జనవిజయంఆరోగ్యంఅభాసు పాలవుతున్న వ్యాక్సినేషన్‌ ప్రక్రియ

అభాసు పాలవుతున్న వ్యాక్సినేషన్‌ ప్రక్రియ

  • నిత్యం వ్యాక్సిన్‌ కోసం ప్రజల పడిగాపులు
  • ఉత్పత్తి సామర్థ్యం పెంచే చర్యల్లో కానరాని జోరు

న్యూఢల్లీ,మే19(జనవిజయం): దేశంలో కరోనా వ్యాక్సిన్‌ కొరత తీవ్రతతో ప్రజల్లో కరోనా వ్యాప్తి పెరుగుతోంది. ఓ వైపు వ్యాక్సిన్‌ వేసుకోమని పదేపదే ప్రచారం చేస్తున్న కేంద్రం ప్రజలకు అందుబాటులో వ్యాక్సిన్‌ ఉంచడంలో పూర్తిగా విఫలమయ్యింది. దీనిపై ఓ కార్యాచరణ, ప్రణాళిక లేకుండా వ్యాక్సిన్‌ ప్రక్రియ సాగుతోంది. దీంతో వాక్సిన్‌ అవసరం, కొరత తీవ్ర స్థాయికి చేరింది. పలు రాష్ట్ర ప్రభుత్వాలను ఆందోళనకు గురిచేస్తోంది. నిత్యం ప్రజల రాకతో ఒత్తిడి వాతావరణం పెంచుతోంది. మాకు తగినంత వ్యాక్సిన్‌ సరఫరా చేయండని దేశంలోని దాదాపు అన్ని రాష్ట్రాలు కేంద్రాన్ని నిత్యం వేడుకుంటున్నాయి. నేరుగా సరఫరా చేయండని టీకా ఉత్పత్తి కంపెనీలను కోరుతున్నాయి. కేంద్ర కేటాయింపు ప్రకారం, దాదాపు పదిహేను రాష్ట్రాలకు నేరుగా టీకామందు పంపిణీ చేస్తున్నామని ఉత్పత్తిదారులు పేర్కొంటున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో దేశ అవసరాలకు తగ్గట్లుగా ఉత్పత్తి చేయలేమని వ్యాక్సిన్‌ సంస్థలు భారత్‌ బయోటెక్‌,సీరం సంస్థలు ప్రకటించాయి. అలాగే రష్యా ఉత్పత్తి సంస్థ నుంచి స్పుత్నిక్‌ కూడా వచ్చేస్తోంది. కానీ, అవసరాలకు సరిపడా ఉత్పత్తిలేక, కోరిన మేర సరఫరా జరుగటం లేదు. కేంద్రం ఏవిూ చేయలేని అచేతన స్థితిలో ఉంది. సెకంట్‌ డోస్‌ వేయడానికి కూడా సరిపడా అందడం లేదు.. ఇకపోతే వ్యాక్సిన్‌ ధరను పరిశీలిస్తే కేంద్రానికో ధర, రాష్ట్రప్రభుత్వాలకొక ధర, ప్రయివేటు సంస్థలకింకో ధర… అనేది వివాదాస్పదమైంది. సుప్రీం కూడా దీనిని తప్పుబట్టింది. దీన్ని పునస్సవిూక్షించమని రాష్ట్రాలు కోరుతున్నాయి. ధరలు పక్కన పెడితే, అవసరాలు తీర్చేలా సరఫరా చేయాలని అడుగుతున్నాయి. కొన్ని రాష్ట్రాలు ఓ అడుగు ముందుకు వేసి, గ్లోబల్‌ టెండర్ల ద్వారా టీకా మందులను అంతర్జాతీయ ఉత్పత్తిదారుల నుంచి సమకూర్చుకునే యత్నాల్లో పడ్డాయి. ఆయా కంపెనీల టీకా మందుకు దేశంలో అనుమతి అంశం నుంచి, గ్లోబల్‌ టెండర్ల పక్రియ సాధకబాధకాల వరకు… రాష్ట్ర అధికారులు ఇప్పుడు కేంద్ర ఉన్నతాధికారులతో సంప్రదిస్తున్నారు. వ్యాక్సిన్‌ ఉత్పత్తి పక్రియ వేగం పెంచకుంటే రెండో ఉధృతిని తట్టుకోవడం కష్టమని నిపుణులూ హెచ్చరిస్తున్నారు. దేశ ప్రధాన శాస్త్రసలహాదారులు చెప్పినట్టు, కోవిడ్‌ మూడో ఉధృతి ముంచుకు వచ్చే ప్రమాదమూ ఉంది. అది మొదలవక ముందే పరిస్థితిని అదుపులోకి తెచ్చుకోవాలంటే వైరస్‌ వ్యాప్తి నిలువరించడం ఎంత ముఖ్యమో, టీకా పక్రియను పూర్తి చేయడం అంతే ముఖ్యమన్నది నిపుణుల హెచ్చరికగా ఉంది. ఇకపోతే వేర్వేరు కారణాల వల్ల టీకాలిచ్చే పక్రియ దేశంలో మందగించింది. చివరకు, 18 ఏళ్లు పైబడ్డ వారికి మే1 నుంచి టీకా ఇవ్వాలన్న కేంద్ర నిర్ణయం నీరుగారింది. చాలా రాష్ట్రాల్లో 45 ఏళ్లు పైబడ్డ వారికి తొలిదశ టీకా ఇచ్చే పక్రియ వాయిదా పడింది. పేర్లు నమోదు చేసుకొని, ఎక్కడి కక్కడ టీకా కోసం నిరీక్షిస్తున్నారు. తాజాగా కేటాయించిన కోటాలను కూడా, తొలి డోసు టీకా తీసుకొని రెండో డోసు నిరీక్షణలో ఉన్నవారికి ప్రాధాన్యతా క్రమంలో ఇవ్వాలని కేంద్రం ఉత్తర్వులిచ్చింది. అరకొరగా అందుతున్న టీకామందుతో… ఇప్పుడా పక్రియ కుంటినడకన సాగుతోంది. తొలిడోసు, మలిడోసు నడుమ నిర్దిష్ట గడువు ముగిసినా ప్రమాదమేవిూ లేదని, చిన్న పాటి జాప్యం వల్ల తొలిడోసు నిరుపయోగమేవిూ కాదని, అవగాహన కల్పిస్తూ జనాన్ని ఊరడించాల్సి వస్తోంది. రెండో డోసుపై వ్యవధిని పెంచుతూ ప్రకటనలు ఇస్తున్నారు. సరైన వ్యూహం, ముందు చూపు కొరవడటం వల్లే ఈ దుస్థితి ఏర్పడిందని చెప్పుకోవాలి. ఇజ్రాయల్‌ వంద శాతం టీకామందు వేసి, దేశ ప్రజలెవరూ ఇక మాస్క్‌లు ధరించనవసరం లేదని ప్రకటించింది. ఈ నెలలో టీకా మందు ఉత్పత్తి పెంచి,సెప్టెంబరు నాటికి పూర్తిస్థాయికి చేరుకుంటామని దేశంలో ఉత్పత్తి చేస్తున్న భారత్‌ సీరమ్‌ , భారత్‌ బయోటిక్‌ కంపెనీలు చెబుతున్నాయి. ఆ రెండు కంపెనీలకే ఎందుకు పరిమితం కావాలి? అన్న ప్రశ్నకు పాలకుల నుంచి సమాధానం లేదు. దేశంలో హక్కున్న రెండు కంపెనీలు, సామర్థ్యం కలిగిన ఇతర కంపెనీలకు సాంకేతికత బదలాయించేలా చూడమని ఏపీ, ఢల్లీ ముఖ్యమంత్రులు ప్రధానిని కోరారు.

