మోడీని గద్దె దించే వరకు ఉద్యమం ఆగదు
..CPI నేత చాడా వెంకటరెడ్డి..
రామగుండం , ఏప్రిల్ 23(జనవిజయం):
ఎన్నికల హామీలను మరిచి,కార్మిక హక్కులను కాలరాస్తు, కార్పొరేట్ సంస్థలకు ఊడిగం చేస్తున్న నరేంద్రమోడీ ప్రభుత్వం పతనం తప్పదని సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకటరెడ్డి అన్నారు.
ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపైన దేశ వ్యాప్తంగా సిపిఐ ప్రచార యాత్ర కార్యక్రమంలో భాగంగా రామడుగు మండల కేంద్రంలో అంబెడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.అనంతరం కొయ్యడ సృజన్ కుమార్ అధ్యక్షతన జరిగిన సభకు ముఖ్య అతిథులుగా హాజరైన చాడ వెంకటరెడ్డి మాట్లాడుతూ., నన్ను నమ్మండి ఈ దేశానికి కాపలా దారుడిగా వుంటాను అని ఎన్నికలకు ముందు ప్రగల్భాలు పలికిన మోదీ అధికారాన్ని హస్తగతం చేసుకొన్న తర్వాత పేదల రక్తాన్ని పీల్చి కార్పోరేట్ గద్దలకు దోహదపడే విధంగా చట్టాలను చేస్తున్న జిత్తుల మారి మోడీని గద్దెదింపాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచీ ఇప్పటివరకు దేశాన్ని 14 మంది ప్రధానులు కాలంలో 50 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసిపోతే, మోడీ ఎనిమిది సంవత్సరాల పరిపాలన లో దాదాపు ‘ఒక లక్ష’ కోట్ల రూపాయల అప్పులు చేశారని ఆరోపించారు.నోట్ల రద్దు చేసి నల్లధనాన్ని వైట్ మనీ గా మార్చి, పేదల అకౌంట్లో డబ్బులు వేస్తామని, దేశంలొ ఉగ్రవాదాన్ని అంతం చేస్తానని చెప్పి ఎటువంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండానే నోట్లు రద్దు చేసి దాదాపు వంద మందికి పైగా చావుకు కారకులుగా మిగిలారే తప్ప ఉగ్ర వాదాన్ని పెకిలించ గలిగారా అని ప్రశ్నించారు.పెట్రోల్, డీజల్, గ్యాస్,పప్పు, నూనె ధరలను ఇష్టాను సారంగా పెంచి, సామాన్యుడి నడ్డి విరుస్తున్న మోడీ కేడి ప్రభుత్వాన్ని ఇదే మంటల్లో వేసి తగులబెట్టే రోజులు దగ్గర్లోనే వున్నాయని ఇప్పటికైనా మేల్కొని మతోన్మాదంతో వ్యవరించకుండా లౌకిక భావజాలంతో దేశాభివృద్ధికై పాటు పడాలనిహితవు పలికారు.
సిపిఐ జిల్లా కార్యదర్శి మర్రి వెంకటస్వామి మాట్లాడుతూ రాష్ట్రంలో వున్న జగన్మోహన్ రెడ్డి రాష్ట్రానికి కేంద్రం ఇంత అన్యాయం చేస్తున్నా ఒక్క మాట కూడా మాట్లాడలేని స్థితిలో ఉన్నారని, పథకాల పేరుతో ప్రజా ధనాన్ని పంచి పెడుతూ, రాష్ట్రాన్ని ఏ మాత్రం అభివృద్ది చేయకుండా ఓటు బ్యాంకు విధానాలను అవలంబిస్తూ అప్పుల పాలు చేస్తున్నారన్నారు.
ఈ కార్యక్రమంలో సీపీఐ సిద్దిపేట జిల్లా కార్యదర్శి మంద పవన్,సిరిసిల్ల జిల్లా కార్యదర్శి గుంటి వేణు, ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు కసిరెడ్డి మణికంఠ రెడ్డి మహిళ నాయకులు గూడెం లక్ష్మీ, కిన్నెర మల్లవ్వ,యాద పద్మ,నాయకులు పోనగంటి కేదారి,బుచ్చన్న యాదవ్, సురేందర్ రెడ్డి, పైడిపల్లి రాజు,గోడిశాల తిరుపతి గౌడ్, ఉమ్మెంతల రవీందర్ రెడ్డి,మచ్చ రమేష్,వెంకటేష్, గంటే రాజేశం,కనుకయ్య తదితరులు పాల్గొన్నారు.