జనవిజయంఆంధ్రప్రదేశ్మందు పంపిణీకి ఓ.కే..... అయితే, ఆనందయ్య మందుతోనే కరోనా తగ్గుతుందన్న గ్యారంటీ లేదు

మందు పంపిణీకి ఓ.కే….. అయితే, ఆనందయ్య మందుతోనే కరోనా తగ్గుతుందన్న గ్యారంటీ లేదు

  • ఆనందయ్య మందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్
  • కంట్లో చుక్కల మందుకు మాత్రం నిరాకరణ
  • ఆనందం వ్యక్తం చేసిన ఆనందయ్య
  • ఆనందయ్య మందుతో కరోనా తగ్గుతుందన్న గ్యారంటీ లేదు
  • ఆనందయ్య మందుతో పాటు డాక్టర్ల మందులూ వాడాలి
  • ప్రజలకు ప్రభుత్వం విజ్ఞప్తి

అమరావతి,మే31(జనవిజయం): కరోనా మహమ్మారికి విరుగుడుగా ఆనందయ్య ఇస్తున్న మందులకు ఏపీ ప్రభుత్వం ఎట్టకేలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కళ్లలో వేసే డ్రాప్స్ తప్ప మిగితా అన్ని మందులకు ప్రభుత్వం అనుమతి మంజూరు చేసింది. సీసీఆర్ఎస్ఎన్ నివేదిక ప్రకారం ఆనందయ్య ఇచ్చే పి, ఎల్, ఎఫ్ మందులకు అనుమతి ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కంట్లో వేసే మందుపై ఇంకా నివేదికలు రాలేదని, అవి వచ్చాక ఆ మందుపై నిర్ణయం తీసుకుంటామని ప్రభుత్వం చెప్తోంది. అలాగే ‘కె’ అనే మందును కమిటీ ముందు చూపించకపోవడంతో దానికి కూడా అనుమతి నిరాకరించింది. ఇక ఆనందయ్య ఇస్తున్న మిగిలిన మందుల వల్ల ఎలాంటి హాని లేదని సీసీఆర్ఎస్ నివేదిక తేల్చడంతో ప్రభుత్వం వాటికి అనుమతి ఇచ్చినట్లు తెలుస్తోంది. కంట్లో వేసే డ్రాప్స్ విషయంలో పూర్తి నివేదికలు రావడానికి మరో 2, 3 వారాల సమయం పడుతుందని ప్రభుత్వం భావిస్తోంది.

ఆనందయ్య మందుకు అనుమతి ఇచ్చిన నేపథ్యంలో ప్రజలకు ప్రభుత్వం ఓ విజ్ఞప్తి చేసింది. ఆనందయ్య మందు వాడినంత మాత్రాన మిగిలిన మందులను ఆపొద్దని కోరింది. డాక్టర్లు ఇచ్చిన మందులు వాడుతూ.. ఎవరి ఇష్ట ప్రకారం వారు ఆనందయ్య మందును వాడుకోవచ్చని, అయితే మందును తీసుకోవడానికి కొవిడ్ పాజిటివ్ రోగులు రాకుండా ఉండాలని ప్రభుత్వం సూచించింది. రోగులకు బుదులు వారి కుటుంబ సభ్యులు, బంధువులు వచ్చి మందును తీసుకెళ్తే కొవిడ్ విస్తరించే ప్రమాదం తప్పుతుందని చెప్పిన ప్రభుత్వం.. మందు పంపిణీలో కొవిడ్ ప్రోటోకాల్ పాటించాలని ఆదేశించింది. ఇదిలావుంటే మందు పంపిణీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నేపథ్యంలో ఆనందయ్య సంతోషం వ్యక్తం చేశారు. ఆయన ఇంటి వద్ద సందడి నెలకొంది. ప్రస్తుతం ఆనందయ్య కృష్ణపట్నం సెక్యూరిటీ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ అకాడమిలోనే ఉన్నారు. ఇప్పటికైనా ఆనందయ్యకు పోలీసులు విముక్తి కలిగిస్తారని గ్రామస్తులు, కుటుంబసభ్యులు భావిస్తున్నారు. సోమవారం సాయంత్రానికి ఆనందయ్య ఇంటికి చేరుకునే అవకాశం ఉన్నట్లు సమాచారం. మొత్తానికి ఈ మందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంపై పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

