జనవిజయంఆరోగ్యం86 రైల్వే ఆసుపత్రుల్లో ఆక్సిజన్ ప్లాంట్ల ఏర్పాటు

86 రైల్వే ఆసుపత్రుల్లో ఆక్సిజన్ ప్లాంట్ల ఏర్పాటు

న్యూఢిల్లీ, మే 19 (జనవిజయం): కోవిడ్-19 కట్టడి నివారణకు జరుగుతున్న ప్రయత్నాలలో భారత రైల్వేలు పూర్తి స్థాయిలో వివిధ మార్గాల్లో తమ వంతు సహాయ సహకారాలను అందజేస్తున్నాయి. అవసరమైన ప్రాంతాలకు అత్యంత వేగంగా ఆక్సిజన్ తరలిస్తున్న రైల్వేలు మరోవైపు ప్రయాణీకులు సరకులను గమ్యస్థానాలకు చేరవేస్తున్నాయి. ఇదేసమయంలో తన సిబ్బందికి అవసరమైన వైద్య సౌకర్యాలను అందించే అంశంపై రైల్వేశాఖ దృష్టి సారించింది. తన ఉద్యోగుల కోసం రైల్వేశాఖ దేశం వివిధ ప్రాంతాల్లో 86 ఆసుపత్రులను నిర్వహిస్తోంది. వీటిలో మరిన్ని సౌకర్యాలను అందుబాటులోకి తీసుకొని రావడానికి రైల్వే శాఖ బృహత్తర ప్రణాళికను రూపొందించి అమలు చేస్తోంది. దీనిలో భాగంగా అన్ని ఆసుపత్రుల్లో ఆక్సిజన్ ప్లాంటులు ఏర్పాటుకానున్నాయి. ఇప్పటికీ నాలుగు ఆసుపత్రుల్లో ఆక్సిజన్ ప్లాంట్లు అందుబాటులోకి వచ్చాయి. 52 ప్లాంట్ల ఏర్పాటుకు అనుమతులు మంజూరు అయ్యాయి. మిగిలిన 30 ప్లాంట్ల ఏర్పాటు అంశం వివిధ దశల్లో వుంది. కోవిడ్ ఆసుపత్రులుగా సేవలు అందిస్తున్న అన్ని రైల్వే ఆసుపత్రుల్లో ఆక్సిజన్ ప్లాంట్లు అందుబాటులోకి రానున్నాయి.

ఆక్సిజన్ ప్లాంట్లను ఏర్పాటు చేయడానికి రెండు కోట్ల రూపాయల వరకు నిధులను విడుదల చేసే అధికారాన్ని జనరల్ మేనేజర్లకు రైల్వేలు కల్పించాయి. రైల్వే బోర్డు దీనికి సంబంధించి 2021 మే నాల్గవ తేదీన 2020 / F (X) II / PW / 3 / పీటీ ద్వారా ఉత్తర్వులు జారీ చేసింది. వైద్య సౌకర్యాలను అందుబాటులోకి తీసుకొనే వచ్చే అంశంపై కూడా రైల్వేశాఖ దృష్టి సారించింది. కోవిడ్ చికిత్స అందించడానికి పడకల సంఖ్యను 2539 నుంచి 6972కి పెంచారు. ఇదేవిధంగా కోవిడ్ ఆస్పత్రుల్లో ఐసీయూ పడకల సంఖ్యను 273 నుంచి 573కి పెంచడం జరిగింది. వెంటిలేటర్ల సంఖ్యని 62 నుంచి 296కి పెంచిన అధికారులు బిపాప్ యంత్రాలు, ఆక్సిజన్ సాంద్రతలు, ఆక్సిజన్ సిలిండర్లు వంటిముఖ్యమైన వైద్య పరికరాలు మరింతగా అందుబాటులోకి వచ్చేలా చర్యలు తీసుకుంటున్నారు. కోవిడ్ బారిన పడిన రైల్వే ఉద్యోగులు అవసరమైతే వైద్యుల సిఫార్సు మేరకు ఎంపానెల్డ్ ఆసుపత్రులలో చేరడానికి అనుమతి ఇస్తూ రైల్వేశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. రైల్వే ఆసుపత్రుల్లో ఏర్పాటవుతున్న సౌకర్యాలు అత్యవసర చికిత్సను అందించడానికి ఉపయోగపడతాయి.

'జనవిజయం' జనరల్ ఆర్టికల్స్, విశ్లేషణలు పొందడానికి, సమస్యలను 'జనవిజయం' దృష్టికి తీసుకురావడానికై జనవిజయం సోషల్ మీడియా ప్రొఫైల్స్ లలో జాయిన్ అవ్వండి:
జనవిజయం Join Link
జనవిజయం Join Link
జనవిజయం
జనవిజయం
 
ఇవీ చూడండి..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ఈ వారంలో ఎక్కువగా వీక్షించినవి:

- Advertisment -

ఎక్కువగా వీక్షించిన పోస్టులు (ఆల్-టైం):

వ్యాఖ్యలు

కట్టెకోల చిన నరసయ్య on పరిశీలన,సాధన.. రచనకు ప్రయోజనకరం

విభాగాలు

తెలంగాణజాతీయంరాజకీయంపరిపాలనఆరోగ్యంఆంధ్రప్రదేశ్ప్రత్యేకంసినిమాసాహిత్యంవాణిజ్యంస్పూర్తిఅంతర్జాతీయంప్రముఖులువ్యవసాయంవీడియోలుఆయుర్వేదంఅధ్యయనంపోల్స్వినదగునెవ్వరు చెప్పినమంతెన ఆరోగ్య సలహాలువిద్యఎడిటర్ వాయిస్జర్నలిజంవికాసంవార్త-వ్యాఖ్యతెలుసుకుందాంపర్యావరణంపిల్లల పెంపకంవీరమాచనేని డైట్ సలహాలునేర వార్తలుఎన్నికలువిజ్ఞానంసమాజంన్యాయంఆధ్యాత్మికంజీవనంఆర్ధికంఉపాధిప్రకృతిరాజ్యాంగంవాతావరణంవార్తలువినోదంసాంకేతికతకుటుంబంక్రీడలుచరిత్రనాడు-నేడుపర్యాటకంప్రకృతి వ్యవసాయంటెక్నాలజీప్రజఎడిట్ఈపేపర్టీవీపల్లెప్రపంచంపీపుల్స్ ఇంటర్వ్యూబ్లాగ్మంచిమాటమన భూమిమహా విశ్వంమా బృందంవిజయపథంవివిధసంప్రదించండి