ఖమ్మం, జూలై 22(జనవిజయం):
అధికారులు ఎన్నికల ప్రక్రియ, ఎన్నికల యంత్రాల నిర్వహణపై పూర్తి అవగాహన కల్గివుండాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అన్నారు. శనివారం ఐడిఓసి లోని సమావేశ మందిరంలో ఎన్నికల ప్రక్రియ, ఎన్నికల యంత్రాల నిర్వహణపై జిల్లా అధికారులకు శిక్షణ, అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్నికల ప్రక్రియపై పోలింగ్ ముందు రోజు, పోలింగ్ రోజు, పోలింగ్ ప్రారంభానికి ముందు, పోలింగ్ పూర్తయిన తర్వాత చేపట్టాల్సిన పనులపై అధికారులకు అవగాహన చేయించి, ఓటింగ్ యంత్రాల నిర్వహణపై ఓటింగ్ యంత్రాలతో అనుకరణ వాతావరణంలో శిక్షణ ఇచ్చారు. ఎన్నికల విధులను ఎలాంటి తప్పిదాలు లేకుండా సమర్థవంతంగా చేపట్టుటకు శిక్షణ ను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ అభిలాష అభినవ్, ఖమ్మం మునిసిపల్ కార్పొరేషన్ కమీషనర్ ఆదర్శ్ సురభి, జిల్లా అధికారులు, తహశీల్దార్లు, తదితరులు పాల్గొన్నారు.