ఖమ్మం, జూలై 28(జనవిజయం): ముంపు బాధితులను అన్ని విధాల ఆదుకుంటామని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అన్నారు. శుక్రవారం కలెక్టర్, ఎమ్మెల్సీ తాతా మధుసూదన్, పోలీస్ కమీషనర్ విష్ణు ఎస్. వారియర్ లతో కలిసి, మున్నేరు ముంపు ప్రాంతాలు పోలేపల్లి, కరుణగిరి లోతట్టు ప్రాంతాల్లో పర్యటించి పరిస్థితులు పరిశీలించారు. భారీ వర్షాలు, వరదలకు దెబ్బతిన్న ఇండ్లను పరిశీలించి, బాధితులకు ప్రభుత్వం ఆదుకుంటుందని ధైర్యం చెప్పారు. పారిశుద్ధ్యం, క్రిమీ కీటకాలు పట్ల జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ముంపు బెడద పూర్తిగా తొలగేవరకు పునరావాస కేంద్రంలో ఉండాలని ముంపు బాధితులకు సూచించారు. ఈ సందర్భంగా జెడ్పి సిఇఓ అప్పారావు, ఖమ్మం రూరల్ ఎంపిపి బెల్లం ఉమ, తహసీల్దార్ సుమ, అధికారులు తదితరులు ఉన్నారు.