జనవిజయంతెలంగాణసి.పి.ఎం. సీనియర్ నేత, ప్రముఖ అడ్వకేట్ కామ్రేడ్ కొండపల్లి ఉత్తమ్ కుమార్ ఆకాల మరణం

సి.పి.ఎం. సీనియర్ నేత, ప్రముఖ అడ్వకేట్ కామ్రేడ్ కొండపల్లి ఉత్తమ్ కుమార్ ఆకాల మరణం

– సిపిఎం ఖమ్మం జిల్లా కమిటీ సంతాపం

ఖమ్మం, జూన్ 2(జనవిజయం): సిపిఎం పార్టీ సీనియర్ నేత, ప్రముఖ న్యాయవాది, మాజీ శాసనసభ్యులు కె.యల్.నర్సింహారావు ప్రథమ కుమారుడు, సిపిఎం జిల్లా సెంటర్ శాఖా (లాయర్స్ శాఖ) కార్యదర్శి కామ్రేడ్ కొండపల్లి ఉత్తమ్ కుమార్ అనారోగ్యంతో హైదరాబాదు అపోలో ఆసుపత్రిలో మరణించారు. ఆయన దీర్ఘకాలికంగా ఆస్తమాతో బాధపడుతున్నారు. ఆస్తమాతో బాధ పడుతూ హైదరాబాద్ హాస్పిటల్ లో జాయిన్ అయ్యారు. గత 12 రోజుల నుండి చికిత్స పొందుతూ ఈ రోజు మధ్యాహ్నం 12 గంటలకి తుదిశ్వాస విడిచారు. ఆయన మరణం పార్టీకి తీరని లోటని, సిపియం పార్టీ జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు సంతాపం, కుటుంబానికి సానుభూతిని వ్యక్తం చేశారు. విద్యార్థి సంఘం ఎస్.ఎఫ్.ఐ. లో పని చేసి విద్యార్థి ఉద్యమానికి నాయకత్వం వహించి అనేక పోరాటాల్లో పాల్గొన్నారని, భూ పోరాటాల్లో పాల్గొని గిరిజనులు, దళితుల పైన మోపబడిన అనేక అక్రమ కేసులను లాయర్‌గా సమర్థవంతంగా వాదించేవారని గుర్తుచేశారు. ప్రజాతంత్రవాదిగా, మానవ హక్కుల కోసం రాజీలేని పోరాటం చేశారని తెలిపారు. ఐలు (బార్ అసోసియేషన్) రాష్ట్ర కమిటీ సభ్యులుగా పని చేసారని గుర్తుచేశారు. ఆయన ఆశయాలకు అనుగుణంగా పని చెయ్యాలని పార్టీ శ్రేణులను కోరారు.

మానవ హక్కుల కోసం పోరాడే ఉత్తమ్ – పోతినేని సుదర్శన్

ప్రముఖ న్యాయవాదిగా మానవ హక్కుల కోసం రాజీలేని పోరాటం చేసే వారని పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పి. సుదర్శన్ అన్నారు. ఆకస్మికంగా మరణించటం చాలా బాధాకరమైన విషయం అన్నారు. ఆయన మృతికి సంతాపం, కుటుంబానికి సానుభూతిని తెలియజేశారు. సిపియం పార్టీ చేసిన అనేక పోరాటాల్లో ప్రత్యక్షంగా, పరోక్షంగా పాల్గొన్నారని గుర్తు చేశారు. పార్టీ సైద్ధాంతిక విషయంలోను ఆయన అనేక సందర్భాల్లో నిర్మొహమాటంగా తన అభిప్రాయాన్ని తెలిపేవారని గుర్తు చేశారు. గొప్ప రాజకీయ, మానవతావాదిని కోల్పోయామని సుదర్శన్ తెలిపారు.

'జనవిజయం' జనరల్ ఆర్టికల్స్, విశ్లేషణలు పొందడానికి, సమస్యలను 'జనవిజయం' దృష్టికి తీసుకురావడానికై జనవిజయం సోషల్ మీడియా ప్రొఫైల్స్ లలో జాయిన్ అవ్వండి:
జనవిజయం Join Link
జనవిజయం Join Link
జనవిజయం
జనవిజయం
 
ఇవీ చూడండి..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ఈ వారంలో ఎక్కువగా వీక్షించినవి:

- Advertisment -

ఎక్కువగా వీక్షించిన పోస్టులు (ఆల్-టైం):

వ్యాఖ్యలు

కట్టెకోల చిన నరసయ్య on పరిశీలన,సాధన.. రచనకు ప్రయోజనకరం

విభాగాలు

తెలంగాణజాతీయంరాజకీయంపరిపాలనఆరోగ్యంఆంధ్రప్రదేశ్ప్రత్యేకంసినిమాసాహిత్యంవాణిజ్యంస్పూర్తిఅంతర్జాతీయంప్రముఖులువ్యవసాయంవీడియోలుఆయుర్వేదంఅధ్యయనంపోల్స్వినదగునెవ్వరు చెప్పినమంతెన ఆరోగ్య సలహాలువిద్యఎడిటర్ వాయిస్జర్నలిజంవికాసంవార్త-వ్యాఖ్యతెలుసుకుందాంపర్యావరణంపిల్లల పెంపకంవీరమాచనేని డైట్ సలహాలునేర వార్తలుఎన్నికలువిజ్ఞానంసమాజంన్యాయంఆధ్యాత్మికంజీవనంఆర్ధికంఉపాధిప్రకృతిరాజ్యాంగంవాతావరణంవార్తలువినోదంసాంకేతికతకుటుంబంక్రీడలుచరిత్రనాడు-నేడుపర్యాటకంప్రకృతి వ్యవసాయంటెక్నాలజీప్రజఎడిట్ఈపేపర్టీవీపల్లెప్రపంచంపీపుల్స్ ఇంటర్వ్యూబ్లాగ్మంచిమాటమన భూమిమహా విశ్వంమా బృందంవిజయపథంవివిధసంప్రదించండి