అమ్మ అమ్మే

అమ్మ…అమ్మే

అమ్మ గురించి రాయటానికి ఏముంటుంది
అనుకుంటూ మొదలు పెడితే
అక్షరాలు,పదాలు సరిపోవని అర్థమైంది…

ప్రపంచ భాషలన్నీ కలిపినా వర్ణించటానికి
సరైన పదం దొరక్క ఆశ్చర్యమైంది…

రోజు మొదలు నిద్రించే దాకా
మన ప్రతి కదలికలో తానే ఉందేంటని
అబ్బురపడి ఋణం తీరని బంధమనిపించింది
సాధారణమనిపించే అసాధారణ వ్యక్తిత్వంతో
సవ్యసాచిగా ఒకేసారి పది పనులు పూర్తి చేసే
ఆ లౌక్యం అమ్మకెలా అబ్బిందో…

ఒకేసారి చుట్టుముట్టిన సమస్యలను
లౌక్యంతో అంత సులువుగా
పరిష్కరించే నేర్పు చూసి
నిజం చెప్పొద్దూ

ఈ చదువు ఎక్కడ దొరుకుతుందని వెతికితే
అది అమ్మకు చెందిన విశ్వవిద్యాలయంలోనే
అని అర్థమై ఒకింత సిగ్గు ఆవహించింది…
అమ్మకు మాత్రమే సాధ్యమైన
ఆ నేర్పు ఓర్పు సహనం పట్టుదలలో
కొంతైనా పట్టుబడితే

జీవితాన్ని ఈదటం చాలా తేలికేమో అనిపించింది
కాని అది అమ్మకే సొంతమైన పాఠ్య ప్రణాళిక
అంతే కదా మరి
అమ్మ అమ్మే కాని మనం కాదు కదా…

కరోనా మహమ్మారి మనల్ని చుట్టుముట్టిన వేళ
మన మనో ధైర్య మైన
అమ్మకు శ్వాస కరువవుతున్నా
మన కడుపులు నింపటానికి పడుతున్న
ఆరాటం చూస్తున్నాం కదా…అదే అమ్మంటే….

'జనవిజయం' జనరల్ ఆర్టికల్స్, విశ్లేషణలు పొందడానికి, సమస్యలను 'జనవిజయం' దృష్టికి తీసుకురావడానికై జనవిజయం సోషల్ మీడియా ప్రొఫైల్స్ లలో జాయిన్ అవ్వండి:
జనవిజయం Join Link
జనవిజయం Join Link
జనవిజయం
జనవిజయం
 
  • అట్లూరి వెంకటరమణ
    9550776152
ఇవీ చూడండి..

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ఈ వారంలో ఎక్కువగా వీక్షించినవి:

- Advertisment -

ఎక్కువగా వీక్షించిన పోస్టులు (ఆల్-టైం):

వ్యాఖ్యలు

విభాగాలు

తెలంగాణజాతీయంరాజకీయంపరిపాలనఆంధ్రప్రదేశ్ఆరోగ్యంప్రత్యేకంసినిమావాణిజ్యంసాహిత్యంస్పూర్తిఅంతర్జాతీయంవ్యవసాయంప్రముఖులుఆయుర్వేదంపోల్స్విద్యఅధ్యయనంమంతెన ఆరోగ్య సలహాలువీడియోలుజర్నలిజంవికాసంవినదగునెవ్వరు చెప్పినపర్యావరణంఎడిటర్ వాయిస్ఎన్నికలుతెలుసుకుందాంపిల్లల పెంపకంవిజ్ఞానంవార్త-వ్యాఖ్యనేర వార్తలువీరమాచనేని డైట్ సలహాలుఆధ్యాత్మికంజీవనంన్యాయంఆర్ధికంఉపాధిప్రకృతివాతావరణంవార్తలురాజ్యాంగంసమాజంక్రీడలుచరిత్రనాడు-నేడుపర్యాటకంప్రకృతి వ్యవసాయంటెక్నాలజీవినోదంసాంకేతికతఎడిట్కుటుంబంప్రజఈపేపర్టీవీపల్లెప్రపంచంపీపుల్స్ ఇంటర్వ్యూబ్లాగ్మంచిమాటమన భూమిమహా విశ్వంమా బృందంవిజయపథంవివిధసంప్రదించండి