- వృద్ధాశ్రమ షెడ్డు కోసం పదివేల ఆర్థిక సహాయం
- భాగం ఫౌండేషన్ సేవలను అభినందిస్తున్న పలువురు ప్రజాప్రతినిధులు
బోనకల్, జూలై 17(జన విజయం) :
మండల పరిధిలోని గోవిందాపురం (ఏ) గ్రామ వాసి భాగం రాధ కృష్ణమూర్తి తనయుడు భాగం రాకేష్ ,ఉన్నత విద్యను అభ్యసించి ఖండాంతరాలలో వృత్తిని నిర్వర్తిస్తూ,సొంత గ్రామంతో పాటు చుట్టుపక్కల గ్రామాలకు ఆర్థికంగా తన సహాయ సహకారాలు అందిస్తూ సేవా కార్యక్రమాలు చేపడుతూ అందరి మన్నలు పొందుతూ వస్తున్నాడు.మాతృ దినోత్సవ సందర్భంగా భాగం సేవ ఫౌండేషన్ ప్రారంభించి ఆ ఫౌండేషన్ ద్వారా సహాయ సహకారాలు అందిస్తున్నాడు.పలు గ్రామాల్లో అనేక సేవా కార్యక్రమాలు భాగం రాకేష్ నిర్వహించినారు. పలు గ్రామాల కు వీధి దీపాలు పంపిణీ చేయడంతో పాటు, చర్చిలకు మసీదులకు ఆర్ధిక సహాయం అందించారు.కరోనా సమయంలొ పలు కుటుంబాలకు చేయూతనిచ్చారు.భాగం సేవా ఫౌండేషన్ ద్వారా పేదవారికి వైద్య ఖర్చులతో పాటు,పేద విద్యార్థులకు చదువు కొరకు ఆర్థిక సహాయం చేయనున్నట్లు భాగం రాకేష్ తెలియజేశారు.అందులో భాగంగా మధిర పట్టణం సుశీల డిగ్రీ కాలేజ్ రోడ్ లో ఆదరణ సేవ ఫౌండేషన్ కు భాగం సేవ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు భాగం రాకేష్ ఆదరణ సేవ ఫౌండేషన్ లో వృద్ధులు షెడ్ సరిపోక ఇబ్బంది పడుతున్న తరుణంలో అదనపు షెడ్ కోసం సహాయం అడిగిన వెంటనే పదివేల రూపాయలు ఆర్థిక సహాయం అందించి తన సేవాభవాన్ని మరొకసారి చాటుకున్నారు.ఈ సందర్భంగా రాకేష్ మాట్లాడుతూ ఆదరణ ఫౌండేషన్ కి భాగం ఫౌండేషన్ నుంచి సహాయ సహకారాలు ఎప్పుడూ ఉంటాయని ఏ ఆపద వచ్చినా తమ వంతు సహాయ సహకారాలను అందిచనున్నట్లు తెలిపారు.ఫౌండేషన్ సందర్శించిన వారిలో భాగం రాధాకృష్ణమూర్తి,భాగం పాపారావు,భాగం నాగేశ్వరరావు,ఎస్.కె షకీర్ సాహెబ్ పాల్గొన్నారు.