ఉమ్మడి పౌర స్మృతి(యూసిసి) వ్యతిరేకిస్తున్నాం ….ఆదివాసి జేఏసీ…
జనవిజయం, 14 జూలై( దేవిపట్నం, ఏ.ఎస్.ఆర్.జిల్లా ) ఉమ్మడి పౌర స్మృతి (యూసిసి) నుండి ఆదివాసులను(గిరిజనులను)మినహాయించాలని ఆదివాసి జేఏసీ రాష్ట్ర వైస్ చైర్మన్ తెల్లం శేఖర్ ఓ ప్రకటనలో డిమాండ్ చేశారు.
ఈ సందర్భంగా ఆదివాసి జేఏసీ రాష్ట్ర వైస్ చైర్మన్ తెల్లం శేఖర్ మాట్లాడుతూ.., కేంద్ర ప్రభుత్వం తీసుకు వచ్చిన ఉమ్మడి పౌర స్మృతి (యూసిసి) 5వ,షెడ్యూల్డ్ ప్రాంత ఆదివాసీల సంస్కృతి,సాంప్రదాయాలకు విరుద్ధం అన్నారు.కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదివాసీల పట్ల చిత్త శుద్ది ఉంటే ఆదివాసీల సంస్కృతిని పాఠ్యాంశాలలో చేర్చాలని, అంతే కాకుండా (1)భూమి (భూమి పండుగ) (2)నీరు (గంగమ్మ జాతర,వాన పండుగ (3)అడవి వనదేవతల పండుగ,కొండ రాజుల బాబు పండుగ ఇలా ప్రతి ఏడాది సాంప్రదాయ బద్ధంగా ఆదివాసులు జరుపుకునే పండుగలకు సెలవు దినాలు ప్రకటించాలని డిమాండ్ చేశారు