జనవిజయంఆరోగ్యండిఆర్‌డివో ఉత్పత్తి 2-డిజిని విడుదల చేసిన రాజ్‌నాథ్‌ సింగ్‌

డిఆర్‌డివో ఉత్పత్తి 2-డిజిని విడుదల చేసిన రాజ్‌నాథ్‌ సింగ్‌

దేశ సమర్థతను రక్షణరంగం చాటిందని వెల్లడి
ప్రపంచానికి సంజీవనిలా ఉపయోగ పడుతుందన్న హర్షవర్ధన్‌

న్యూఢల్లీ,మే17(జనవిజయం): డీఆర్డీవో తయారు చేసిన కరోనా నివారణ ఔషధం 2-డీజీని కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ విడుదల చేశారు. కేంద్ర మంత్రి రాజ్‌నాథ్‌ ఈ ఔషధాన్ని కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్‌కు ఇవ్వగా, హర్షవర్ధన్‌ దానిని ఎయిమ్స్‌ డైరెక్టర్‌ గులేరియాకు అందజేశారు. ఈ సందర్భంగా కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ మాట్లాడుతూ… కరోనా కట్టడిలో ఈ ఔషధం ప్రముఖ పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు. ఇంతటి క్లిష్ట సమయంలో ప్రభుత్వ, ప్రైవేట్‌ రంగాలు కలిసి ఓ ఔషధాన్ని ఉత్పత్తి చేయడం ఆరోగ్యవంతమైన భాగస్వామ్యానికి ప్రత్యక్ష ఉదాహరణ అని ప్రకటించారు. సైనిక రంగం సాధించిన ఘనతగా అభివర్ణించారు. దీంతో రానున్న రోజుల్లో కరోనాపై సమర్థవంతంగా పోరాటానికి అవకాశం ఏర్పడిందిన్నారు. ఇక కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్‌ మాట్లాడుతూ… 2డీజీ ఔషధంతో కొవిడ్‌ రికవరీ తగ్గడంతో పాటు ఆక్సిజన్‌ అవసరం కూడ బాగా తగ్గుతుందని, కోవిడ్‌ పై పోరులో డీఆర్డీవో కీలక పాత్ర పోషిస్తోందని ప్రశంసించారు. అయితే ఈ 2డీజీ (2`డియాక్సీ డి`గ్లూకోజ్‌) ఔషధ ధరను మాత్రం డీఆర్డీవో ఇప్పటి వరకూ ప్రకటించలేదు. దేశంలో కోవిడ్‌ ఉధృతంగా సాగుతున్న నేపథ్యంలో డీఆర్డీవో ఈ ఔషధాన్ని అందుబాటులోకి తెచ్చింది. 2-డీజీ డ్రగ్‌ భారత్‌ను మాత్రమే కాక ప్రపంచాన్ని కాపాడగలుగుతుంది అన్నారు. కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ మద్దతుతో డీఆర్‌డీఓ అభివృద్ధి చేసిన కోవిడ్‌ డ్రగ్‌ 2-డీజి మొదటి దేశీయ పరిశోధన ఆధారిత ఫలితం. దీని వినియోగం వల్ల కోవిడ్‌ వ్యాప్తిని అరికట్టడమే కాక ఆక్సిజన్‌ అవసరాన్ని తగ్గిస్తుంది. ఈ ఔషధం రాబోయే రోజుల్లో భారతదేశాన్ని మాత్రమే కాక మొత్తం ప్రపంచాన్ని కోవిడ్‌ బారి నుంచి కాపాడుతుందన్నారు. ఇక డీఆర్‌డీఓ అభివృద్ధి చేసిన ఈ ఔషధం పౌడర్‌ రూపంలో ఉంటుంది. దీన్ని నీటిలో కలుపుకుని నోటి ద్వారా తీసుకోవాలి. ఇది వైరస్‌ సోకిన కణాలలో పేరుకుపోయిన వైరల్‌ సంశ్లేషణ, శక్తి ఉత్పత్తిని ఆపడం ద్వారా వైరస్‌ పెరుగుదలను నిరోధిస్తుంది అని డీఆర్‌డీఓ తెలిపింది.

'జనవిజయం' జనరల్ ఆర్టికల్స్, విశ్లేషణలు పొందడానికి, సమస్యలను 'జనవిజయం' దృష్టికి తీసుకురావడానికై జనవిజయం సోషల్ మీడియా ప్రొఫైల్స్ లలో జాయిన్ అవ్వండి:
జనవిజయం Join Link
జనవిజయం Join Link
జనవిజయం
జనవిజయం
 
ఇవీ చూడండి..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ఈ వారంలో ఎక్కువగా వీక్షించినవి:

- Advertisment -

ఎక్కువగా వీక్షించిన పోస్టులు (ఆల్-టైం):

వ్యాఖ్యలు

కట్టెకోల చిన నరసయ్య on పరిశీలన,సాధన.. రచనకు ప్రయోజనకరం

విభాగాలు

తెలంగాణజాతీయంరాజకీయంపరిపాలనఆరోగ్యంఆంధ్రప్రదేశ్ప్రత్యేకంసినిమాసాహిత్యంవాణిజ్యంస్పూర్తిఅంతర్జాతీయంప్రముఖులువ్యవసాయంవీడియోలుఆయుర్వేదంఅధ్యయనంపోల్స్వినదగునెవ్వరు చెప్పినమంతెన ఆరోగ్య సలహాలువిద్యఎడిటర్ వాయిస్జర్నలిజంవికాసంవార్త-వ్యాఖ్యతెలుసుకుందాంపర్యావరణంపిల్లల పెంపకంవీరమాచనేని డైట్ సలహాలునేర వార్తలుఎన్నికలువిజ్ఞానంసమాజంన్యాయంఆధ్యాత్మికంజీవనంఆర్ధికంఉపాధిప్రకృతిరాజ్యాంగంవాతావరణంవార్తలువినోదంసాంకేతికతకుటుంబంక్రీడలుచరిత్రనాడు-నేడుపర్యాటకంప్రకృతి వ్యవసాయంటెక్నాలజీప్రజఎడిట్ఈపేపర్టీవీపల్లెప్రపంచంపీపుల్స్ ఇంటర్వ్యూబ్లాగ్మంచిమాటమన భూమిమహా విశ్వంమా బృందంవిజయపథంవివిధసంప్రదించండి