భద్రాచలం, ఆగస్ట్ 09 (జనవిజయం): ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా అత్యంత ఘనంగా నిర్వహించారు. కొత్తగూడెం, భద్రాచలం, ఎల్లెందు, అశ్వారావుపేట, మణుగూరు ప్రాంతాల్లో ఆదివాసీలు తమ సాంప్రదాయ నృత్యాలతో, అత్యంత ఉచాహపూరుతం గా వేడుకలు జరుపుకున్నారు. బుధవారం ఆదివాసీ సంఘాల ఐక్య వేదిక ఆధ్వర్యంలో భద్రాచలం లో ఏర్పాటు చేసిన ప్రదర్శన, సభ ల్లో కలెక్టర్ ప్రియాంక అలా, ఐటిడిఎ ప్రాజెక్టు అధికారి ప్రతీక్ జైన్ పాల్గొన్నారు. ఈ సందర్భం గా కలెక్టర్ మాట్లాడుతూ ఇతిహాస, నాగరికత, సంస్కృతి సాంప్రదాయాలను పాటించడంలో ఆదిమవాసుల గిరిజనులను ఆదర్శంగా నిలుస్తారు అని అన్నారు. గిరిజన సంస్కృతి, సాంప్రదాయాలు అంతరించి పోకుండా కాపాడు కోవల్సిన బాధ్యత అందరి పై ఉన్నదని పేర్కొన్నారు. అల్లూరి సీతారామరాజు, గంటందొర, మల్లు దొర ఎందరో ఆదివాసుల ప్రాణ త్యాగాల ఫలితంగా 1982వ సంవత్సరంలో ఐక్యరాజ్యసమితి నెదర్లాండ్ లో ఆదివాసీలు స్వేచ్ఛ స్వాతంత్ర్యంగా జీవించడానికి 140 దేశాల ప్రతినిధులు పాల్గొని ప్రపంచ ఆదివాసి దినోత్సవం గా ఆగస్టు 9వ తేదీ నాడు తీర్మానం చేసినందున, ఆరోజు నుండి ప్రపంచం మొత్తం మంది ఆదివాసి తెగల గిరిజనులు వారి వారి సంస్కృతి సంప్రదాయాల పరంగా పండుగల ఆదివాసి దినోత్సవం జరుపుకుంటున్నారని అన్నారు. ప్రపంచంలో 7 భాషలు ఉన్నాయని 90 శాతం భాషలు ఆదివాసి కి సంబంధించిన వని, భాషలు లేని ఆదివాసీలు5 శాతం మాత్రమే ఉన్నారని ఆదివాసీలు తక్కువ మంది మాత్రమే భాషలో మాట్లాడతారని ఇలా ఉండడం వల్ల మన భాష సంస్కృతి సంప్రదాయాలు అంతరించిపోయే ప్రమాదం ఉందని అన్నారు. దాదాపు పది కోట్ల మంది జనాభా తెలుగు మాట్లాడతారని, అమెరికా దేశం వారు కూడా తెలుగు నేర్చుకొని మాట్లాడడానికి ప్రయత్నిస్తారని అన్నారు. అయినా వారి సాంప్రదాయాన్ని భంగం కలిగించుకోరని ఆదివాసి కుటుంబాలు వారి పిల్లలకు చిన్నప్పటినుంచి సంస్కృతి సాంప్రదాయాలు భాషలోని ప్రాముఖ్యతను తల్లిదండ్రులు నేర్పించాలని అన్నారు. ఆదివాసి గిరిజనులకు ఏ సమస్య వచ్చినా నేరుగా తనకు సంప్రదించవచ్చని, ఆదివాసి గిరిజనుల కోసం తప్పనిసరిగా వారి జీవనోపాధికి కృషి చేస్తానని అన్నారు. తొలుత ప్రోజెక్ట్ అధికారి ప్రతీక్ జైన్ ఆదివాసీ అమరుల చిత్ర పటాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఆదివాసి గిరిజనుల పిల్లల కొరకు గిరిజన సంక్షేమ శాఖ ద్వారా ఆశ్రమ పాఠశాలలు ,వసతిగృహాలు గురుకుల పాఠశాలలు నెలకొల్పి వారి విద్యాభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని ,గిరిజనులు స్వయం ఉపాధి ద్వారా ఆర్థిక చేకూర్పు చేసుకొని జీవించడానికి ఐటిడిఏ ద్వారా అనేక రకాల సంక్షేమ పథకాలు అర్హులైన గిరిజనులకే అందేలా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. పదో తరగతిలో ఏ గ్రేడ్ సాధించిన పాఠశాలల ప్రధానోపాధ్యాయులు అంకంపాలెం హెచ్ఎం వెంకటేశ్వర్లు, డి గొల్లగూడెం ప్రధానోపాధ్యాయురాలు విజయలక్ష్మి కి ప్రత్యేకంగా ఐసిడిఏపీఓ సన్మానించారు.
ఈ కార్యక్రమంలో డిడి ట్రైబల్ వెల్ఫేర్ అధికారిని మణెమ్మ , ఏసీఎంఓ రమణయ్య, ఏటిడిఓ నరసింహారావు, మాజీ ఎంపీ మీడియం బాబురావు, గిరిజన సంఘాల నాయకులు తెల్లం వెంకటరావు, గుండు శరత్ బాబు, పునెం వీరభద్రమ్, గొంది బాలయ్య, కారం పుల్లయ్య, పునేం కృష్ణ దొర, పాయం రవి వర్మ, మూర్ల రమేష్, శోయం జోగారావు, మురళి, పుల్లయ్య, వీరస్వామి, శ్రీరామ్ మూర్తి, సుధారాణి ,అరుణ , వివిధ గ్రామాల నుండి వచ్చిన గిరిజన సంఘాల నాయకులు, పాఠశాల విద్యార్థినీలు తదితరులు పాల్గొన్నారు.