జనవిజయంఆరోగ్యంథర్డ్ వేవ్ లో పిల్లలు పాటించాల్సిన జాగ్రత్తలు

థర్డ్ వేవ్ లో పిల్లలు పాటించాల్సిన జాగ్రత్తలు

న్యూఢిల్లీ,జూన్10(జనవిజయం): కరోనా వైరస్ తో ఇబ్బందులు ఇప్పట్లో తప్పేలా లేవు. త్వరలోనే థర్డ్ వేవ్ రాబోతుందనీ ఇది చిన్నపిల్లలను బాగా ఇబ్బంది పెడుతుందని ఓ వైపు నిపుణులు అంచనా వేస్తుంటే అలాంటి ఆధారాలు ఏమీ లేవని కేంద్రం ప్రకటించింది. ఈ నేపథ్యంలో కరోనాకు సంబంధించిన రక్షణ విషయంలో ఎవరేమి చెబుతున్నారో అర్ధం కాని పరిస్థితులలో చిన్నపిల్లలున్న తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. వైరస్ వ్యాప్తి కాకుండా ఉండడంలో రక్షణ కవచాలుగా పాటిస్తున్న నియమాలలో మాస్క్ ధరించడమన్నది ప్రధాన అంశం. అయితే చిన్న పిల్లలు మాస్క్ ఎలా ధరించాలనే అంశంపై కేంద్ర ఆరోగ్య శాఖ పరిధిలోని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ (DGHS) కొన్ని నియమాలను తెలియజేసింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

DGHS చెపుతున్న జాగ్రత్తలేమిటి?

  • ఐదేండ్ల వయసులోపు ఉన్న చిన్న పిల్లలు మాస్క్ ధరించాల్సిన అవసరం లేదు.
  • 6 నుండి 11 ఏండ్లలోపు పిల్లలు తల్లిదండ్రులు, సంరక్షకుల పర్యవేక్షణలో వారి సామర్ధ్యాన్ని బట్టి మాస్క్ వాడవచ్చు. వాడగలిగే అవకాశం ఉంటే వీరు మాస్క్ ధరించడం మంచిది. శ్వాస సంబంధిత ఇబ్బందులు ఉంటే డాక్టర్ సలహాను పాటించడం మంచిది.
  • 12 నుండి 17 ఏండ్ల వయసున్న వారు పెద్దల మాదిరిగానే తప్పనిసరిగా మాస్క్ ధరించాలి.
  • మాస్క్ లు ధరించడానికి ముందు, తరువాత కూడా చేతులను సబ్బుతో శుభ్రంగా కడుక్కోవాలి. మాస్క్ లను ఉతికి ధరించడం వంటి జాగ్రత్తలు వహించడం మంచిది.

ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏం చెబుతోంది?

ఇదే అంశంపై ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ఇదివరకే మార్గదర్శకాలను వెల్లడించింది. ముఖ్యంగా ఐదేళ్లలోపు చిన్నారులకు మాస్కులు ధరించాల్సిన అవసరం లేదని సూచించింది. సురక్షితంగా వినియోగించగలిగిన సామర్థ్యంపై ఇది ఆధారపడి ఉంటుందని పేర్కొంది. అనారోగ్యంతో బాధపడుతున్న వారికి సమీపంగా వెళ్లాల్సి వచ్చిన సందర్భాల్లో మాత్రం మాస్కును వాడాలని స్పష్టం చేసింది.

పిల్లల మాస్క్ విషయంలో CDC ఏం చెబుతోంది?

అమెరికాలోని వ్యాధుల నియంత్రణ, నివారణ కేంద్రం (CDC) మాత్రం కేవలం రెండేళ్ల కంటే తక్కువ వయసున్న చిన్నారులు మాత్రమే మాస్కులు వాడకూడదని పేర్కొంది.

డీజీహెచ్ఎస్ తాజా మార్గధర్శకాలు:

చిన్నపిల్లలు కొవిడ్ బారిన పడితే తీసుకోవాల్సిన జాగ్రత్తలు, చికిత్స అందించడంపై డీజీహెచ్ఎస్ తాజా మార్గదర్శకాల్లో స్పష్టంగా పేర్కొంది. కరోనాకు గురైన 18 ఏళ్లలోపు పిల్లల ఊపిరితిత్తుల పరిస్థితులను తెలుసుకోవడానికి హై రిజల్యూషన్ సీటీస్కాన్ (HRCT)ను అంతగా వినియోగించాల్సిన పనిలేదని.. అత్యవసరమైతే దీనిని హేతుబద్ధంగా ఉపయోగించాలని సూచించింది. అంతేకాకుండా అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగించే రెమ్ డెసివిర్ ఇంజక్షన్లను పిల్లలకు అసలు ఇవ్వకూడదని స్పష్టం చేసింది. మాస్కులు ధరించడం, భౌతిక దూరాన్ని పాటించడం, చేతులను శుభ్రం చేసుకోవడం వంటి జాగ్రత్తలు పిల్లలు కూడా తప్పకుండా పాటించేలా తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.

'జనవిజయం' జనరల్ ఆర్టికల్స్, విశ్లేషణలు పొందడానికి, సమస్యలను 'జనవిజయం' దృష్టికి తీసుకురావడానికై జనవిజయం సోషల్ మీడియా ప్రొఫైల్స్ లలో జాయిన్ అవ్వండి:
జనవిజయం Join Link
జనవిజయం Join Link
జనవిజయం
జనవిజయం
 
ఇవీ చూడండి..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ఈ వారంలో ఎక్కువగా వీక్షించినవి:

- Advertisment -

ఎక్కువగా వీక్షించిన పోస్టులు (ఆల్-టైం):

వ్యాఖ్యలు

కట్టెకోల చిన నరసయ్య on పరిశీలన,సాధన.. రచనకు ప్రయోజనకరం

విభాగాలు

తెలంగాణజాతీయంరాజకీయంపరిపాలనఆరోగ్యంఆంధ్రప్రదేశ్ప్రత్యేకంసినిమాసాహిత్యంవాణిజ్యంస్పూర్తిఅంతర్జాతీయంప్రముఖులువ్యవసాయంవీడియోలుఆయుర్వేదంఅధ్యయనంపోల్స్వినదగునెవ్వరు చెప్పినమంతెన ఆరోగ్య సలహాలువిద్యఎడిటర్ వాయిస్జర్నలిజంవికాసంవార్త-వ్యాఖ్యతెలుసుకుందాంపర్యావరణంపిల్లల పెంపకంవీరమాచనేని డైట్ సలహాలునేర వార్తలుఎన్నికలువిజ్ఞానంసమాజంన్యాయంఆధ్యాత్మికంజీవనంఆర్ధికంఉపాధిప్రకృతిరాజ్యాంగంవాతావరణంవార్తలువినోదంసాంకేతికతకుటుంబంక్రీడలుచరిత్రనాడు-నేడుపర్యాటకంప్రకృతి వ్యవసాయంటెక్నాలజీప్రజఎడిట్ఈపేపర్టీవీపల్లెప్రపంచంపీపుల్స్ ఇంటర్వ్యూబ్లాగ్మంచిమాటమన భూమిమహా విశ్వంమా బృందంవిజయపథంవివిధసంప్రదించండి