ఖమ్మం, జూలై 26 (జనవిజయం):
ఖమ్మం రెవిన్యూ అదనపు కలెక్టరుగా డి. మధుసూదన్ నాయక్ బుధవారం ఉదయం పదవీ బాధ్యతలు చేపట్టారు. అంతకు ముందు అదనపు కలెక్టర్, జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కలెక్టర్, అధికారులు, అదనపు కలెక్టర్ కు శుభాకాంక్షలు తెలియజేశారు. మంచిర్యాల జిల్లా రెవిన్యూ అదనపు కలెక్టర్ గా పనిచేయుచున్న డి. మధుసూదన్ నాయక్ ని ప్రభుత్వం ఖమ్మం జిల్లాకు బదిలీ చేస్తూ, మంగళవారం ఉత్తర్వులు జారీచేసింది.