Saturday, February 24, 2024
Homeరాజకీయంఐదేళ్లలో దేశంలో అనేక రంగాల్లో అభివృద్ది

ఐదేళ్లలో దేశంలో అనేక రంగాల్లో అభివృద్ది

  • ఆర్టికల్‌ 370 తొలగింపుతో పూర్తి రాజ్యాంగం ఆవిష్కృతం
  • రిఫామ్‌, పర్‌ఫామ్‌, ట్రాన్స్‌ఫామ్‌ లక్ష్యంగా ఐదేళ్ల పాలన
  • పార్లమెంట్‌లో చివరి రోజు ప్రధాని మోడీ ప్రసంగం

న్యూఢల్లీి,ఫిబ్రవరి10:

ఈ ఐదేళ్ల కాలంలో దేశంలో ఎన్నో రంగాల్లో అభివృద్ధి సాధించామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. పార్లమెంట్‌ సమావేశాల చివరిరోజు సందర్భంగా లోక్‌సభలో ప్రధాని ప్రసంగించారు. ఈ సమావేశాల్లో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నామన్నారు. ఆర్టికల్‌ 370ను తొలగించడం ద్వారా రాజ్యాంగం పూర్తిగా ఆవిష్కృతమైందని ప్రధాని మోదీ అన్నారు. తద్వారా జమ్మూ కశ్మీర్‌ ప్రజలకు సామాజిక న్యాయం అందించగలుగుతున్నామని అన్నారు. జీ`20కి అధ్యక్షత వహించే అవకాశం భారత్‌కు దక్కిందని, వ్యవస్థలు మారినా దేశ ప్రజాస్వామ్య స్ఫూర్తి ఎప్పుడూ మారదని చెప్పారు. కరోనా సమయంలో కూడా దేశ కార్యక్రమాలు ఆగిపోనివ్వలేదని దేశ ఆర్థిక వ్యవస్థకు ప్రతి ఒక్కరూ తోడ్పాటు అందించారని కొనియాడారు. ఆ సమయంలో ఎంపీలు సైతం తమ నిధులను వదులుకున్నారని పేర్కొన్నారు. అందుకు ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని ప్రధాని మోదీ అన్నారు. దేశానికి మరోసారి తీర్మానాలను జాతి పాదాల చెంత అంకితం చేసే అవకాశం వచ్చింది. ఈ ఐదేళ్లు దేశంలో జరిగిన సంస్కరణలు, పనితీరు, పరివర్తనలతో కొత్త నమ్మకం పెరుగుతోంది.’ఈ ఐదేళ్లు దేశంలో రిఫామ్‌, పర్‌ఫామ్‌, ట్రాన్స్‌ఫామ్‌ సంబంధించినవి. సంస్కరణలు, పనితీరు కారణంగా జరిగిన పరివర్తనను మనం చూడగలుగుతున్నాం.

లోక్‌సభ, రాష్టాల్ర అసెంబ్లీలలో మహిళలకు 33 శాతం సీట్లు రిజర్వ్‌ చేసే చట్టాన్ని 17వ లోక్‌సభ హయాంలో ఆమోదించాం. కొత్త పార్లమెంట్‌ లో ఆమోదించిన తొలి బిల్లు కూడా ఇదే. సభ తీసుకున్న అత్యంత ముఖ్యమైన నిర్ణయాల్లో ఇది ఒకటి. మహిళలకు వారి హక్కులను కల్పించాలనేదే మా ప్రభుత్వ ప్రధాన లక్ష్యం అని నరేంద్ర మోదీ అన్నారు. మూడో దఫా ప్రభుత్వంలో మరిన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటామని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. తమ పాలనలో దేశ ప్రజల్లో విశ్వాసం పెరిగిందని ప్రధాని మోదీ అన్నారు. గత ఐదేళ్లలో అద్భుతమైన మార్పులు ఆవిష్కరణలు తీసుకువచ్చామని చెప్పారు. దేశాన్ని తామెప్పుడూ వెనకడుగు వేయనివ్వలేదన్నారు. ’ఎన్నో ఏళ్ల కల అయిన కొత్త పార్లమెంట్‌ భవనాన్ని నిర్మించుకున్నాం. కరోనా లాంటి విపత్కర పరిస్థితిని సమర్ధవంతంగా ఎదుర్కొన్నాం. జీ20 సమావేశాన్ని నిర్వహించడం వల్ల భారత్‌ ప్రతిష్ట పెరిగింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా మార్పు కనిపిస్తోంది. పేపర్‌లెస్‌ పార్లమెంట్‌, డిజిటలైజేషన్‌ సభ్యులకు ఎంతగానో ఉపయోగపడుతుంది. గత పదేళ్లలో దేశంలో ఉత్పాదకత పెరిగింది. ఈ టర్ములో పార్లమెంట్‌ సమావేశాల్లో చేసిన అనేక సంస్కరణలు గేమ్‌ చేంజర్లుగా మారాయి. ఉగ్రవాద నిర్మూలనకు తీసుకున్న చర్యల వల్ల కాశ్మీర్‌లో శాంతి పెరిగింది’ అని మోదీ తెలిపారు. బీజేపీ పాలనలో అద్భుత ప్రగతి, దేశ ప్రజల ఆత్మవిశ్వాసం పెరిగిందన్నారు ప్రధాని మోదీ.ఐదేళ్లలో అనేక సంస్కరణలు తీసుకొచ్చామన్నారు. ఐదేళ్లలో దేశంలో ఉత్పాదకత భారీగా పెరిగిందని చెప్పారు. కరోనా విపత్తును సమర్థవంతంగా ఎదుర్కొని దేశ ప్రజలను కాపాడామన్నారు. కరోనా సమయంలో ఎంపీలు తమ జీతాను ప్రజలకిచ్చి వారిలో ఆత్మవిశ్వాసం పెంచారని ప్రధాని మోదీ అన్నారు. పేదల జీవితాల్లో వెలుగులు నింపేందుకు అనేక చర్యలు చేపట్టామన్నారు. ఎన్ని విపత్తులు వచ్చినా దేశంలో అభివృద్ది ఆగలేదని ప్రధాని మోదీ అన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ఈ వారం పాపులర్

ఆల్ టైమ్ పాపులర్

Recent Comments