Saturday, June 10, 2023

రైతు క్లబ్ చైర్మన్ పిలుపు మేరకు తేనేటి విందుకు విచ్చేసిన తమ్మినేని

 

చర్లలో అగ్నిమాపక కేంద్రం ఏర్పాటు చేసే విధంగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా

..తమ్మినేని,CPM రాష్ట్ర కార్యదర్శి..

రైతు క్లబ్ చైర్మన్ పిలుపు మేరకు తేనేటి విందుకు విచ్చేసిన తమ్మినేని

 

చర్ల మార్చ్ 20, (జనవిజయం)

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండల కేంద్రంలో జన చైతన్య బస్సు యాత్రలో భాగంగా చర్ల విచ్చేసిన సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, ఖమ్మం జిల్లా కార్యదర్శి పోతినేని సుదర్శన్, రాష్ట్ర కమిటీ సభ్యులు మచ్చ వెంకటేశ్వర్లు ను రైతు క్లబ్ చైర్మన్ కొత్తపల్లి రామాంజనేయులు తన నివాసానికి తేనేటివి విందుకు ఆహ్వానించాగా .. కొత్తపల్లి రామాంజనేయులు నివాసంలో తేనెటీవిందులో పాల్గొని కాసేపు కొత్తపల్లి తో ముచ్చటించారు.

         కొత్తపల్లి రామాంజనేయులు మాట్లాడుతూ.,. రైతు అహర్నిశలు కష్టపడి పనిచేసి నల్లిపురుగు పంటను పాడు చేస్తున్న మార్కెట్లో మిర్చి ధర చూసి ఆశతో అధిక పెట్టుబడి పెట్టి పురుగుమందులు పిచికారి చేసుకొని పంటను కాపాడుకొని మిర్చి కోసి కల్లాల్లో ఎండబెట్టుకుంటే గులాబ్ తుఫాన్ వల్ల పంట మొత్తం నీళ్ల పాలు అయిందన్నారు. మార్కెట్లో మిర్చి ధర చూసి రైతులు అప్పులు తీసుకొచ్చి మరి పెట్టుబడి పెట్టారని అకాల వర్షాలకు రైతులు నడిరోడ్డు మీద పడ్డారని రైతులను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని ,చర్ల మండలానికి అగ్నిమాపక కేంద్రం లేక ప్రజలు అగ్నిప్రమాదం వల్ల సర్వం కోల్పోతున్నారని ఎలాగైనా చర్ల మండలానికి అగ్నిమాపక కేంద్రం ఏర్పాటు చేసే విధంగా కృషి చేయాలన్నారు. స్పందించిన తమ్మినేని వీరభద్రం అకాల వర్షాలకు నష్టపోయిన మిర్చి రైతులకు నష్టపరిహారం అలాగే చర్లలో అగ్నిమాపక కేంద్రం ఏర్పాటు చేసే విధంగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని కార్మిక కర్షక బడుగు బలహీన వర్గాలకు సిపిఎం పార్టీ ఎప్పుడూ అండగా ఉంటుందని తెలియజేశారు.

 ఈ   కార్యక్రమంలో జిల్లా నాయకులు చీమలమర్రి మురళి. బి ఆర్ ఎస్ మండల అధ్యక్షులు సోయం రాజారావు. మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ కాపుల కృష్ణార్జునారావు. ఉపసర్పంచ్ సిరిపురపు శివ లక్ష్మీనారాయణ. బోళ్ల వినోద్. ఆలం ఈశ్వర్. తదితరులు పాల్గొన్నారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

పాపులర్

Recent Comments