జనవిజయంతెలంగాణ7న కెసిఆర్ కరీంనగర్ పర్యటన

7న కెసిఆర్ కరీంనగర్ పర్యటన

  • స్థానిక ప్రభుత్వాసుపత్రిలో కోవిడ్ బాధుతులకు పరామర్శ
  • ఈటెల రాజీనామా తరవాత రావడంతో పెరిగిన రాజకీయ ప్రాధాన్యం

కరీంనగర్,జూన్ 5(జనవిజయం): సీఎం కేసీఆర్.. సోమవారం కరీంనగర్ లో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో కరీంనగర్ సివిల్ ఆస్పత్రిని సందర్శిస్తారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కోవిడ్ బాధితులతో మాట్లాడి వారికి అందుతున్న వైద్య సేవలపై ఆరా తీయనున్నారు. ఇప్పటికే వరంగల్ పర్యటించిన కెసిఆర్ ఇప్పుడు కరీంనగర్ రానున్నారు. తర్వాత స్థానిక వైద్యాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించే అవకాశం ఉంది. ఈటల రాజేందర్ రాజీనామా, విమర్శలు, ఆరోపణల వ్యవహారం రాష్ట్ర రాజకీయాల్లో హీట్ పెంచుతున్న వేళ కేసీఆర్ కరీంనగర్ పర్యటనకు వెళ్తుండటం చర్చనీయాంశంగా మారింది. ఆపరేషన్ హుజూరాబాద్ పై గులాబీ బాన్ మరింత ఫోకస్ పెట్టే ఛాన్స్ ఉంది. ఇప్పటికే హుజూరాబాద్ లో కింది స్థాయి కార్యకర్తలు మొదలు టీఆర్ఎస్ నాయకులెవరూ జారిపోకుండా కేసీఆర్ పక్కాగా పావులు కదుపుతున్నారు. ఉపఎన్నిక ముగిసేవరకూ నియోజకవర్గంపై పార్టీ పట్టు సడలకుండా కేసీఆర్ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తునట్లు అర్థమవుతోంది. హుజురాబాద్ ఉపఎన్నికను టీఆర్ఎస్ అధినేత అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు. దీంతో కరీంనగర్ పర్యటనలో ఆపరేషన్ హుజూరాబాద్ వ్యూహాలకు మరింత పదును పెట్టే అవకాశం ఉందనే వాదన వినిపిస్తోంది. హుజూరాబాదను పూర్తిగా టీఆర్ఎస్ దిగ్బంధనం చేసేలా ఈటలకు ఎక్కడా ఏ చిన్న అవకాశం ఇవ్వకుండా.. పార్టీ శ్రేణులకు దిశానిర్దేశర చేసే సూచనలు కనిపిస్తున్నాయి. మొత్తం మీద కేసీఆర్ కరీంనగర్ పర్యటన తర్వాత హుజురాబాద్ రాజకీయం మరింత రక్తి కట్టడం ఖాయంగా కనిపిస్తోంది. అసైన్డ్ భూములను ఆక్రమించారంటూ వచ్చిన ఫిర్యాదులు, ఆ తరవతా జరిగిన పరిణామాలు ఈటెలను ఉద్యమపార్టీకి దూరం చేశాయి. ఆయనతోపాటే జిల్లాకు చెందిన మాజీ జడ్పీ ఛైర్ పర్సన్ తుల ఉమ కూడా పార్టీని వీడారు. భూ ఆక్రమణ నిజమేనని అధికారులు ప్రాథమిక నివేదికను అందించడంతో మే 2న ఆయనను మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేశారు. బర్తరఫ్ అయిన నాటి నుంచి నెలరోజుల వ్యవధిలో నిర్ణయాలన్నీ చకచకా సాగాయి. బీజేపీ అగ్రనేతలు చేరికపై సానుకూలతను వ్యక్తం చేయడమే కాకుండా పలు అనుమానాలను నివృత్తి చేయడంతో ఈటెల బిజెపి పార్టీ తీర్థం పుచ్చుకోవడానికి సిద్ధమయ్యారు. శుక్రవారం మీడియా సమావేశం ఏర్పాటుచేసి టీఆర్ఎస్ పార్టీకి, హుజూరాబాద్ శాసనసభ్యత్వానికి రాజీనామా సమర్పించారు. ఈటల రాజీనామాతో  హుజరాబాద్ నియోజకవర్గంలో ఉప ఎన్నిక అనివార్యం కానుంది. ఈటలతోపాటు ఉమ్మడి జిల్లా పరిషత్ మాజీ అధ్యక్షురాలు, టీఆర్ఎన్ మహిళా విభాగం మాజీ రాష్ట్ర అధ్యక్షురాలు తుల ఉమ, మరో మహిళా నాయకురాలు గండ్ర నళిని, ఎల్లారెడ్డి నియోజకవర్గానికి చెందిన మాజీ శాసనసభ్యుడు ఏనుగు రవీందర్ రెడ్డితోపాటు పలువురు నేతలు టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా సమర్పించారు. వీరంతా ఈ నెల 8 లేక 9న బీజేపీ అగ్రనేత, హోంశాఖ మంత్రి అమిత్ షా సమక్షంలో బీజేపీలో చేరనున్నారు. ఇప్పుడు ఆయన బీజేపీలో చేరి హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో పోటీచేయడం ద్వారా టీఆర్ఎస్ కు సవాల్ విసరనున్నారు. ఈ అంశాలను సిఎం కెసిఆర్ తన పర్యటనలో స్థానిక నేతలతో చర్చించే అవకాశం ఉంది.

