జనవిజయంజాతీయం4 కోట్ల కుటుంబాలను చేరిన ఉచిత డిష్

4 కోట్ల కుటుంబాలను చేరిన ఉచిత డిష్

న్యూఢిల్లీ, మే 18 (జనవిజయం): డీడీ (దూరదర్శన్) ఉచిత డిష్ ఒక కొత్త మైలురాయిని చేరింది. 2025 సంవత్సరం నాటికి 5 కోట్ల మైలు రాయిని కూడా దాటవచ్చునని అంచనా. స్టార్, సోనీ, కలర్స్, వార్తలు, క్రీడలు, విద్యా చానళ్లు సహా 161కి పైగా ఉచిత చానళ్లు డీడీ ఉచిత డిష్ అందించే జాబితాలో ఉన్నాయి. డీడీకి చెందిన ఉచిత డిష్ అందిస్తున్న చానళ్లలో పాత కాలం నాటి చలనచిత్ర సంగీతాన్ని విశ్లేషించే డీడీ రెట్రో ఆధారిత చానల్ అతి తక్కువ సమయంలోనే బహుళ ప్రాచుర్యం పొందింది. ఫ్రీ టు ఎయిర్, డైరెక్ట్ టు హోమ్ (డీటీహెచ్) సేవలందిస్తున్న బహుళ చానల్ ఇది. ఎంటర్‌టైన్‌మెంట్, సమాచారంలో నాణ్యతకు ప్రత్యామ్నాయం అందించడమే ఈ చానల్ లక్ష్యం. ఈ డీడీ ఫ్రీ డిష్ దేశంలో అత్యధిక సంఖ్యాకులైన పేదలు, మధ్యతరగతి వర్గాలకు ఒక వరంగా మారింది.

చాలా మంది సంవత్సరానికి ఒకసారి లేదా ప్రతి నెలా టీవీ రీఛార్జ్ చేస్తారు. రీఛార్జి చేయకుండా టీవీ చూడాలేమా అంటే చూడవచ్చు.. అదెలాగనుకుంటున్నారా అయితే ఈ విషయం తెలుసుకోండి.. ప్రసార భారతి డీడీ ఫ్రీ డిష్ ద్వారా రీఛార్జ్ నుంచి బయటపడవచ్చు. మీరు రీఛార్జ్ చేయకపోతే ఎక్కువ ఛానెల్‌లను చూడలేరు. ప్రసార భారతి సెట్ టాప్ బాక్స్‌కు దరఖాస్తు చేయండి ఓకే అయితే.. మీకు 160 ఛానెల్స్ చూసే అవకాశం లభిస్తుంది. అటువంటి పరిస్థితిలో, ఈ సెట్ టాప్ బాక్స్ కోసం మీరు ఎంత డబ్బు ఖర్చు చేయాల్సి వస్తుంది.. దాన్ని ఎలా తక్కువ ధరకు పొందవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం. డీడీ ఫ్రీ డిష్ అనేది ప్రసార భారతి నిర్వహిస్తున్న డీటీహెచ్‌ సేవ. ఇది డిసెంబర్ 2004లో ప్రారంభించారు. దీనిలో మీరు సెట్‌టాప్ బాక్సుల సమితిని పొందుతారు. దీని కోసం మీరు ఒక్కసారి మాత్రమే డబ్బు చెల్లించాలి. ఆ తర్వాత మీరు జీవితాంతం దాని ద్వారా టీవీ చూడవచ్చు. మీరు ప్రతి నెలా లేదా సంవత్సరానికి ఎటువంటి రుసుం చెల్లించాల్సిన అవసరం ఉండదు.

మీకు ఎన్ని ఛానెల్‌లు వస్తాయి?

