో పోస్టు చేశారు. ఆనందయ్య మందువల్ల బాగుందని చెప్పిన కోటయ్య వీడియో వైరల్ అయిందన్నారు. ఈ నెల 20వ తేదీన కంటి చుక్కల మందుకు మాత్రమే ఆయన కృష్ణపట్నం వచ్చారని, అప్పటికే ఆయనకు కోవిడ్ వచ్చి తగ్గిపోయిందన్నారు. ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ వల్ల ఆక్సిజన్ లెవల్స్ పడిపోతున్నాయని చెప్పడంతో చుక్కల మందు వేయడంతో ఆక్సిజన్ లెవల్స్ పెరిగాయన్నారు. ఆ తర్వాత ఆయన ఆస్పత్రిలో ఉంటే తాము వెళ్లి మాట్లాడామని, ఆయనకు 80 శాతం ఊపిరితిత్తులు పాడయ్యాయన్నారు. అలాగే వేరే ఆరోగ్య సమస్యలతో చికిత్స పొందుతూ చనిపోయారన్నారు. అయితే ఆనందయ్య మందుతో చనిపోయాడని చెప్పడం చాలా బాధాకరమని అన్నారు. ఇలాంటి వార్తలు ప్రచారం చేయవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. గతంలో ఆనందయ్య మందుతో కోలుకున్నానని కోటయ్య చెప్పిన విషయం తెలిసిందే. అప్పట్లో సామాజిక మాధ్యమాల్లో కోటయ్య వీడియోలు హల్ చల్ చేశాయి. అయితే ఆనందయ్య వైద్యాన్ని తప్పుగా నిరూపించడం కోసం కూడా ప్రయత్నాలు జరిగాయి. తాజాగా ఆయన జీజీహెచ్లో చికిత్స పొందుతూ మరణించారు. ఆనందయ్య మందు తీసుకున్న అనంతరం ఆక్సిజన్ లెవల్స్ పెరగడంతో కుదుటపడ్డారు. అనంతరం ఆయన ఆరోగ్యం తిరిగి విషమించడంతో కుటుంబ సభ్యులు జీజీహెచ్ కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ కోటయ్య సోమవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. అప్పట్లో దాదాపు మరణం అంచులకు వెళ్లి ఆనందయ్య మందుతో తిరిగి వచ్చానని కోటయ్య చెప్పిన వీడియో వైరల్ అయ్యింది. ఊపిరి అందడంలేదు. కొన ఊపిరితో ఉన్న.. ఇంకా రెండు నిముషాలు ఆగితే, ఆక్సిజన్ లేకపోతే చనిపోతా.. దీంతో వెంటనే మావాళ్లు వచ్చి వెంటనే కంటిలో మందు వేశారు. 10, 15 నిముషాల్లో కోలుకున్నానని, ఈ మందు చాలా అద్భుతం అని గతంలో కోటయ్య తెలిపారు.

'జనవిజయం' జనరల్ ఆర్టికల్స్, విశ్లేషణలు పొందడానికి, సమస్యలను 'జనవిజయం' దృష్టికి తీసుకురావడానికై జనవిజయం సోషల్ మీడియా ప్రొఫైల్స్ లలో జాయిన్ అవ్వండి:
జనవిజయం Join Link
జనవిజయం Join Link
జనవిజయం
జనవిజయం
 
ఇవీ చూడండి..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ఈ వారంలో ఎక్కువగా వీక్షించినవి:

- Advertisment -

ఎక్కువగా వీక్షించిన పోస్టులు (ఆల్-టైం):

వ్యాఖ్యలు

కట్టెకోల చిన నరసయ్య on పరిశీలన,సాధన.. రచనకు ప్రయోజనకరం

విభాగాలు

తెలంగాణజాతీయంరాజకీయంపరిపాలనఆరోగ్యంఆంధ్రప్రదేశ్ప్రత్యేకంసినిమాసాహిత్యంవాణిజ్యంస్పూర్తిఅంతర్జాతీయంప్రముఖులువ్యవసాయంవీడియోలుఆయుర్వేదంఅధ్యయనంపోల్స్వినదగునెవ్వరు చెప్పినమంతెన ఆరోగ్య సలహాలువిద్యఎడిటర్ వాయిస్జర్నలిజంవికాసంవార్త-వ్యాఖ్యతెలుసుకుందాంపర్యావరణంపిల్లల పెంపకంవీరమాచనేని డైట్ సలహాలునేర వార్తలుఎన్నికలువిజ్ఞానంసమాజంన్యాయంఆధ్యాత్మికంజీవనంఆర్ధికంఉపాధిప్రకృతిరాజ్యాంగంవాతావరణంవార్తలువినోదంసాంకేతికతకుటుంబంక్రీడలుచరిత్రనాడు-నేడుపర్యాటకంప్రకృతి వ్యవసాయంటెక్నాలజీప్రజఎడిట్ఈపేపర్టీవీపల్లెప్రపంచంపీపుల్స్ ఇంటర్వ్యూబ్లాగ్మంచిమాటమన భూమిమహా విశ్వంమా బృందంవిజయపథంవివిధసంప్రదించండి