'జనవిజయం' జనరల్ ఆర్టికల్స్, విశ్లేషణలు పొందడానికి, సమస్యలను 'జనవిజయం' దృష్టికి తీసుకురావడానికై జనవిజయం సోషల్ మీడియా ప్రొఫైల్స్ లలో జాయిన్ అవ్వండి:
జనవిజయం Join Link
జనవిజయం Join Link
జనవిజయం
జనవిజయం
 
ఇవీ చూడండి..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ఈ వారంలో ఎక్కువగా వీక్షించినవి:

- Advertisment -

ఎక్కువగా వీక్షించిన పోస్టులు (ఆల్-టైం):

వ్యాఖ్యలు

కట్టెకోల చిన నరసయ్య on పరిశీలన,సాధన.. రచనకు ప్రయోజనకరం

విభాగాలు

తెలంగాణజాతీయంరాజకీయంపరిపాలనఆరోగ్యంఆంధ్రప్రదేశ్ప్రత్యేకంసినిమాసాహిత్యంవాణిజ్యంస్పూర్తిఅంతర్జాతీయంప్రముఖులువ్యవసాయంవీడియోలుఆయుర్వేదంఅధ్యయనంపోల్స్వినదగునెవ్వరు చెప్పినమంతెన ఆరోగ్య సలహాలువిద్యఎడిటర్ వాయిస్జర్నలిజంవికాసంవార్త-వ్యాఖ్యతెలుసుకుందాంపర్యావరణంపిల్లల పెంపకంవీరమాచనేని డైట్ సలహాలునేర వార్తలుఎన్నికలువిజ్ఞానంసమాజంన్యాయంఆధ్యాత్మికంజీవనంఆర్ధికంఉపాధిప్రకృతిరాజ్యాంగంవాతావరణంవార్తలువినోదంసాంకేతికతకుటుంబంక్రీడలుచరిత్రనాడు-నేడుపర్యాటకంప్రకృతి వ్యవసాయంటెక్నాలజీప్రజఎడిట్ఈపేపర్టీవీపల్లెప్రపంచంపీపుల్స్ ఇంటర్వ్యూబ్లాగ్మంచిమాటమన భూమిమహా విశ్వంమా బృందంవిజయపథంవివిధసంప్రదించండి