జనవిజయంఆంధ్రప్రదేశ్ఆనందయ్య ‘కె’మందుకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్

ఆనందయ్య ‘కె’మందుకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్

  • మందును ప్రారంభించిన ఎమ్మెల్యే కాకాణి అందరికీ అందేలా చూస్తామన్న ఎమ్మెల్యే

అమరావతి,జూన్ 7 (జనవిజయం): ఆనందయ్య మందుకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. గతంలో ఆనందయ్య కె మందును ప్రభుత్వం నిలుపుదల చేసిన విషయం తెలిసిందే. కరోనా బాధితులకు తక్షణమే కె మందును పంపిణీ చేయాలంటూ ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. కంటి చుక్కల మందుకు సంబంధించి రెండు వారాల్లో నివేదిక అందించాలని ధర్మాసనం సూచించింది. తదుపరి విచారణను హైకోర్టు ఈనెల 21కి వాయిదా వేసింది. దీంతో సోమవారం నుంచి ఆనందయ్య మందు పంపిణీ ప్రారంభమైంది. కంట్లో వేసే మందుకు సంబంధించిన నివేదికలు రావాల్సి ఉన్నాయంటూ గతంలో ఏపీ ప్రభుత్వం కె మందుకు అనుమతిని ఇవ్వలేదు. ఈ మందును కమిటీ ముందు చూపించలేదు కాబట్టి దీనికి ఏపీ ప్రభుత్వం అనుమతి నిరాకరించింది. ఆనందయ్య ఇచ్చే పి, ఎల్, ఎఫ్… మందులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సీసీఆర్ఎఎన్ నివేదిక ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఆనందయ్య ఇస్తున్న మిగిలిన మందుల వల్ల హాని లేదని నివేదికలు తేల్చాయి. సీసీఆర్ఎస్ నివేదిక ప్రకారం ఆనందయ్య మందు వాడితే హాని లేదని నివేదికలు తేల్చాయి.

నెల్లూరు జిల్లా గొలగమూడిలో ఆనందయ్య మందు పంపిణీని ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రోజుకి 2 వేల నుంచి 3 వేలమందికి ఆనందయ్య మందు పంపిణీ చేస్తామని తెలిపారు. ఆనందయ్య విశేషమైన సేవలు అందిస్తున్నారన్నారు. అల్లోపతి మందులు వాడుతూనే ఆనందయ్య మందు తీసుకోవాలని కాకాణి సూచించారు. ఆనందయ్య మందుతో ఎలాంటి దుష్పరిణామాలు లేవు. సోమవారం నుంచి మందు పంపిణీ చేస్తామని చెప్పి.. ఆనందయ్య ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. కోవిడ్ వచ్చిన వారు ఎరుపు రంగు ప్యాకెట్ మందు వాడాలి. కోవిడ్ నివారణ కోసం నీలం రంగు ప్యాకెట్ మందు వాడాలి. ప్రజలకు మేలుచేసే ఉద్దేశం తోనే ఆనందయ్యకు మద్దతు ఇచ్చాం. కేవలం సర్వేపల్లితోనే ఆనందయ్య మందు ఆగిపోదు. త్వరలోనే ఇతర జిల్లాలకూ ఆనందయ్య మందు పంపిణీ చేస్తాం. ఆనందయ్య కుటుంబానికి భవిష్యత్ లోనూ అండగా నిలుస్తాం. ప్రతిఒక్క ఇంటికీ ఆనందయ్య మందు పంపిణీ జరుగుతుందని ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్ రెడ్డి అన్నారు.

'జనవిజయం' జనరల్ ఆర్టికల్స్, విశ్లేషణలు పొందడానికి, సమస్యలను 'జనవిజయం' దృష్టికి తీసుకురావడానికై జనవిజయం సోషల్ మీడియా ప్రొఫైల్స్ లలో జాయిన్ అవ్వండి:
జనవిజయం Join Link
జనవిజయం Join Link
జనవిజయం
జనవిజయం
 
ఇవీ చూడండి..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ఈ వారంలో ఎక్కువగా వీక్షించినవి:

- Advertisment -

ఎక్కువగా వీక్షించిన పోస్టులు (ఆల్-టైం):

వ్యాఖ్యలు

కట్టెకోల చిన నరసయ్య on పరిశీలన,సాధన.. రచనకు ప్రయోజనకరం

విభాగాలు

తెలంగాణజాతీయంరాజకీయంపరిపాలనఆరోగ్యంఆంధ్రప్రదేశ్ప్రత్యేకంసినిమాసాహిత్యంవాణిజ్యంస్పూర్తిఅంతర్జాతీయంప్రముఖులువ్యవసాయంవీడియోలుఆయుర్వేదంఅధ్యయనంపోల్స్వినదగునెవ్వరు చెప్పినమంతెన ఆరోగ్య సలహాలువిద్యఎడిటర్ వాయిస్జర్నలిజంవికాసంవార్త-వ్యాఖ్యతెలుసుకుందాంపర్యావరణంపిల్లల పెంపకంవీరమాచనేని డైట్ సలహాలునేర వార్తలుఎన్నికలువిజ్ఞానంసమాజంన్యాయంఆధ్యాత్మికంజీవనంఆర్ధికంఉపాధిప్రకృతిరాజ్యాంగంవాతావరణంవార్తలువినోదంసాంకేతికతకుటుంబంక్రీడలుచరిత్రనాడు-నేడుపర్యాటకంప్రకృతి వ్యవసాయంటెక్నాలజీప్రజఎడిట్ఈపేపర్టీవీపల్లెప్రపంచంపీపుల్స్ ఇంటర్వ్యూబ్లాగ్మంచిమాటమన భూమిమహా విశ్వంమా బృందంవిజయపథంవివిధసంప్రదించండి