జనవిజయంతెలంగాణకోయచెలక, మంచుకొండ గ్రామాలలో అభివృద్ధి పనులను పరిశీలించిన మంత్రి పువ్వాడ అజెయ్ కుమార్

కోయచెలక, మంచుకొండ గ్రామాలలో అభివృద్ధి పనులను పరిశీలించిన మంత్రి పువ్వాడ అజెయ్ కుమార్

ఖమ్మం,జూన్10(జనవిజయం): జిల్లాలోని రఘునాథపాలెం మండలం కోయచెలక, మంచుకొండ గ్రామాలలో జరుగుతున్న రహదారుల అభివృద్ధి పనులను మరింత వేగవంతం చేసి యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అధికారులను ఆదేశించారు. కోయచెలక నుండి పాపటపల్లి వరకు 7.7 కిలోమీటర్ల మేర జరుగుతున్న రోడ్డు విస్తరణ పనులను గురువారం మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పరిశీలించారు. పనులు ప్రారంభించి నెలలు గడుస్తున్నప్పటికి ఆశించిన మేర పురోగతి లేదని, పనులను నిరంతరాయంగా కొనసాగించి నిర్దేశిత గడువులోగా పనులన్నీ పూర్తి కావాలని అధికారులను మంత్రి ఆదేశించారు. రోడ్డు అభవృద్ధి పనులలో నాణ్యతా ప్రమాణాలు పాటించాలని, విస్తరణకు అడ్డుగా ఉన్న విద్యుత్ స్థంభాలను సత్వరమే మార్చాలని విద్యుత్ అధికారులను మంత్రి ఆదేశించారు. అనంతరం మంచుకొండ రోడ్డు విస్తరణ పనులను మంత్రి పరిశీలించారు. సుడా నిధులు 2 కోట్లతో చేపడున్న రోడ్డు విస్తరణ, డివైడర్లు, సెంట్రల్ లైటింగ్ పనులను మరింత వేగవంతం చేసి త్వరగా పూర్తి చేయాలని పనుల్లో నిర్లక్ష్యం, జాప్యం వహించిన యెడల బాధ్యులపై చర్యలుంటాయని ఈ సందర్భంగా మంత్రి హెచ్చరించారు. రోడ్డు విస్తరణ సందర్భంగా ప్రజలకు త్రాగునీటికి ఎటువంటి అసౌకర్యం కలుగకుండా ఎప్పటికప్పుడు పర్యవేక్షణ ఉండాలని మిషన్ భగీరథ అధికారులను మంత్రి ఆదేశించారు. సుడా చైర్మన్ బచ్చు విజయ్ కుమార్, నగరపాలక సంస్థ కమీషనర్ అనురాగ్ జయంతి, రోడ్లు భవనాలు, పంచాయితీరాజ్ శాఖల ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు శ్యాంప్రసాద్, చంద్రమౌళీ, విద్యుత్ శాఖ ఎస్.ఇ రమేష్, రఘునాథపాలం జడ్పీ.టి.సి మాళోతు ప్రియాంక, ఆయా గ్రామాల సర్పంలు, స్థానిక ప్రజాప్రతినిధులు, పంచాయితీరాజ్, రెవెన్యూ, మిషన్ భగీరథ అధికారులు తదితరులు మంత్రి వెంట ఉన్నారు.

'జనవిజయం' జనరల్ ఆర్టికల్స్, విశ్లేషణలు పొందడానికి, సమస్యలను 'జనవిజయం' దృష్టికి తీసుకురావడానికై జనవిజయం సోషల్ మీడియా ప్రొఫైల్స్ లలో జాయిన్ అవ్వండి:
జనవిజయం Join Link
జనవిజయం Join Link
జనవిజయం
జనవిజయం
 
ఇవీ చూడండి..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ఈ వారంలో ఎక్కువగా వీక్షించినవి:

- Advertisment -

ఎక్కువగా వీక్షించిన పోస్టులు (ఆల్-టైం):

వ్యాఖ్యలు

కట్టెకోల చిన నరసయ్య on పరిశీలన,సాధన.. రచనకు ప్రయోజనకరం

విభాగాలు

తెలంగాణజాతీయంరాజకీయంపరిపాలనఆరోగ్యంఆంధ్రప్రదేశ్ప్రత్యేకంసినిమాసాహిత్యంవాణిజ్యంస్పూర్తిఅంతర్జాతీయంప్రముఖులువ్యవసాయంవీడియోలుఆయుర్వేదంఅధ్యయనంపోల్స్వినదగునెవ్వరు చెప్పినమంతెన ఆరోగ్య సలహాలువిద్యఎడిటర్ వాయిస్జర్నలిజంవికాసంవార్త-వ్యాఖ్యతెలుసుకుందాంపర్యావరణంపిల్లల పెంపకంవీరమాచనేని డైట్ సలహాలునేర వార్తలుఎన్నికలువిజ్ఞానంసమాజంన్యాయంఆధ్యాత్మికంజీవనంఆర్ధికంఉపాధిప్రకృతిరాజ్యాంగంవాతావరణంవార్తలువినోదంసాంకేతికతకుటుంబంక్రీడలుచరిత్రనాడు-నేడుపర్యాటకంప్రకృతి వ్యవసాయంటెక్నాలజీప్రజఎడిట్ఈపేపర్టీవీపల్లెప్రపంచంపీపుల్స్ ఇంటర్వ్యూబ్లాగ్మంచిమాటమన భూమిమహా విశ్వంమా బృందంవిజయపథంవివిధసంప్రదించండి