Tuesday, October 3, 2023
Homeవార్తలుచికిత్స పొందుతున్న ఆదివాసి ఉద్యమ నేత సొందె వీరయ్యకు ₹1,25000/- ఆర్ధిక సహాయాన్ని అందించిన ఆదివాసీ...

చికిత్స పొందుతున్న ఆదివాసి ఉద్యమ నేత సొందె వీరయ్యకు ₹1,25000/- ఆర్ధిక సహాయాన్ని అందించిన ఆదివాసీ టీచర్స్ అసోసియేషన్

ఆదివాసీ నేత సొందే వీరయ్య ఆరోగ్యం కుదుట పడాలని గాయత్రి బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో పూజలు

 

చికిత్స పొందుతున్న ఆదివాసి ఉద్యమ నేత సొందె వీరయ్యకు ₹1,25000/- ఆర్ధిక సహాయాన్ని అందించిన ఆదివాసీ టీచర్స్ అసోసియేషన్

జనవిజయం, 01 సెప్టెంబర్

 నిమ్స్ ఆసుపత్రి నందు చికిత్స పొందుతున్న ఆదివాసి ఉద్యమ నేత సొందె వీరయ్య గారిని పరామర్శించి, ట్రీట్మెంట్ కి ఆదివాసీ టీచర్స్ అసోసియేషన్ సేకరించిన రూ:1,25,000/-ల నగదును ఆర్థిక సహాయంగా అందించారు.  ఈ కార్యక్రమంలో కొరసా వెంకటేశ్వర్లు (ASP ముఖ్య సలహాదారు),కల్లూరి జయ బాబు (ఏటిఏ రాష్ట్ర అధ్యక్షులు), సోయం కామరాజు (ASP రాష్ట్ర ఉపాధ్యక్షులు),నూప నాగేశ్వరరావు (AVSP రాష్ట్ర ప్రధాన కార్యదర్శి), పాండ్రు హేమ సుందర్ తదితరులు పాల్గొన్నారు.

ఆదివాసీ నేత సొందే వీరయ్య ఆరోగ్యం కుదుట పడాలని గాయత్రి బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో పూజలు

 

ఇటీవల తీవ్ర అనారోగ్యానికి భద్రాచలం నుండి హైద్రాబాద్ నిమ్స్ కి తరలించిన గిరిజన నేత సొందే వీరయ్య ఆరోగ్యం కుదుట పడాలని గాయత్రి బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో పూజలు నిర్వహించామని గాయత్రి బ్రాహ్మణ సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రామావఝుల రవికుమార్ ఓ ప్రకటన తెలిపారు.

ఈ సందర్భంగా రామావఝల మాట్లాడుతూ., ఆదివాసీ నేత సొందే వీరయ్య మంచి మిత్రుడని, అవినీతి రహిత ఆదివాసీ ఉద్యమకారుడని…సొందే వీరయ్య ఆయురారోగ్యాలతో ఉండాలని భగవంతుణ్ణి కోరుకుంటున్నానని తెలిపారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ఈ వారం పాపులర్

ఆల్ టైమ్ పాపులర్

Recent Comments