ఖమ్మం, జులై 19(జనవిజయం):
ఖమ్మం పార్లమెంటు పరిధిలోని 7అసెంబ్లీ సెగ్మెంట్లలో 6 అసెంబ్లీ స్థానాలకు ఇన్చార్జి లను నియమించినట్లు ఆఫ్ తెలంగాణా కోర్కమిటీ సభ్యులు, ఖమ్మం పార్లమెంటు ఇన్చార్జి నల్లమోతు తిరుమల రావు తెలిపారు.
బుధవారం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ ఆయా అసెంబ్లీ సెగ్మెంట్లలో మండల,భూత్ కమిటీలు వేసుకునే బాద్యతలు వారికి అప్పగించామని అన్నారు. ఖమ్మం అసెంబ్లీకు యం.డి గఫూర్,మదిర (యస్సీ) అసెంబ్లీ కి గంధం పుల్లయ్య, వైరా (యస్ టీ) అసెంబ్లీ సెగ్మెంట్ కు బాబూలాల్ పవార్, కొత్తగూడెం అసెంబ్లీ కు ఏ.రాంబాబు, అశ్వారావుపేట ( యస్టీ)కు చరఫా పాపారావు దొర,పాలేరు కు పసుమర్తి శ్రీనివాస్ ను నియమించి , నియామక పత్రాలు అందించామన్నారు.
అవసరం అయిన కొన్ని నియోజకవర్గాల్లో కో-కన్వినర్లు నియమిస్తామన్నారు.సత్తపల్లి అసెంబ్లీ సెగ్మెంట్ లో త్వరలో నియామకం జరుపుతామని చెప్పారు.అసెంబ్లీ సెగ్మెంట్ ఇన్చార్జి లపని విదానం సమీక్షించి వారికి రానున్న శాసనసభ ఎన్నికల్లో అభ్యర్దిగా ప్రాధాన్యత ఉంటుందని ఆయన తెలిపారు.ఆమ్ఆద్మీపార్టీ ఓ జాతీయ పార్టీ గా బాద్యతా యుతంగా దేశంలో ఉన్న వనరులను సామాన్యుల కు వినియోగం చేసే విధంగా నాణ్యమైన ఉచిత విద్యా,వైద్యం, ఉపాధి అవకాశాలు ప్రాధాన్యత గా ముందుకు పోతుందని ఆయన తెలిపారు.ఆసక్తి ఉన్న ప్రజలు 8080028080నెంబర్ కు మిస్డుకాల్ ఇవ్వడం ద్వారా ఆమ్ ఆద్మీ పార్టీలో వాలెంటీర్ల గా, సభ్యులు గా చేయవచ్చునని ఆయన తెలిపారు.