జనవిజయంజాతీయం6000వ రైల్వే స్టేషన్‌లో వై-ఫై సౌకర్యం

6000వ రైల్వే స్టేషన్‌లో వై-ఫై సౌకర్యం

‘డిజిటల్ ఇండియా’లో భాగస్వామిగా రైల్వే

న్యూఢిల్లీ, మే 17 (జనవిజయం): రైల్వే శాఖ మరో ఘనతను సాధించింది. దేశంలో, వై-ఫైతో అనుసంధానమైన రైల్వే స్టేషన్ల సంఖ్యను 6000కు చేర్చింది. రైల్వే ప్రయాణీకులు, సాధారణ పౌరులను డిజిటల్ వ్యవస్థలతో అనుసంధానించేందుకు సుదూర స్టేషన్లలోనూ వై-ఫై సౌకర్యాన్ని రైల్వే శాఖ విస్తరిస్తూ ఉంది. తూర్పు మధ్య రైల్వే పరిధిలో, ఝార్ఖండ్‌ రాష్ట్రంలో ఉన్న హజారీబాగ్‌ రైల్వే స్టేషన్‌లో ఈ నెల 15న వై-ఫై సౌకర్యాన్ని ప్రారంభించడం ద్వారా 6000వ స్టేషన్‌ ఘనతను రైల్వే శాఖ సాధించింది. 2016 జనవరిలో ముంబయి రైల్వే స్టేషన్‌లో వై-ఫై ప్రారంభించడం ద్వారా ఈ డిజిటల్‌ ప్రయాణం ప్రారంభమైంది. తర్వాత, పశ్చిమ బంగాల్‌లోని మిడ్నాపూర్‌ స్టేషన్‌ 5000వ వై-ఫై స్టేషన్‌గా నిలవగా, హజారీబాగ్‌తో 6000వ స్టేషన్‌ మైలురాయిని రైల్వే శాఖ చేరుకుంది. అదే రోజు, ఒడిశాలోని అంగుల్ జిల్లాలో ఉన్న జరపద రైల్వే స్టేషన్‌లోనూ వై-ఫై సౌకర్యాన్ని ఏర్పాటు చేసింది.

కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన ‘డిజిటల్ ఇండియా’ లక్ష్యాలను చేరుకోవడానికి రైల్వే స్టేషన్లలో వై-ఫై సౌకర్యం తోడ్పడుతోంది. ఇది గ్రామీణ, పట్టణ ప్రజల మధ్య డిజిటల్ దూరాన్ని తగ్గించి, పల్లె ప్రాంతాల్లో డిజిటల్ అడుగులను, మంచి వినియోగదారు అనుభవాన్ని పెంచుతోంది. ఇప్పుడు 6000 స్టేషన్లలో రైల్వే శాఖ వై-ఫై సౌకర్యాన్ని అందిస్తోంది. స్వీయ మనుగడ పద్ధతిలో రైల్వే స్టేషన్లలో వై-ఫై సౌకర్యాలను కల్పిస్తున్నారు. దీనివల్ల రైల్వే శాఖపై ఎలాంటి ఆర్థిక భారం ఉండదు. రైల్వే మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పనిచేసే ప్రభుత్వ రంగ సంస్థ అయిన రైల్‌టెల్ సాయంతో ఈ సౌకర్యాన్ని కల్పిస్తున్నారు. గూగుల్, డాట్ (యుఎస్‌ఓఎఫ్ కింద), పీజీసీఐఎల్, టాటా ట్రస్టు ఇందులో భాగస్వాములుగా ఉన్నాయి.

తాజా లెక్కల ప్రకారం ఆంధ్రప్రదేశ్‌ పరిధిలో 509, అరుణాచల్‌ప్రదేశ్‌లో 3, అసోంలో 222, బిహార్‌లో 384, ఛండీఘర్‌‌లో 5, ఛత్తీస్‌ఘడ్‌‌లో 115, దిల్లీలో 27, గోవాలో 20, గుజరాత్‌‌లో 320, హరియాణాలో 134, హిమాచల్‌ప్రదేశ్‌‌లో 24, జమ్ము & కశ్మీర్‌‌లో 14, ఝార్ఖండ్‌‌లో 217, కర్ణాటకలో 335, కేరళలో 120, మధ్యప్రదేశ్‌‌లో 393, మహారాష్ట్రలో 550, మేఘాలయ‌లో 1, మిజోరంలో 1, నాగాలాండ్‌లో 3, ఒడిశాలో 232, పంజాబ్‌లో 146, రాజస్థాన్‌‌లో 458, సిక్కింలో 1, తమిళనాడులో 418, తెలంగాణలో 45, త్రిపురలో 19, ఉత్తరప్రదేశ్‌‌లో 762, ఉత్తరాఖండ్‌‌లో 24, పశ్చిమ బంగాల్‌‌లో 498 స్టేషన్లలో వై-ఫై సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకువచ్చారు. భవిష్యత్తులో మరిన్ని స్టేషన్లలో ఈ సాంకేతికతను ప్రారంభించాలని భారతీయ రైల్వేలు లక్ష్యంగా పెట్టుకున్నాయి.

'జనవిజయం' జనరల్ ఆర్టికల్స్, విశ్లేషణలు పొందడానికి, సమస్యలను 'జనవిజయం' దృష్టికి తీసుకురావడానికై జనవిజయం సోషల్ మీడియా ప్రొఫైల్స్ లలో జాయిన్ అవ్వండి:
జనవిజయం Join Link
జనవిజయం Join Link
జనవిజయం
జనవిజయం
 
ఇవీ చూడండి..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ఈ వారంలో ఎక్కువగా వీక్షించినవి:

- Advertisment -

ఎక్కువగా వీక్షించిన పోస్టులు (ఆల్-టైం):

వ్యాఖ్యలు

కట్టెకోల చిన నరసయ్య on పరిశీలన,సాధన.. రచనకు ప్రయోజనకరం

విభాగాలు

తెలంగాణజాతీయంరాజకీయంపరిపాలనఆరోగ్యంఆంధ్రప్రదేశ్ప్రత్యేకంసినిమాసాహిత్యంవాణిజ్యంస్పూర్తిఅంతర్జాతీయంప్రముఖులువ్యవసాయంవీడియోలుఆయుర్వేదంఅధ్యయనంపోల్స్వినదగునెవ్వరు చెప్పినమంతెన ఆరోగ్య సలహాలువిద్యఎడిటర్ వాయిస్జర్నలిజంవికాసంవార్త-వ్యాఖ్యతెలుసుకుందాంపర్యావరణంపిల్లల పెంపకంవీరమాచనేని డైట్ సలహాలునేర వార్తలుఎన్నికలువిజ్ఞానంసమాజంన్యాయంఆధ్యాత్మికంజీవనంఆర్ధికంఉపాధిప్రకృతిరాజ్యాంగంవాతావరణంవార్తలువినోదంసాంకేతికతకుటుంబంక్రీడలుచరిత్రనాడు-నేడుపర్యాటకంప్రకృతి వ్యవసాయంటెక్నాలజీప్రజఎడిట్ఈపేపర్టీవీపల్లెప్రపంచంపీపుల్స్ ఇంటర్వ్యూబ్లాగ్మంచిమాటమన భూమిమహా విశ్వంమా బృందంవిజయపథంవివిధసంప్రదించండి