ఖమ్మం, ఆగష్టు 29 (జనవిజయం): ఆమ్ ఆద్మీ పార్టీ తెలంగాణా అనుబంధంగా ఆమ్ ఆద్మీ రైతు సంఘం ఏర్పాటు జరిగింది. మంగళవారం ఖమ్మంలోని శ్రీనగర్ కాలనీలోని ఆఫ్ జిల్లా కార్యాలయంలో రాష్ట్రం లోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన రైతునాయకులు ఆఫ్ తెలంగాణా కోర్ కమిటీ సభ్యులు నల్లమోతు తిరుమల రావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.
ఈసందర్బంగా నల్లమోతు తిరుమలరావు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో కీలక రాజకీయ శక్తిగా ఎదుగుతున్న నేపథ్యంలో రైతుసంఘం ఏర్పాటు చేయడం చారిత్రక కర్తవ్యంగా బావించాలన్నారు. ప్రపంచంలో రైతునేత ముఖ్యమైన పౌరుడిగా బావించేరోజు ఎంతో దూరంలో లేదని అన్నారు. ఆహార సంక్షోభం పొంచివున్న దేశంలో మట్టిని నమ్ముకున్న మన రైతుల గౌరవం పెరుగుతుందని అన్నారు.
రియల్ ఎస్టేట్ నియంత్రణ చేసి పంటభూములు రక్షించుకోవాలసిన అవుసరం ఉందన్నారు. రైతాంగం ఎదుర్కొంటున్న పంటలకు గిట్టుబాటు ధర, నకిలీ ఎరువు, విత్తనాలు, ధరణి సమస్యలు, రైతు సబ్సిడీలు, కౌలురైతు సమస్య, పోడురైతు సమస్య ధాన్యం కొనుగోలులో మోసాలు తదితర సమస్యలపై సంఘం కార్యక్రమాలు రూపకల్పన చేసుకోవాలని కోరారు.
ఎంతో అనుభవం ఉన్న రైతునాయకులుతో రైతుసంఘం రూపకల్పన చేశామని ఆయన తెలిపారు. రైతుల పంటనష్టం కట్టిచ్చే ఏకైక పార్టీ ఆమ్ఆద్మీపార్టీ మాత్రమేనని, కేజ్రీవాల్ రూపొందించిన ఈ విధానం జాతీయ పార్టీ గా అదికారం లోనికి వస్తే అన్నిరాష్ట్రాలలో అమలు జరుపుతామని అన్నారు.
ఆమ్ ఆద్మీ రైతు సంఘం తొలికార్యవర్గం: ఆమ్ ఆద్మీ రైతు సంఘం తానా తొలికార్యవర్గం ఎంపిక చేసుకుంది. ఆమ్ఆద్మీ రైతుసంఘం తెలంగాణా అధ్యక్షుడు గా యంపల్ల పురుషోత్తమ రెడ్డి (నల్గొండ), ప్రదాన కార్యదర్శి గా స్వర్ణ సుబ్బారావు (ఖమ్మం), ఉపాద్యక్షుడిగా కే.రాజు(మహాభూబ్ నగర్),సహాయకార్యదర్శిగా కే . గోపాలరావు (భద్రాద్రి -కొత్తగూడెంజిల్లా), కోశాధికారి గా బాణోత్ మోహాన్(వరంగల్ జిల్లా)లు ఎన్నికయ్యారు. పూర్తి స్థాయిలో రైతులకు రుణమాఫీ చేయాలి: ఆమ్ ఆద్మీ రైతు సంఘం తొలిసమావేశం పూర్తిస్థాయిలో రైతులకు లక్షరూపాయలు రుణమాఫీ చేయాలని, వ్యవసాయ పరమైన ఏరుణాలు ఉన్నా పంట రుణాలు గా మార్చిమార్చి గాయాల్ని,పంటలకవసరమైన రసాయనిక ఎరువులు కేసీఆర్ హామీ ఇచ్చిన విధంగా ఉచితంగా సరఫరా చేయాలని, వ్యవసాయ పనిముట్లు సబ్సిడీ పై అందించాలని, ధాన్యం కొనుగోలు పై దళారివ్యవస్థ జోక్యం అరికట్టాలని తీర్మానం చేశారు.రైతు దాన్యం స్వయంగా అమ్ముకోవడానికి బియ్యం దుకాణాలు తెరిచి,నిల్వాసౌకర్యం కల్పించాలని సమావేశం తీర్మానించింది.