జనవిజయంఆరోగ్యంఅల్ఫా వేవ్ కంటే తీవ్రంగా వ్యాపిస్తున్న సెకండ్ వేవ్

అల్ఫా వేవ్ కంటే తీవ్రంగా వ్యాపిస్తున్న సెకండ్ వేవ్

సెకండ్ వేవ్ గ్రామాల్లోనూ తీవ్ర ప్రభావం

న్యూఢిల్లీ, జూన్ 4(జనవిజయం): కరోనా మహమ్మారి దేశాన్ని కుదిపేస్తున్న క్రమంలో మొదటి వేవ్ ప్రభావం నగరాలు, పట్టణాల్లో అధికంగా ఉండగా, సెకండ్ వేవ్ ప్రభావం గ్రామాలు, పల్లెలపై ఉన్నది. దీంతో గ్రామాల్లోని ప్రజలు ఆందళన చెందుతున్నారు. బయటకు రావాలంటే ఆలోచిస్తున్నారు. మొదటి వేవ్ సమయంలో నగరాలకు వలన వెళ్లిన కూలీలు కరోనా కారణంగా తిరిగి పల్లెబాట పట్టారు. నగరాల నుంచి పల్లెలకు చేరుకోవడంతో మెల్లిగా గ్రామాల్లో కరోనా విస్తరించడం మొదలైంది. గ్రామాల్లో వైద్యసేవలు ఎంతవరకు అందుబాటులో ఉంటాయో అందరికి తెలిసిందే. ఒకసారి కరోనా గ్రామంలో వ్యాపించడం మొదలు పెడితే దానిని అడ్డుకోవడం కష్టం అవుతుందని వైద్యనిపుణులు గతంలో పలుమార్లు తెలియజేశారు. సెకండ్ వేవ్ ఎఫెక్ట్ గ్రామాలపైనే అధికంగా ఉండటంతో అధికారులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు. గ్రామాల్లోని ప్రజలు కూడా అప్రమత్తం కావడంతో కరోనాను కొంతమేర అడ్డుకున్నారని చెప్పొచ్చు. ఇకపోతే ఇండియాలో తొలిసారి కనిపించిన కరోనా వేరియంట్ వల్లే ఇండియాలో సెకండ్ వేవ్ వచ్చిందని ప్రభుత్వ అధ్యయనం తేల్చింది. బీ.1.612.2గా గతంలో పిలిచిన దీనినే ఈ మధ్య డబ్ల్యూహెచ్ వో డెల్టా వేరియంట్ గా గుర్తించిన విషయం తెలిసిందే. యూకేలోని కెంలో గుర్తించిన ఆల్ఫా వేరియంట్ కంటే కూడా ఇది వేగంగా వ్యాపించిందని ఈ అధ్యయనం స్పష్టం చేసింది. ఇండియన్ సార్స్ కొవ్2 జీనోమిక్ కాన్సార్షియా, నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ ఈ అధ్యయనం నిర్వహించింది. నిజానికి ఆల్ఫా వేరియంట్ కంటే ఈ డెల్టా వేరియంట్ 50 శాతం ఎక్కువ వ్యాపించిందని ఈ అధ్యయనం స్పష్టం చేసింది. దేశంలో 12,200 వేరియంట్లు ఆందోళన కలిగించేవిగా ఉన్నాయని, తమ అధ్యయనం కొనసాగుతోందని ఈ సంస్థలు తెలిపాయి. అయితే డెల్టా వేరియంట్ తో పోలిస్తే.. ఈ వేరియంట్ల ఉనికి చాలా చాలా తక్కువని చెప్పాయి. సెకండ్ వేవ్ లో అన్ని ఇతర వేరియంట్లను ఈ డెల్టా వేరియంట్ రీప్లేన్ చేసిందని ఈ అధ్యయనం తేల్చింది. డెల్టా వేరియంట్ దాదాపు అన్ని రాష్ట్రాల్లోనూ కనిపించింది. అయితే ముఖ్యంగా తెలంగాణతో పాటు ఢిల్లీ, ఆంధప్రదేశ్, గుజరాత్, మహారాష్ట్ర, ఒడిశాల్లో ఎక్కువగా ఉన్నట్లు తేలింది. వ్యాక్సిన్లు వేసుకున్న తర్వాత కూడా వచ్చిన ఇన్ఫెక్షన్లలో ఈ డెల్టా వేరియంట్ ప్రభావమే ఎక్కువగా ఉంది. అదే ఆల్ఫా వేరియంట్ మాత్రం వ్యాక్సిన్ వేసుకున్న తర్వాత రాలేదు. అయితే డెల్టా వేరియంట్ వల్ల ఎక్కువ మరణాలు, వ్యాధి తీవ్రత ఎక్కువైనట్లు మాత్రం నిరూపితం కాలేదు. ఈ అధ్యయనంలో భాగంగా ఇండియాలో చేసిన 29 వేల జీనోమ్ నీక్వెన్సింగ్ లను పరిశీలించారు. ఇందులో 8900 శాంపిల్స్ లో బీ.1.617 కనిపించింది. అందులో డెల్టా వేరియంట్ వెయ్యి శాంపిళ్లలో ఉన్నట్లు గుర్తించారు.

'జనవిజయం' జనరల్ ఆర్టికల్స్, విశ్లేషణలు పొందడానికి, సమస్యలను 'జనవిజయం' దృష్టికి తీసుకురావడానికై జనవిజయం సోషల్ మీడియా ప్రొఫైల్స్ లలో జాయిన్ అవ్వండి:
జనవిజయం Join Link
జనవిజయం Join Link
జనవిజయం
జనవిజయం
 
ఇవీ చూడండి..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ఈ వారంలో ఎక్కువగా వీక్షించినవి:

- Advertisment -

ఎక్కువగా వీక్షించిన పోస్టులు (ఆల్-టైం):

వ్యాఖ్యలు

కట్టెకోల చిన నరసయ్య on పరిశీలన,సాధన.. రచనకు ప్రయోజనకరం

విభాగాలు

తెలంగాణజాతీయంరాజకీయంపరిపాలనఆరోగ్యంఆంధ్రప్రదేశ్ప్రత్యేకంసినిమాసాహిత్యంవాణిజ్యంస్పూర్తిఅంతర్జాతీయంప్రముఖులువ్యవసాయంవీడియోలుఆయుర్వేదంఅధ్యయనంపోల్స్వినదగునెవ్వరు చెప్పినమంతెన ఆరోగ్య సలహాలువిద్యఎడిటర్ వాయిస్జర్నలిజంవికాసంవార్త-వ్యాఖ్యతెలుసుకుందాంపర్యావరణంపిల్లల పెంపకంవీరమాచనేని డైట్ సలహాలునేర వార్తలుఎన్నికలువిజ్ఞానంసమాజంన్యాయంఆధ్యాత్మికంజీవనంఆర్ధికంఉపాధిప్రకృతిరాజ్యాంగంవాతావరణంవార్తలువినోదంసాంకేతికతకుటుంబంక్రీడలుచరిత్రనాడు-నేడుపర్యాటకంప్రకృతి వ్యవసాయంటెక్నాలజీప్రజఎడిట్ఈపేపర్టీవీపల్లెప్రపంచంపీపుల్స్ ఇంటర్వ్యూబ్లాగ్మంచిమాటమన భూమిమహా విశ్వంమా బృందంవిజయపథంవివిధసంప్రదించండి