భద్రాద్రి కొత్తగూడెం, ఆగస్ట్ 20 (జనవిజయం): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లో మద్యం దుకాణాలు కోసం 5,057 దరఖాస్తులు అందినట్లు కలెక్టర్ డాక్టర్ ప్రియాంక తెలిపారు. అబ్కారీ కార్యాలయంలో 4వ తేదీ నుంచి 18 తేదీ వరకు జిల్లాలోని 88 షాపులకు దరఖాస్తులు స్వీకరించినట్లు ఒక ప్రకటనలో చెప్పారు. మొత్తం 5057 దరఖాస్తులు వచ్చినట్లు తెలిపారు. ఆదివారం కెటిపిఎస్ లోని భద్రాద్రి ఆడిటోరియంలో డ్రా నిర్వహణ కోసం చేసిన ఏర్పాట్లు ను కలెక్టర్ పరిశీలించారు.
సోమవారం ఉదయం 11 గంటలకు గెజిట్ సీరియల్ నెంబర్ ప్రకారం డ్రా తీసే కార్యక్రమం నిర్వహించనున్నట్లు కలెక్టర్ తెలిపారు. దరఖాస్తుదారులు ఉదయం 9 గంటల వరకు భద్రాద్రి ఆడిటోరియంకు చేరుకోవాలని తెలిపారు. డ్రా తీయుటలో చేపట్టాల్సిన జాగ్రత్తలపై ఆబ్కారీ అధికారులకు ఆమె పలు సూచనలు చేశారు.
ఈ కార్యక్రమంలో అబ్కారీ డిప్యూటీ కమిషనర్ జనార్ధన్ రెడ్డి, జిల్లా అబ్కారీ అధికారి జానయ్య, సీఐలు, ఎస్ఐ లు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.