- ఏజెన్సీ ప్రాంత షెడ్యూల్ కులాల సమస్యలు పరిష్కరించాలి!
..ఇంటలెక్చువల్ ఫారం ఫర్ మాదిగాస్ ఇంటర్నేషనల్..
జనవిజయం, 8 జులై(విజయవాడ): ఏజెన్సీ షెడ్యూల్ కులాల సమస్యల పరిష్కరించాలని ఈరోజు విజయవాడ గాంధీనగర్ ప్రెస్ క్లబ్ నందు ఇంటలెక్చువల్ ఫారం ఫర్ మాదిగాస్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో మాదిగ, దళిత సంఘాల విలేకరుల సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ..ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏజెన్సీ ప్రాంతంలో నివసిస్తున్న దళితులకు రాజ్యాంగం కల్పించిన రిజర్వేషన్లు, హక్కులు అమలు కాక దుర్భరమైన జీవితం గడుపుతున్నారని అన్నారు. ఏజెన్సీ ప్రాంతాల్లో దళితుల విషయంలో ప్రాథమిక హక్కుల ఉల్లంఘన జరుగుతుందని ,విద్యా, ఉద్యోగ ,ఉపాధి ,రాజకీయ రంగాలలో అన్యాయం జరుగుతుందని అన్నారు. ఏజెన్సీ దళితుల సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించి సమస్యలు పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేయాలని అన్నారు. అదేవిధంగా రాష్ట్ర ఎస్సీ కమిషన్ ఏజెన్సీ ప్రాంతాల్లో దళితుల స్థితిగతులపై అధ్యయనం చేయాలని ,అదేవిధంగా ఏజెన్సీ దళితుల అభివృద్ధి కొరకు స్పెషల్ ప్యాకేజీ ఏర్పాటు చేయాలని నాయకులు డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో ఇంటలెక్చువల్ ఫారం ఫర్ మాదిగాస్ ఇంటర్నేషనల్ అధ్యక్షులు గెడ్డంబాపిరాజు, రాష్ట్ర అధ్యక్షులు మట్టా విద్యార్థి, దళిత సంక్షేమ సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు ముద్దా పిచ్చయ్య, ఆంధ్రప్రదేశ్ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షులు పేరు పోగు వెంకటేశ్వరరావు ,డక్కలి హక్కుల పోరాట సమితి నాయకులు ,బేడ బుడగ జంగం నాయకులు వనం నాగేశ్వరరావు, అరుంధతి బందు సేవ మండలి మట్టా సాయి వరప్రసాద్ ,దళితసంక్షేమసంఘం ఏలూరు కార్యదర్శి గాడిద రవిబాబు,దళితసంక్షేమసంఘం ఉమ్మడి కృష్ణ జిల్లా అధ్యక్షుడు పాతూరి చంద్రశేఖర్ తదితర నాయకులు పాల్గొన్నారు