ఆదివాసీ న్యాయవాదులు ఏజెన్సీ చట్టాలపై అవగాహన కలిగి ఉండాలి!
… డా పల్లా త్రినాదరావు…..
భద్రాచలం, 17 సెప్టెంబర్(జనవిజయం)
ఐటిడిఎ ప్రాంగణంలోని పీఆర్సీ భవనం నందు రాష్ట్ర ఆదివాసీ న్యాయవాదుల సంఘం ఆధ్వర్యంలో ఏజెన్సీ చట్టాలపై ఆదివాసీ న్యాయవాదులు రెండు రోజుల శిక్షణ తరగతులు నిర్వహించారు.రెండు రోజుల శిక్షణ తరగతులు కు రాష్ట్ర ఆదివాసీ సంఘం అధ్యక్షులు చీమల నరసింహరావు అధ్యక్షత వహించగా సీనియర్ న్యాయవాది,రచయిత ,పరిశోధకులు డా పల్లా త్రినాదరావు ఏజెన్సీ చట్టాలపై అవగాహన కల్పించగా ,క్రిమినల్ చట్టాలపై విశ్రాంత పబ్లిక్ ప్రాసిక్యూటర్ కోట దేవదానం శిక్షణ ఇచ్చారు. రెండవరోజు తరగతులు కు ముఖ్య అతిథిగా హాజరైన భద్రాచలం స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ఎంవి రవీంద్రనాథ్ రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం యొక్క తీర్పులతో సహా ,ఎల్టీఆర్ చట్టాలపై న్యాయవాదులు కు అవగాహన కల్పించారు.శిక్షణ తరగతులు కు 30 మంది ఆదివాసీ న్యాయవాదులు హాజరవగా న్యాయవాది పాయం రవి వర్మ వందన సమర్పణ చేశారు.