Tuesday, October 3, 2023
Homeవార్తలుమూడు నెలలు ఓపిక పట్టండి రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమే - కాంగ్రెస్ పార్టీ ప్రచార...

మూడు నెలలు ఓపిక పట్టండి రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమే – కాంగ్రెస్ పార్టీ ప్రచార కమిటీ కో చైర్మన్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి

కూసుమంచి, ఆగష్టు 7 (జనవిజయం): మూడు నెలలు ఓపిక పట్టండి రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమని కాంగ్రెస్ పార్టీ ప్రచార కమిటీ కో చైర్మన్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు.సోమవారం కూసుమంచి మండలంలో ఆయన పర్యటించారు. చేగమ్మ గ్రామానికి చేరుకున్న పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు డప్పు వాయిద్యాలతో ఘన స్వాగతం పలికారు. గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు చీమల దారి రామయ్య అనారోగ్యంతో బాధపడుతుండగా పరామర్శించారు. అనంతరం అదే గ్రామానికి చెందిన బోలికొండ స్వరూప ఇటీవల మృతి చెందగా బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి, ఓదార్చి, ప్రగాఢ సానుభూతి తెలిపి ఆర్థిక సహాయం అందజేశారు. అనంతరం ముత్యాల గూడెం సర్పంచ్ బొల్లి కొండ శ్రీను తన నివాసంలో కలిసి యోగ క్షేమాల గురించి అడిగి తెలుసుకున్నారు. గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకుడు మంకెన శ్రీనివాస్ రావు నివాసంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో మాట్లాడుతూ.. ఆనాడు కాంగ్రెస్ అభ్యర్థిగా ఉన్న వ్యక్తిని గెలిపించడం కోసం కాంగ్రెస్ పార్టీ నుంచి బీఆర్ఎస్ పార్టీలోకి జాయిన్ అయిన తర్వాత ఇదే గ్రామానికి వచ్చి మంకేన శ్రీనువాసు రావు, గ్రామ సర్పంచ్ బోలికొండ శ్రీనివాస్, కార్యకర్తలు బుజాలపై వేసుకొని గెలిపిస్తే కాంట్రాక్టుల కోసం బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్లి నేడు కాంగ్రెస్ పార్టీ నాయకులపై 307 కేసులు పెట్టి అనేక అక్రమ కేసులు పెట్టి జైల్లో పెట్టారని విమర్శించారు. పదవులు, డబ్బు శాశ్వతం కాదని, అవి వస్తూ పోతూ ఉంటాయని అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వానికి భయం పట్టుకుందని అందుకే ఆచరణ సాధ్యం కాని హామీలు ఇస్తూ ప్రజలను మభ్యపెడుతుందని పొంగులేటి అన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ఈ వారం పాపులర్

ఆల్ టైమ్ పాపులర్

Recent Comments