బోనకల్ , జూలై 18(జనవిజయం) :
ఆమ్ ఆద్మీ పార్టీ మధిర నియోజక వర్గ ఇంఛార్జి గా గంధం పుల్లయ్య ను నియమిస్తున్నట్లు తెలంగాణ రాష్ట్ర ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ దిండి సుధాకర్, ఆప్ ఖమ్మం జిల్లా కన్వీనర్ , కోర్ కమిటీ సభ్యులు నల్లమోతు తిరుమలరావు అధ్యక్షతన ఖమ్మం జిల్లా ఆప్ పార్టీ ఆఫీస్ లో జరిగిన సమావేశంలో నియామక పత్రం అందచేశారు.ఈ సందర్భంగా ఆమ్ ఆద్మీ పార్టీ మధిర అసెంబ్లీ ఇంఛార్జి గంధం పుల్లయ్య మాట్లాడుతూ గత రెండు ఏళ్ళ నుంచి బహుజన సాధికారత సమితి ద్వారా పోడు భూమి రైతుల హక్కులకోసం,విద్యార్థుల,రైతుల ,వికాలంగుల,కార్మికుల ,కర్షకుల హక్కుల కోసం,ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై ఇలా ఎన్నో ప్రజా సమస్యల పైన పోరాడిన నేపథ్యం ఉంది అని అదే విధంగా యువతరం ఫౌండేషన్ బ్లడ్ డొనేషన్ పంపిణీ, నోట్ బుక్స్,పంపిణీ,అంటూవ్యాధుల,డ్రగ్స్,ముడ నమ్మకాల పై ,అవగాహన కార్యక్రమాలు ,అన్నదానాలు, ఇలా ఎన్నో సామాజిక సేవ కార్యక్రమాలు నిర్వహించినట్లు తెలియజేశారు. ఆమ్ ఆద్మీ పార్టీ సామాన్యుడి పార్టీ ,ప్రస్తుతం వున్న పార్టీలకు ప్రత్యమణ్యాయం అని కేజ్రీవాల్ నాయకత్వములో విద్య ,వైద్యం,ఉపాధి వంటి అంశాలలో ఢిల్లీ ప్రజలకు సుపరిపాలన అందిస్తుందని భవిష్యత్ లో తెలంగాణాలో కూడా ఆప్ పార్టీ బలపడి మంచి రోజులు వస్తాయని ధీమా వ్యక్తంచేశారు. తననీ నమ్మి నియోజకవర్గ ఇన్చార్జిగా బాధ్యతలు అప్పగించినందుకరానున్న రోజుల్లొ శక్తి వంచన లేకుండా కృషి చేసి పార్టీ ఎదుగుదలకు తన వంతు కృషి చేయనున్నట్లు తెలిపారు.