ప్రసార భారతి తెలిపిన సమాచారం ప్రకారం, మీరు 15 జనరల్ ఎంటర్టైన్మెంట్ ఛానల్స్, 15 మూవీ ఛానల్స్, 23 రీజినల్ ఛానల్స్, 51 ఎడ్యుకేషనల్ ఛానెల్స్, 24 న్యూస్ ఛానల్స్, 6 మ్యూజిక్ ఛానల్స్, 3 భక్తి ఛానల్స్, 3 ఇంటర్నేషనల్ ఛానల్స్ చూడవచ్చు. దీని ద్వారా మీరు ప్రత్యక్ష క్రికెట్, సూపర్‌హిట్‌ పాటలు, సినిమాలు మొదలైనవి ఆనందించవచ్చు.

ఒక్కసారి ఎన్ని రూపాయలు చెల్లించాలి?

మీరు డీడీ ఉచిత డిష్ పొందాలనుకుంటే అప్పుడు ఒక టైమ్ సెట్ కొనుగోలు చేయాలి. మీరు మార్కెట్లో ఎక్కడి నుంచైనా డీడీ ఫ్రీ డిష్ సెట్ టాప్ బాక్స్, డిష్ కొనుగోలు చేయవచ్చు. ఈ మొత్తం సెట్ కోసం మీరు రూ. 2000 రూపాయల వరకు ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఇది మీ వన్-టైమ్ ఖర్చు అవుతుంది దీని తరువాత మీరు నెలవారీ చెల్లించాల్సిన అవసరం ఉండదు.

ఎక్కడైనా తీసుకోవచ్చా?

మీరు ఇళ్లు మారితే దాన్ని కూడా సులభంగా ఇన్‌స్టాల్ చేయవచ్చు. దీని కోసం ఏదైనా ఇన్స్టాలర్ సహాయంతో దానిని ఒక ఇంటి నుంచి మరో ఇంటికి మార్చుకోవచ్చు.

'జనవిజయం' జనరల్ ఆర్టికల్స్, విశ్లేషణలు పొందడానికి, సమస్యలను 'జనవిజయం' దృష్టికి తీసుకురావడానికై జనవిజయం సోషల్ మీడియా ప్రొఫైల్స్ లలో జాయిన్ అవ్వండి:
జనవిజయం Join Link
జనవిజయం Join Link
జనవిజయం
జనవిజయం
 
ఇవీ చూడండి..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ఈ వారంలో ఎక్కువగా వీక్షించినవి:

- Advertisment -

ఎక్కువగా వీక్షించిన పోస్టులు (ఆల్-టైం):

వ్యాఖ్యలు

కట్టెకోల చిన నరసయ్య on పరిశీలన,సాధన.. రచనకు ప్రయోజనకరం

విభాగాలు

తెలంగాణజాతీయంరాజకీయంపరిపాలనఆరోగ్యంఆంధ్రప్రదేశ్ప్రత్యేకంసినిమాసాహిత్యంవాణిజ్యంస్పూర్తిఅంతర్జాతీయంప్రముఖులువ్యవసాయంవీడియోలుఆయుర్వేదంఅధ్యయనంపోల్స్వినదగునెవ్వరు చెప్పినమంతెన ఆరోగ్య సలహాలువిద్యఎడిటర్ వాయిస్జర్నలిజంవికాసంవార్త-వ్యాఖ్యతెలుసుకుందాంపర్యావరణంపిల్లల పెంపకంవీరమాచనేని డైట్ సలహాలునేర వార్తలుఎన్నికలువిజ్ఞానంసమాజంన్యాయంఆధ్యాత్మికంజీవనంఆర్ధికంఉపాధిప్రకృతిరాజ్యాంగంవాతావరణంవార్తలువినోదంసాంకేతికతకుటుంబంక్రీడలుచరిత్రనాడు-నేడుపర్యాటకంప్రకృతి వ్యవసాయంటెక్నాలజీప్రజఎడిట్ఈపేపర్టీవీపల్లెప్రపంచంపీపుల్స్ ఇంటర్వ్యూబ్లాగ్మంచిమాటమన భూమిమహా విశ్వంమా బృందంవిజయపథంవివిధసంప్రదించండి