అభివృద్ధి కావాలా? విధ్వంసం కావాలా? తేల్చుకోమంటున్న కే.టీ.ఆర్!

0
93
Share this:

 

హైదరాబాద్ కు ఢిల్లీ పెద్దలు చేసిన ఒక్క పని చూపగలరా? అభివృద్ధికోసం దూసుకుపోతున్న హైదరాబాద్ కావాల్నా? అశాంతిని నెలకొల్పే హైదరాబాద్ కావాల్నా? హైదరాబాద్ ఓటర్లు తేల్చుకోవాలన్నారు కె.టీ.ఆర్. టీ.ఆర్.ఎస్ భవన్ లో పంచాయతీరాజ్ శాఖామంత్రి కే.టీ.ఆర్ ఆరేండ్లలో హైదరాబాద్లో తమ హయాంలో జరిగిన ప్రగతిని నివేదించారు. మతం పేరుతో విద్వేషాలు రెచ్చగొట్టే వారి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. విద్రోహ శక్తులకు తావు ఈయవద్దని కోరారు. కరోనా వచ్చిన సమయంలో ప్రజల వద్ద ఉన్నదెవరు? వరదల సమయంలో ప్రజల వద్దనున్నది ఎవరు? హిందూ ముస్లిం, భారత్ పాకిస్తాన్ తప్ప ఏమి అభివృద్ధి చేస్తారో చెప్పే దమ్ము ఉన్నదా? ఆరేండ్లలో హైదరాబాద్ కు ఏమి చేశారు? దమ్ముంటే లక్ష కోట్ల ప్యాకేజిని ప్రకటించండి అంటూ సవాల్ విసిరారు. ఇపుడు గొంతు చించుకుంటున్న నాయకులు ఎక్కడ ఉన్నారు? రాష్ట్రంలో ఈ ఎన్నికలు కీలకమైనవని ఈసారి సెంచరీ కొట్టాలని విజ్ఞప్తి చేశారు. జీ.హెచ్.ఎం.సీ అభ్యర్దులచేత ప్రమాణం చేయించారు. కే.టీ.ఆర్ మాటలపై మీ అభిప్రాయం కామెంట్ ద్వారా తెలియజేయండి.

గమనిక:

  • WhatsApp లో జనవిజయం అప్డేట్స్ పొందేందుకు https://bit.ly/3jqXNLp గ్రూప్ లో జాయిన్ అవ్వండి.
  • Telegram లో జనవిజయం అప్డేట్స్ పొందేందుకు https://t.me/janavijayam ఛానల్ లో జాయిన్ అవ్వండి.