మరోవైపు ఆనందయ్య మందుని వెలుగులోకి తెచ్చిన హెడ్మాష్టరు కోటయ్య మరణించడంతో ఆనందయ్య మందు వాడినా కరోనా తగ్గడం లేదన్న వదంతులు వినపడుతున్నాయి. అయితే ఆనందయ్య మందు వల్ల కోటయ్య చనిపోలేదనీ, కోటయ్య వివిధ సమస్యలకు అల్లోపతి చికిత్స తీసుకుంటున్న సంగతిని ఆయన అభిమానులు గుర్తు చేస్తుండగా రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఆనందయ్య మందులతో పాటు డాక్టర్లు ఇస్తున్న మందులు కూడా వాడాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తుండడం గమనార్హం. ఆనందయ్య మందులతో అనేక సంవత్సరాలుగా అనేక రోగాలనుండి క్రుష్ణపట్నం, ఇతర గ్రామాల ప్రజలు ఆరోగ్యంతో ఉన్నారని, ఆనందయ్య కుటుంబం సాంప్రదాయంగా ఇస్తున్న మందులతో అనేకులు ప్రయోజనం పొందారని గ్రామస్తులు చెబుతున్నారు. ఆనందయ్య మందు పంపిణీకి ఎ.ఫి ప్రభుత్వం అనుమతించడం పట్ల గ్రామంలో సందడి నెలకొంది.

'జనవిజయం' జనరల్ ఆర్టికల్స్, విశ్లేషణలు పొందడానికి, సమస్యలను 'జనవిజయం' దృష్టికి తీసుకురావడానికై జనవిజయం సోషల్ మీడియా ప్రొఫైల్స్ లలో జాయిన్ అవ్వండి:
జనవిజయం Join Link
జనవిజయం Join Link
జనవిజయం
జనవిజయం
 
ఇవీ చూడండి..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ఈ వారంలో ఎక్కువగా వీక్షించినవి:

- Advertisment -

ఎక్కువగా వీక్షించిన పోస్టులు (ఆల్-టైం):

వ్యాఖ్యలు

కట్టెకోల చిన నరసయ్య on పరిశీలన,సాధన.. రచనకు ప్రయోజనకరం

విభాగాలు

తెలంగాణజాతీయంరాజకీయంపరిపాలనఆరోగ్యంఆంధ్రప్రదేశ్ప్రత్యేకంసినిమాసాహిత్యంవాణిజ్యంస్పూర్తిఅంతర్జాతీయంప్రముఖులువ్యవసాయంవీడియోలుఆయుర్వేదంఅధ్యయనంపోల్స్వినదగునెవ్వరు చెప్పినమంతెన ఆరోగ్య సలహాలువిద్యఎడిటర్ వాయిస్జర్నలిజంవికాసంవార్త-వ్యాఖ్యతెలుసుకుందాంపర్యావరణంపిల్లల పెంపకంవీరమాచనేని డైట్ సలహాలునేర వార్తలుఎన్నికలువిజ్ఞానంసమాజంన్యాయంఆధ్యాత్మికంజీవనంఆర్ధికంఉపాధిప్రకృతిరాజ్యాంగంవాతావరణంవార్తలువినోదంసాంకేతికతకుటుంబంక్రీడలుచరిత్రనాడు-నేడుపర్యాటకంప్రకృతి వ్యవసాయంటెక్నాలజీప్రజఎడిట్ఈపేపర్టీవీపల్లెప్రపంచంపీపుల్స్ ఇంటర్వ్యూబ్లాగ్మంచిమాటమన భూమిమహా విశ్వంమా బృందంవిజయపథంవివిధసంప్రదించండి