జనవిజయంఆంధ్రప్రదేశ్910 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ కోసం ప్రధాని మోదీకి సీఎం జగన్ లేఖ

910 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ కోసం ప్రధాని మోదీకి సీఎం జగన్ లేఖ

అమరావతి, మే 16 (జనవిజయం): 910 మెట్రిక్ టన్నుల లిక్విడ్ ఆక్సిజన్ కేటాయించాలని కోరుతూ ప్రధానమంత్రి నరేంద్రమోడీకి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్ రెడ్డి మరో లేఖ రాశారు. ఈ లేఖలో ఇప్పటిదాకా ఏపీకి కేంద్రం చేస్తున్న సహాయానికి కృతజ్ఞతలు తెలిపారు. కోవిడ్ నేపథ్యంలో ఐసీయూ, ఆక్సిజన్ బెడ్ల సంఖ్య అదనంగా 30 వేలకు పెంచనున్నామని, దీని కోసం ప్రతి రోజు 910 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ అవసరమని ముఖ్యమంత్రి జగన్ కోరారు. స్టోరేజ్ సదుపాయం లేకపోవడంతో విశాఖ స్టీల్ ప్లాంట్ నుంచి 100 మెట్రిక్ టన్నులు మాత్రమే ఉపయోగించగలుగున్నామని, తమిళనాడు నుంచి కేటాయించిన ఆక్సిజన్ రావడంలోనూ ఇబ్బందులు ఎదురవుతున్నాయని లేఖలో వెల్లడించారు. తిరుపతి రుయా హాస్పిటల్ ఘటనను ప్రధాని దృష్టికి తీసుకుని వెళ్లిన సీఎం వైయ‌స్ జగన్ చెన్నై, కర్ణాటక నుంచి రావలసిన ఆక్సిజన్ కొద్ది గంటలు ఆలస్యం కావడంతో 11 మంది మృత్యువాత పడ్డారని పేర్కొన్నారు. రాయలసీమ ఆక్సిజన్ అవసరాల కోసం జామ్‌నగర్ నుంచి నిత్యం ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్‌ను కొనసాగించాలని లేఖలో విఙప్తి చేశారు సీఎం వైయ‌స్‌ జగన్.

'జనవిజయం' జనరల్ ఆర్టికల్స్, విశ్లేషణలు పొందడానికి, సమస్యలను 'జనవిజయం' దృష్టికి తీసుకురావడానికై జనవిజయం సోషల్ మీడియా ప్రొఫైల్స్ లలో జాయిన్ అవ్వండి:
జనవిజయం Join Link
జనవిజయం Join Link
జనవిజయం
జనవిజయం
 
ఇవీ చూడండి..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ఈ వారంలో ఎక్కువగా వీక్షించినవి:

- Advertisment -

ఎక్కువగా వీక్షించిన పోస్టులు (ఆల్-టైం):

వ్యాఖ్యలు

విభాగాలు

తెలంగాణజాతీయంరాజకీయంపరిపాలనఆంధ్రప్రదేశ్ఆరోగ్యంప్రత్యేకంసినిమావాణిజ్యంఅంతర్జాతీయంవ్యవసాయంసాహిత్యంస్పూర్తిప్రముఖులుఆయుర్వేదంపోల్స్విద్యఅధ్యయనంవీడియోలుజర్నలిజంవికాసంపర్యావరణంవినదగునెవ్వరు చెప్పినమంతెన ఆరోగ్య సలహాలుఎన్నికలుతెలుసుకుందాంపిల్లల పెంపకంవిజ్ఞానంనేర వార్తలువార్త-వ్యాఖ్యఆధ్యాత్మికంజీవనంన్యాయంఆర్ధికంఉపాధిప్రకృతివాతావరణంవార్తలువీరమాచనేని డైట్ సలహాలుఎడిటర్ వాయిస్రాజ్యాంగంసమాజంక్రీడలుచరిత్రనాడు-నేడుపర్యాటకంప్రకృతి వ్యవసాయంటెక్నాలజీవినోదంసాంకేతికతఎడిట్కుటుంబంప్రజఈపేపర్టీవీపల్లెప్రపంచంపీపుల్స్ ఇంటర్వ్యూబ్లాగ్మంచిమాటమన భూమిమహా విశ్వంమా బృందంవిజయపథంవివిధసంప్రదించండి