జనవిజయంఆరోగ్యంఆచరణకు అనువుగా ఉండడమే వీరమాచనేని విజయానికి కారణం

ఆచరణకు అనువుగా ఉండడమే వీరమాచనేని విజయానికి కారణం

వి.ఆర్.కె డైట్ ప్లాన్ అవగాహన – 1

తడొక సామాన్యుడు. తనకు తెలిసిన మంచిని సమాజానికి పంచాలన్న సేవా ధృక్పథం ఉన్నవాడు. ఆ సేవా ధృక్పథమే ఆయనను పెద్ద సెలబ్రెటీని చేసింది. ప్రపంచ వ్యాపితంగా జీవనశైలి వ్యాధులను తగ్గించుకోవడానికి అత్యధికులు అనుసరిస్తున్న డైట్ ప్లాన్ వి.ఆర్.కె. డైట్. అకౌంట్స్ బేక్‌గ్రౌండ్ విద్యార్హత ఉన్న ఓ వ్యక్తి వైద్య రంగానికి అంతుబట్టని జీవనశైలి వ్యాధులను మాత్రమే కాకుండా, నివారణ అసాధ్యం అని చెప్పబడ్డ ఆటో ఇమ్యూనిటీ రోగాలను కూడా చిటికెలో తరిమేస్తుండడం ఓ అద్భుతంగా మారింది. అదీ సంపూర్ణ శాస్త్రీయ అవగాహనతో కావడం, ఆచరణకు అనువుగా ఆయన డిజైన్ చేసిన ప్రోగ్రాం ఉండడం నేటి సమాజం చేసుకున్న అదృష్టమనే చెప్పాలి. వీరమాచనేని డైట్ ప్లాన్ గురించి ముందుగా కొన్ని అంశాలను పరిశీలన చేద్దామనే ఉద్దేశంతో ఈ వ్యాసాలను అందిస్తున్నాము.

కొబ్బరినూనె వైద్యమంటూ గ్రామాలలో సైతం ఆయన గురించి చెప్పుకుంటున్నప్పటికీ పూర్తి అవగాహన లేక దీనిపై కొన్ని అపోహలు, అనుమానాలు, దుష్ప్రచారాలు ఓవైపు కొనసాగుతుండగా మరోవైపు అనేకమంది వైద్యులు, ఉన్నత విద్యావంతులు, శాస్త్రవేత్తలు, సెలబ్రెటీలు సైతం ఆయన విధానాన్ని ఫాలో అవుతుండడం విశేషం. ఎందుకు రామకృష్ణ విధానం వైరల్ గా మారింది. ఇన్ని లక్షలమంది వైద్యులు, ఫార్మా కంపెనీలు, రీసెర్చులు చేయలేని, సాధించలేని అద్భుతం రామకృష్ణకు ఎలా తెలిసింది? వైద్యరంగానికి సవాల్ గా మారిన జీవనశైలి వ్యాధులను రామకృష్ణ విధానం అనుసరించడంతో వేలాదిమంది ఎలా దూరం చేసుకోగలుగుతున్నారు?

షుగర్ వస్తే జీవితాంతం మందులు వాడాల్సిందేనని డాక్టర్లు అప్పటిదాకా చెపుతుండగా అసలు డయాబెటీస్ అనేది వ్యాధే కాదని చిటికెలో అది తగ్గుతుందంటూ రామకృష్ణ సవాల్ విసురుతున్నారు. సవాల్ విసరడమే కాదు, తన డైట్ అనుసరించే మొదటిరోజే షుగర్ మందులు పారవేయించి, అనేకమందికి తగ్గించి చూపిస్తున్నారు. వేలాది రిపొర్టులే అందుకు ఉదాహరణ. కాలు తీసేయాలనుకున్నవారు, 3 పూటలా ఇన్సులిన్ వాడుతున్నవారు నేడు ఒక్క మాత్ర కూడా లేకుండా ఓ పద్దతిగా స్వీట్స్ తిన్నా తిరిగి షుగర్ లెవల్స్ పెరగకుండా ఉంటున్నారు. ఈ సంఖ్య రోజు రోజుకూ పెరుగుతోంది. మొదట్లో రామకృష్ణ విధానం సరయినది కాదని ఆయన విధానం పాటిస్తే ప్రాణాలకే ప్రమాదమంటూ ప్రచారం చేసిన చానళ్లు, డాక్టర్ల నోళ్లు మూతబడ్డాయి. ప్రజలకు మేలు చేస్తున్న ఈ విధానాన్ని మరికొన్ని చానళ్లు ప్రచారం చేయడానికి ముందుకొచ్చాయి. సోషల్ మీడియా ఆయనను నెత్తికెత్తుకుందనే చెప్పాలి.

