జనవిజయంఆంధ్రప్రదేశ్రాజకీయాలు పక్కన పెట్టి ఆనందయ్య మందు పంపిణీ జరపాలి - మాజీ మంత్రి సోమిరెడ్డి

రాజకీయాలు పక్కన పెట్టి ఆనందయ్య మందు పంపిణీ జరపాలి – మాజీ మంత్రి సోమిరెడ్డి

  • ఆనందయ్య మందు ప్రాంతాన్ని పరిశీలించిన టిడిపి బృందం
  • నివేదికలను సాకుగా చూపి కాలయాపన చేయవద్దు
  • ఆనందయ్య ముందు తక్షణమే పంపిణీ జరిగేలా జగన్ చూడాలి

నెల్లూరు, మే25(జనవిజయం): కృష్ణపట్నం ఆనందయ్య ఆయుర్వేద మందు తయారు చేసే ప్రాంతాన్ని టీడీపీ ప్రతినిధి బృందం మంగళవారం సందర్శించింది. మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, బీదా రవిచంద్ర, పెళ్లకూరు శ్రీనివాసులురెడ్డి ఆధ్వర్యంలో నేతలు స్థానికంగా జరుగుతున్న ఔషధ పంపిణీని పరిశీలించారు. ఈ సందర్భంగా అక్కడ జరిగిన ఘటన టీడీపీ నేతలను ఆశ్చర్యపరిచింది. తెలంగాణలోని కరీంనగర్ జిల్లా పెద్దపల్లి గ్రామానికి చెందిన విద్యార్థి విషమ పరిస్థితుల్లో అక్కడికి వచ్చాడు. సోమిరెడ్డి సమక్షంలోనే అతడి కంటిలో ఆనందయ్య కుటుంబ సభ్యులు చుక్కలు వేశారు. 15 నిమిషాల్లో ఆ విద్యార్థి లేచి కూర్చోవడంతో అక్కడున్న వారంతా ఆశ్చర్యపోయారు. అనంతరం ఆ విద్యార్థి మాట్లాడుతూ.. తమలాంటి పేదలకు ఆనందయ్య ముందు పంపిణీ జరిగేలా చూడాలని అభ్యర్థించాడు. సోమిరెడ్డి మాట్లాడుతూ.. నెల్లూరు జిల్లా నాయకులు, అధికారులు రాజకీయాలు పక్కన పెట్టి ఆనందయ్య మందు పంపిణీ జరిగేలా చూడాలని డిమాండ్ చేశారు. నివేదికలను సాకుగా చూపి కాలయాపన చేయకుండా ఆనందయ్య ముందు పంపిణీ జరిగేలా సీఎం జగన్మోహన్ రెడ్డి చొరవ తీసుకోవాలన్నారు. గతంలో కృష్ణపట్నం పోర్టు వల్ల దేశం మొత్తం కృష్ణపట్నం వైపు చూసిందని, మళ్లీ నేడు ఆనందయ్య మందువల్ల దేశమంతా కృష్ణపట్నం వైపు దృష్టిసారించిందని టీడీపీ జాతీయ కార్యదర్శి బీద చంద్ర అన్నారు.

'జనవిజయం' జనరల్ ఆర్టికల్స్, విశ్లేషణలు పొందడానికి, సమస్యలను 'జనవిజయం' దృష్టికి తీసుకురావడానికై జనవిజయం సోషల్ మీడియా ప్రొఫైల్స్ లలో జాయిన్ అవ్వండి:
జనవిజయం Join Link
జనవిజయం Join Link
జనవిజయం
జనవిజయం
 
ఇవీ చూడండి..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ఈ వారంలో ఎక్కువగా వీక్షించినవి:

- Advertisment -

ఎక్కువగా వీక్షించిన పోస్టులు (ఆల్-టైం):

వ్యాఖ్యలు

విభాగాలు

తెలంగాణజాతీయంరాజకీయంపరిపాలనఆరోగ్యంఆంధ్రప్రదేశ్ప్రత్యేకంసినిమాసాహిత్యంవాణిజ్యంస్పూర్తిఅంతర్జాతీయంవ్యవసాయంప్రముఖులువీడియోలుఆయుర్వేదంఅధ్యయనంపోల్స్వినదగునెవ్వరు చెప్పినమంతెన ఆరోగ్య సలహాలువిద్యజర్నలిజంఎడిటర్ వాయిస్వికాసంవార్త-వ్యాఖ్యతెలుసుకుందాంపర్యావరణంపిల్లల పెంపకంవీరమాచనేని డైట్ సలహాలునేర వార్తలుఎన్నికలువిజ్ఞానంన్యాయంసమాజంఆధ్యాత్మికంజీవనంఆర్ధికంఉపాధిప్రకృతిరాజ్యాంగంవాతావరణంవార్తలువినోదంసాంకేతికతకుటుంబంక్రీడలుచరిత్రనాడు-నేడుపర్యాటకంప్రకృతి వ్యవసాయంటెక్నాలజీప్రజఎడిట్ఈపేపర్టీవీపల్లెప్రపంచంపీపుల్స్ ఇంటర్వ్యూబ్లాగ్మంచిమాటమన భూమిమహా విశ్వంమా బృందంవిజయపథంవివిధసంప్రదించండి