'జనవిజయం' జనరల్ ఆర్టికల్స్, విశ్లేషణలు పొందడానికి, సమస్యలను 'జనవిజయం' దృష్టికి తీసుకురావడానికై జనవిజయం సోషల్ మీడియా ప్రొఫైల్స్ లలో జాయిన్ అవ్వండి:
జనవిజయం Join Link
జనవిజయం Join Link
జనవిజయం
జనవిజయం
 
ఇవీ చూడండి..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ఈ వారంలో ఎక్కువగా వీక్షించినవి:

- Advertisment -

ఎక్కువగా వీక్షించిన పోస్టులు (ఆల్-టైం):

వ్యాఖ్యలు

కట్టెకోల చిన నరసయ్య on పరిశీలన,సాధన.. రచనకు ప్రయోజనకరం

విభాగాలు

తెలంగాణజాతీయంరాజకీయంపరిపాలనఆరోగ్యంఆంధ్రప్రదేశ్ప్రత్యేకంసినిమాసాహిత్యంవాణిజ్యంస్పూర్తిఅంతర్జాతీయంప్రముఖులువ్యవసాయంవీడియోలుఆయుర్వేదంఅధ్యయనంపోల్స్వినదగునెవ్వరు చెప్పినమంతెన ఆరోగ్య సలహాలువిద్యఎడిటర్ వాయిస్జర్నలిజంవికాసంవార్త-వ్యాఖ్యతెలుసుకుందాంపర్యావరణంపిల్లల పెంపకంవీరమాచనేని డైట్ సలహాలునేర వార్తలుఎన్నికలువిజ్ఞానంసమాజంన్యాయంఆధ్యాత్మికంజీవనంఆర్ధికంఉపాధిప్రకృతిరాజ్యాంగంవాతావరణంవార్తలువినోదంసాంకేతికతకుటుంబంక్రీడలుచరిత్రనాడు-నేడుపర్యాటకంప్రకృతి వ్యవసాయంటెక్నాలజీప్రజఎడిట్ఈపేపర్టీవీపల్లెప్రపంచంపీపుల్స్ ఇంటర్వ్యూబ్లాగ్మంచిమాటమన భూమిమహా విశ్వంమా బృందంవిజయపథంవివిధసంప్రదించండి