జనవిజయంఆంధ్రప్రదేశ్చిన్న పిల్లలపై కరోనా ధర్డ్ వేవ్ ప్రభావం - ఆధారాల్లేవన్న నీతి ఆయోగ్ సభ్యుడు పాల్

చిన్న పిల్లలపై కరోనా ధర్డ్ వేవ్ ప్రభావం – ఆధారాల్లేవన్న నీతి ఆయోగ్ సభ్యుడు పాల్

న్యూఢిల్లీ,జూన్ 8 (జనవిజయం): కరోనా థర్డ్ వేవ్ పిల్లలపై ఎటువంటి ప్రభావం చూపదని కోవిడ్ మేనేజ్ మెంట్ కమిటీ సభ్యుడు, నీతీ అయోగ్ మెంబర్ వీకే పాల్ తెలిపారు. కరోనా థర్డ్ వేవ్ పిల్లలపై ఎటువంటి ప్రభావం చూపబోదని వీకే పాల్ అన్నారు. ఏ వేవ్ కూడా ప్రత్యేకంగా పిల్లలపై ఎఫెక్ట్ చూపుతుందనడానికి సరైన ఆధారల్లేవని స్పష్టం చేశారు. కరోనా కేసులు చిన్న పిల్లల్లో పెరుగుతుండంతో చాలా మంది ఆందోళన చెందుతున్నారని తెలిపారు. అయితే పిల్లలపై కరోనా వేవ్ ప్రభావం చూపుతుందనడానికి ఎటువంటి కచ్చితమైన ఆధారాల్లేవన్నారు. పెద్ద వాళ్లలాగే పిల్లలు కూడా కరోనా బారిన పడే ఛాన్స్ ఉందన్నారు. అంతే తప్ప ప్రత్యేకంగా పిల్లలపైనే కరోనా ప్రభావం అధికంగా ఉంటుందని చెప్పడానికి ఎలాంటి ఆధారాల్లేవని ఆయన చెప్పారు. అంతేకాదు ..పేరెంట్స్ టీకా వేసుకోవడం కారణంగా పిల్లల్లో వైరన్ వ్యాప్తిని కొంత వరకు అడ్డుకోవచ్చని వీకే పాల్ చెప్పారు. కరోనా కేసులు చిన్న పిల్లల్లో పెరుగుతుండంతో చాలా మంది ఆందోళన చెందుతున్నారు. కానీ పిల్లలపై కరోనా వేవ్ ప్రభావం చూపుతుందనడానికి ఎటువంటి కచ్చితమైన ఆధారాలు లేవు’ అని ఆయన చెప్పారు. ‘అడలో నిరోప్రివలెన్స్ ఎలా ఉందో పిల్లల్లోనూ అలానే ఉంది.. అంటే పెద్ద వాళ్లలాగే పిల్లలు కూడా కరోనా బారిన పడే ఛాన్స్ ఉంది. అంతే తప్ప ప్రత్యేకంగా పిల్లలపైనే కరోనా ప్రభావం అధికంగా ఉంటుందని చెప్పడానికి కచ్చితమైన ఆధారాలు లేవు’ అని ఆయన తెలిపారు. అదే విధంగా మళ్లీ కరోనా వేవ్ వస్తే.. అది పిల్లలపైనే ఎక్కువ ప్రభావం చూపుతుందనడానికి ఎటువంటి సైంటిఫిక్ ఆధారాలు లేవని ఇండియన్ పీడియాట్రిక్ అసోసియేషన్ తెలిపింది. వ్యాక్సిన్ విషయంలో తల్లిదండ్రులు సంకోచించవద్దన్నారు. పేరెంట్స్ టీకా వేసుకోవడం వల్ల పిల్లల్లో వైరన్ వ్యాప్తిని కొంతమేరకు అడ్డుకోవచ్చన్నారు. మరోవైపు కేంద్రం కూడా పిల్లలపై కరోనా మూడో వేవ్ ప్రమాదకరమన్న వాదనలు కొట్టిపారేసింది. అలాంటి ఆధారాలు ఏమీ లేవంటూ కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ మంగళవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఎయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ రణదీప్ గులేరియా మాట్లాడుతూ కోవిడ్ థర్డ్ వేవ్ ప్రభావితం చూపబోతోందనీ, పిల్లలకూ ప్రమాదకరంగా మారనుందన్న వార్తలలో ప్రపంచవ్యాపితంగా కూడా ఎక్కడా కూడా దీనిపై ఎలాంటి ఆధారాలూ లేవని తేల్చారు. ఇవన్నీ నిరాధారమైన వార్తలని తెలిపారు.

'జనవిజయం' జనరల్ ఆర్టికల్స్, విశ్లేషణలు పొందడానికి, సమస్యలను 'జనవిజయం' దృష్టికి తీసుకురావడానికై జనవిజయం సోషల్ మీడియా ప్రొఫైల్స్ లలో జాయిన్ అవ్వండి:
జనవిజయం Join Link
జనవిజయం Join Link
జనవిజయం
జనవిజయం
 
ఇవీ చూడండి..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ఈ వారంలో ఎక్కువగా వీక్షించినవి:

- Advertisment -

ఎక్కువగా వీక్షించిన పోస్టులు (ఆల్-టైం):

వ్యాఖ్యలు

విభాగాలు

తెలంగాణజాతీయంరాజకీయంపరిపాలనఆంధ్రప్రదేశ్ఆరోగ్యంప్రత్యేకంసినిమావాణిజ్యంసాహిత్యంస్పూర్తిఅంతర్జాతీయంవ్యవసాయంప్రముఖులుఆయుర్వేదంపోల్స్విద్యఅధ్యయనంమంతెన ఆరోగ్య సలహాలువీడియోలుజర్నలిజంవికాసంవినదగునెవ్వరు చెప్పినపర్యావరణంఎడిటర్ వాయిస్ఎన్నికలుతెలుసుకుందాంపిల్లల పెంపకంవిజ్ఞానంవార్త-వ్యాఖ్యనేర వార్తలువీరమాచనేని డైట్ సలహాలుఆధ్యాత్మికంజీవనంన్యాయంఆర్ధికంఉపాధిప్రకృతివాతావరణంవార్తలురాజ్యాంగంసమాజంక్రీడలుచరిత్రనాడు-నేడుపర్యాటకంప్రకృతి వ్యవసాయంటెక్నాలజీవినోదంసాంకేతికతఎడిట్కుటుంబంప్రజఈపేపర్టీవీపల్లెప్రపంచంపీపుల్స్ ఇంటర్వ్యూబ్లాగ్మంచిమాటమన భూమిమహా విశ్వంమా బృందంవిజయపథంవివిధసంప్రదించండి