ఆయిల్ పుల్లింగ్ లా కేవలం కొద్ది రోజులే ఇది వేలంవెర్రిగా సాగుతుందంటూ హేళన చేసిన డాక్టర్ల వాదనను ప్రజలు ఖండిస్తున్నారు. రామకృష్ణను అరెస్ట్ చేయాలంటూ కొందరు డాక్టర్లు బృందంగా ఏర్పడి చేసిన పత్రికా ప్రకటనలు నవ్వులపాలు కావడమే గాక డాక్టర్లు సైతం రామకృష్ణకు మద్దతుగా నిలబడడం ఆహ్వానించదగిన పరిణామం. రామకృష్ణ వాదనలో శాస్త్రీయత ఏమిటి? అంటూ ప్రశ్నించిన వారు సైతం ఫలితాలు చూసి నివ్వెరపోతున్నారు.

సమాజాన్ని ఎంతగానో ప్రభావం చూపిన రామాయణాన్ని రచించింది బోయవాడైన వాల్మీకి అని, మంచి ఎవరు చెప్పినా వినాల్సిందేనని, ఆచరణలో ఫలితానికి మించిన శాస్త్రీయత లేదని, ప్రకృతి మనిషికి ఎపుడూ హాని చేయదని, సైడ్ ఎఫెక్ట్స్ ఉండడానికి తాను మందులు ఇవ్వడం లేదని, తాను చేస్తున్నది వైద్యం కాదని, జీవన శైలిలో మార్పుకు ఓ విధానాన్ని ప్రచారం చేస్తున్నానని, ఆహారంలో మార్పులు, తినే విధానంలో మార్పులు నేర్పుతున్నానంటున్నారు. నిజానికి తన విధానం డాక్టర్లకు సహాయకారిగా ఉంటుందంటున్నారు. డాక్టర్ల వైద్య విజ్ఞానంలో తనకు వందో వంతు కూడా లేదని తాను డాక్టర్లకు అన్నింటిలో ప్రత్యామ్నాయం కాదన్నది గమనించాలంటున్నారు. ప్రకృతికి దూరం కావడమే మనిషి ఆరోగ్య పతనానికి కారణమని రామకృష్ణ బలంగా వాదిస్తున్నారు. ఏ తప్పులు చేసామో వాటిని సవరించుకుంటే జీవనశైలి వ్యాధులు వచ్చిన దారినే పోయి తీరతాయంటున్నారు.

ఒక్క రూపాయి ఆశించకుండా తనకు తెలిసిన నిజాన్ని ప్రజల మద్దతుతో ఓ ఉద్యమంలా సాగిస్తున్న రామకృష్ణ ఇది తాను కనిపెట్టినది కాదని, మన పూర్వీకులు ఆచరించి చూపిన విధానమేనని, తాను మన జీవితాల్లో ప్రవేశించిన విచ్చలవిడితనాన్ని పారద్రోలడం ద్వారా దానివల్ల వచ్చిన వ్యాధులను తరిమివేయడానికి ఎలా అవకాశం ఉందో తెలియజేస్తున్నానని చెప్తున్నారు. ఆధునిక వైద్య విజ్ఞానానంలో మంచిని, పూర్వీకుల జీవనశైలిలో మంచిని కలిపి రూపొందించిన డైట్ ప్రోగ్రాం తనది అని చెప్తారాయన. చైనీస్ ఆరిజిన్‌కు చెందిన కెనడా వైద్యులు జాసన్‌ఫంగ్ అనే ప్రముఖ నెఫ్రాలజిస్ట్ పరిశోధనలు, రచనలు నుండి స్పూర్తిని పొంది, మన జీవనవిధానంలోని ఆహార పదార్ధాలు, నియమాలతో ఒక ప్రోగ్రాంను రూపొందిచానని వాస్తవానికి తన అధిక బరువును తగ్గించుకోవడానికి చేసిన కృషి ఇలా సమాజానికి ఇంత మేలు చేస్తుందని తానూ ఊహించలేదని రామకృష్ణ వినమ్రంగా చెప్తున్నారు. రామకృష్ణ దీనిని విస్తృతంగా ప్రజలలోకి ప్రజల భాషలో ముఖ్యంగా సామాన్యులకు సైతం అవగాహన అయ్యేలా చెపుతుండడం అభినందనీయం. అనేక భారీ బహిరంగ సభలలో ఒక ఆహారవిధానం గురించి ప్రజలను చైతన్య పరచిన విధానం అనితరసాధ్యం.

