Tuesday, October 3, 2023
Homeవార్తలుఏ4 రిటైల్ షాపుల లైసెన్స్ ప్రక్రియను షెడ్యూల్ ప్రకారం పూర్తి చేయాలి - రాష్ట్ర ప్రభుత్వ...

ఏ4 రిటైల్ షాపుల లైసెన్స్ ప్రక్రియను షెడ్యూల్ ప్రకారం పూర్తి చేయాలి – రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి

ఖమ్మం, ఆగస్టు 2(జనవిజయం): 2023-25 సంవత్సరాలకు ఏ4 రిటైల్ షాపుల లైసెన్స్ ప్రక్రియను షెడ్యూల్ ప్రకారం పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి అన్నారు. బుధవారం హైదరాబాద్ నుండి టెలీ కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్లతో ఏ4 రిటైల్ షాపుల లైసెన్స్ లపై ప్రక్రియపై సీఎస్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, 2023-25 నకు గాను షెడ్యూల్ విడుదల చేసినట్లు తెలిపారు. గురువారం జిల్లా కలెక్టర్లు గౌడ, ఎస్సి, ఎస్టీలకు కేటాయించే షాపుల లాటరీలు తీయాలన్నారు. ప్రక్రియ పారదర్శకంగా చేపట్టాలని, ప్రక్రియ మొత్తం వీడియోగ్రఫీ చేయాలని ఆమె అన్నారు. ఈ నెల 4 న నోటిఫికేషన్ విడుదల చేసి, అదే రోజు నుండి ఈ నెల 18 సాయంత్రం 6.00 గంటల వరకు అన్ని పని దినాలలో దరఖాస్తులు స్వీకరించాలని అన్నారు. లైసెన్సుల లాటరీ ప్రక్రియ ఈ నెల 21న చేపట్టాలని సీఎస్ తెలిపారు. ఏ4 రిటైల్ షాపులకు ఎక్సైజ్ ట్యాక్స్ మొదటి వాయిదా మొత్తం ఈ నెల 21, 22 తేదీల్లో చెల్లించాల్సి ఉంటుందని, నవంబర్ 30 నుండి కొత్త షాపులకు స్టాక్ విడుదల చేయనున్నట్లు, డిసెంబర్ 1 నుండి షాపులు ప్రారంభం కానున్నట్లు ఆమె అన్నారు. ప్రభుత్వం సూచించిన మార్గదర్శకాల మేరకు ప్రక్రియ పూర్తి చేయాలని సీఎస్ కలెక్టర్లను ఆదేశించారు.
టెలీ కాన్ఫరెన్స్ లో పాల్గొన్న జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ మాట్లాడుతూ, ఆదేశాలు గ్రహించినట్లు ఆదేశాల మేరకు ఏ4 రిటైల్ షాపుల కేటాయింపు ప్రక్రియ పూర్తి చేయనున్నట్లు తెలిపారు. జిల్లాలో 122 ఏ4 రిటైల్ షాపులకు గాను 18 గౌడలకు, 14 ఎస్సి లకు, 8 ఎస్టీ లకు, 82 జనరల్ కు కేటాయించినట్లు ఆయన అన్నారు. గౌడ, ఎస్సి, ఎస్టీ లకు షాపుల కేటాయింపుకు గురువారం లాటరీ ప్రక్రియ చేపట్టనున్నట్లు తెలిపారు. షెడ్యూల్ ప్రకారం ప్రక్రియ అంతయూ పారదర్శకంగా చేపట్టి, పూర్తిచేయనున్నట్లు కలెక్టర్ అన్నారు.
ఈ టెలీ కాన్ఫరెన్స్ లో జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ నాగేందర్ రెడ్డి, జిల్లా సాంఘీక సంక్షేమ అధికారి కె. సత్యనారాయణ, జిల్లా గిరిజన సంక్షేమ అధికారి కృష్ణా నాయక్, జిల్లా బిసి సంక్షేమ అధికారిణి జి. జ్యోతి తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ఈ వారం పాపులర్

ఆల్ టైమ్ పాపులర్

Recent Comments