జనవిజయంపర్యావరణంఆకాశంలో అద్భుత దృశ్యం - సూర్యుడి చుట్టూ రంగల వలయాకారం

ఆకాశంలో అద్భుత దృశ్యం – సూర్యుడి చుట్టూ రంగల వలయాకారం

హైదరాబాద్, జూన్ 2(జనవిజయం): ఆకాశంలో అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది. సూర్యుడి చుట్టూ రంగుల వలయం ఏర్పడింది. బుధవారం నుమారు గంటపాటు ఈ దృశ్యం కనువిందు చేసింది. ఈ దృశ్యాన్ని చూడ్డానికి జనం నగరంలో పలు చోట్ల గుమిగూడారు. తమ మొబైల్ ఫోన్లలో బంధించి మురిసిపోయారు. నగరంతో పాటు తాండూరు తదితర ప్రాంతాల్లోనూ వలయాకార దృశ్యాలు కంటపడ్డాయి. గత నెలలో ఇలాంటి దృశ్యం బెంగళూరులో కూడా దర్శనమిచ్చింది. అప్పట్లో ఆ దృశ్యాలు నెట్టింట వైరల్ అయ్యాయి. దీన్ని సన్ హాలో అని కూడా అంటారు. సూర్యుడి చుట్టూ కానీ, చంద్రుడి చుట్టూ కానీ ఇలా వలయాకారం ఏర్పడటం వర్షానికి లేదా మంచు కురవడానికి సూచిక అంటారు. ఇదిలా ఉంటే, సూర్యుడు చుట్టూ వలయాకారం ఏర్పడటం అశు భమంటూ కొన్ని పుకార్లు షికారు చేస్తున్నాయి. ఈ పుకార్లను నమ్మొద్దని బిర్లా ప్లానిటోరియం శాస్త్రవేత్తలు చెబుతున్నారు. సైంటిఫిక్ పరిభాషలో వీటిని 22 డిగ్రీ హలోన్ అని పిలుస్తారని తెలిపారు. ఎందుకంటే ఒక ప్రదేశంలో ఒక పరిశీలకునికి సూర్యుడు లేదా చంద్రుని చుట్టూ ఏర్పడ్డ రింగ్ నుమారు 22 డిగ్రీల వ్యాసార్ధం ఉంటుందన్నారు.

'జనవిజయం' జనరల్ ఆర్టికల్స్, విశ్లేషణలు పొందడానికి, సమస్యలను 'జనవిజయం' దృష్టికి తీసుకురావడానికై జనవిజయం సోషల్ మీడియా ప్రొఫైల్స్ లలో జాయిన్ అవ్వండి:
జనవిజయం Join Link
జనవిజయం Join Link
జనవిజయం
జనవిజయం
 
ఇవీ చూడండి..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ఈ వారంలో ఎక్కువగా వీక్షించినవి:

- Advertisment -

ఎక్కువగా వీక్షించిన పోస్టులు (ఆల్-టైం):

వ్యాఖ్యలు

విభాగాలు

తెలంగాణజాతీయంరాజకీయంపరిపాలనఆరోగ్యంఆంధ్రప్రదేశ్ప్రత్యేకంసినిమాసాహిత్యంవాణిజ్యంస్పూర్తిఅంతర్జాతీయంవ్యవసాయంప్రముఖులువీడియోలుఆయుర్వేదంఅధ్యయనంపోల్స్వినదగునెవ్వరు చెప్పినమంతెన ఆరోగ్య సలహాలువిద్యజర్నలిజంఎడిటర్ వాయిస్వికాసంవార్త-వ్యాఖ్యతెలుసుకుందాంపర్యావరణంపిల్లల పెంపకంవీరమాచనేని డైట్ సలహాలునేర వార్తలుఎన్నికలువిజ్ఞానంన్యాయంసమాజంఆధ్యాత్మికంజీవనంఆర్ధికంఉపాధిప్రకృతిరాజ్యాంగంవాతావరణంవార్తలువినోదంకుటుంబంక్రీడలుచరిత్రనాడు-నేడుపర్యాటకంప్రకృతి వ్యవసాయంటెక్నాలజీసాంకేతికతప్రజఎడిట్ఈపేపర్టీవీపల్లెప్రపంచంపీపుల్స్ ఇంటర్వ్యూబ్లాగ్మంచిమాటమన భూమిమహా విశ్వంమా బృందంవిజయపథంవివిధసంప్రదించండి