రామకృష్ణ రూపొందించిన జీవనశైలి విధానంను మరింత వివరంగా ప్రజలలోకి తీసుకుపోయెందుకు కృషి చేయాలని జనవిజయం సంకల్పించింది. రామకృష్ణ విధానంపై వ్యాసాలు అందించడంతో పాటు, ఈ విధానంపై ఉన్న సందేహాలను నివృత్తి చేయడానికి ప్రజలకు సహకరించాలని భావిస్తున్నాము. ఈ విధానంపై సందేహాలను, తెలుకోవాలనుకుంటున్న విషయాలను మాకు వ్రాయండి. స్వయంగా వీరమాచనేని రామకృష్ణతో సమాధానాలు చెప్పించేందుకు ప్రయత్నిస్తాము. ఈ విధానం ఆచరించి ఫలితం పొందిన వారు ఆధారాలతో సహా మాకు పంపితే జనవిజయంలో ప్రచురిస్తాము. ఇది మరింతమందికి స్పూర్తివంతంగా ఉంటుంది. మీ విజయానికి సంబంధించిన రిపోర్టులు, ఫోటోలు, వీడియోలు పంపండి. మీరు మాకు వ్రాయదలచుకున్నది మెయిల్ ద్వారా పంపవచ్చు. ఈ డైట్ పాటించి ఫలితాలు లభించి, మళ్ళీ మామూలు డైట్ లోకి వచ్చి తిరిగి పాత స్ధితికి వారు వెళ్ళి ఉంటే వారికెందుకు అలా జరుగుతుంది? పోస్ట్ డైట్ విధానం ఎలా చేయాలి? ఆ నిబంధనలు ఏమైనా పాటించడం లేదా? తిరిగి ఆ తప్పును చేయకుండా మళ్ళీ విజయం సాధించేందుకు ఎలా కృషి చేయాలో తెలుసుకోవచ్చు. పోస్ట్ డైట్ జీవనశైలి సరిచేసుకోవటంలో జనవిజయం మీకు సహకరిస్తుంది.

మీ సందేహాలు, అభిప్రాయాలు, సాధించిన విజయాలు మాకు వ్రాయాల్సిన మెయిల్ ఐ.డి: [email protected]

‌ – పల్లా కొండలరావు, ఎడిటర్, జనవిజయం

—–

'జనవిజయం' జనరల్ ఆర్టికల్స్, విశ్లేషణలు పొందడానికి, సమస్యలను 'జనవిజయం' దృష్టికి తీసుకురావడానికై జనవిజయం సోషల్ మీడియా ప్రొఫైల్స్ లలో జాయిన్ అవ్వండి:
జనవిజయం Join Link
జనవిజయం Join Link
జనవిజయం
జనవిజయం
 
ఇవీ చూడండి..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ఈ వారంలో ఎక్కువగా వీక్షించినవి:

- Advertisment -

ఎక్కువగా వీక్షించిన పోస్టులు (ఆల్-టైం):

వ్యాఖ్యలు

కట్టెకోల చిన నరసయ్య on పరిశీలన,సాధన.. రచనకు ప్రయోజనకరం

విభాగాలు

తెలంగాణజాతీయంరాజకీయంపరిపాలనఆరోగ్యంఆంధ్రప్రదేశ్ప్రత్యేకంసినిమాసాహిత్యంవాణిజ్యంస్పూర్తిఅంతర్జాతీయంప్రముఖులువ్యవసాయంవీడియోలుఆయుర్వేదంఅధ్యయనంపోల్స్వినదగునెవ్వరు చెప్పినమంతెన ఆరోగ్య సలహాలువిద్యఎడిటర్ వాయిస్జర్నలిజంవికాసంవార్త-వ్యాఖ్యతెలుసుకుందాంపర్యావరణంపిల్లల పెంపకంవీరమాచనేని డైట్ సలహాలునేర వార్తలుఎన్నికలువిజ్ఞానంసమాజంన్యాయంఆధ్యాత్మికంజీవనంఆర్ధికంఉపాధిప్రకృతిరాజ్యాంగంవాతావరణంవార్తలువినోదంసాంకేతికతకుటుంబంక్రీడలుచరిత్రనాడు-నేడుపర్యాటకంప్రకృతి వ్యవసాయంటెక్నాలజీప్రజఎడిట్ఈపేపర్టీవీపల్లెప్రపంచంపీపుల్స్ ఇంటర్వ్యూబ్లాగ్మంచిమాటమన భూమిమహా విశ్వంమా బృందంవిజయపథంవివిధసంప్రదించండి