జనవిజయంఆరోగ్యంఆంఫోటెరిసిన్-బి డిమాండ్‌‌పై ఆరా

ఆంఫోటెరిసిన్-బి డిమాండ్‌‌పై ఆరా

న్యూఢిల్లీ, మే 19 (జనవిజయం): మ్యుకోర్‌మైకోసిస్‌ చికిత్సలో ఉపయోగించే ఆంఫోటెరిసిన్‌-బి కోసం దేశవ్యాప్తంగా నెలకొన్న డిమాండ్‌, సరఫరాపై కేంద్ర రసాయనాలు, ఎరువుల శాఖ సహాయ మంత్రి మన్‌సుఖ్‌ మాండవీయ సమీక్ష నిర్వహించారు. దేశీయ ఉత్పత్తిని పెంచడంతోపాటు, ప్రపంచ దేశాల నుంచి ఈ ఔషధాన్ని దిగుమతి చేసుకునేలా తయారీదారులతో కలిసి కేంద్ర ప్రభుత్వం ఒక వ్యూహాన్ని రూపొందించింది. దేశవ్యాప్తంగా ఆంఫోటెరిసిన్‌-బి సరఫరా అనేక రెట్లు పెరిగినట్లు మంత్రి గుర్తించారు. కానీ, ఈ ఔషధానికి ఆకస్మిక డిమాండ్‌ ఏర్పడింది. అవసరమైన రోగులకు ఈ మందును అందించేందుకు సాధ్యమైన అన్ని ప్రయత్నాలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర మంత్రి స్పష్టం చేశారు.

ఆంఫోటెరిసిన్‌-బి సరఫరా, పంపిణీ గొలుసును సమర్థవంతంగా నిర్వహించేందుకు ఒక విధానాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం సూచించింది. సాధ్యమైనంత త్వరగా ఔషధం లోటు భర్తీ అవుతుందని భావిస్తున్నారు. కేంద్రం సూచించిన మార్గదర్శకాలను ఖచ్చితంగా పాటిస్తూ, ఔషధాన్ని సక్రమంగా వినియోగించాలని మాండవీయ అన్ని రాష్ట్రాలను కోరారు.

'జనవిజయం' జనరల్ ఆర్టికల్స్, విశ్లేషణలు పొందడానికి, సమస్యలను 'జనవిజయం' దృష్టికి తీసుకురావడానికై జనవిజయం సోషల్ మీడియా ప్రొఫైల్స్ లలో జాయిన్ అవ్వండి:
జనవిజయం Join Link
జనవిజయం Join Link
జనవిజయం
జనవిజయం
 
ఇవీ చూడండి..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ఈ వారంలో ఎక్కువగా వీక్షించినవి:

- Advertisment -

ఎక్కువగా వీక్షించిన పోస్టులు (ఆల్-టైం):

వ్యాఖ్యలు

కట్టెకోల చిన నరసయ్య on పరిశీలన,సాధన.. రచనకు ప్రయోజనకరం

విభాగాలు

తెలంగాణజాతీయంరాజకీయంపరిపాలనఆరోగ్యంఆంధ్రప్రదేశ్ప్రత్యేకంసినిమాసాహిత్యంవాణిజ్యంస్పూర్తిఅంతర్జాతీయంప్రముఖులువ్యవసాయంవీడియోలుఆయుర్వేదంఅధ్యయనంపోల్స్వినదగునెవ్వరు చెప్పినమంతెన ఆరోగ్య సలహాలువిద్యఎడిటర్ వాయిస్జర్నలిజంవికాసంవార్త-వ్యాఖ్యతెలుసుకుందాంపర్యావరణంపిల్లల పెంపకంవీరమాచనేని డైట్ సలహాలునేర వార్తలుఎన్నికలువిజ్ఞానంసమాజంన్యాయంఆధ్యాత్మికంజీవనంఆర్ధికంఉపాధిప్రకృతిరాజ్యాంగంవాతావరణంవార్తలువినోదంసాంకేతికతకుటుంబంక్రీడలుచరిత్రనాడు-నేడుపర్యాటకంప్రకృతి వ్యవసాయంటెక్నాలజీప్రజఎడిట్ఈపేపర్టీవీపల్లెప్రపంచంపీపుల్స్ ఇంటర్వ్యూబ్లాగ్మంచిమాటమన భూమిమహా విశ్వంమా బృందంవిజయపథంవివిధసంప్రదించండి