- ప్రజాసంఘాల నిర్మాణంలో సిద్ది కీలక పాత్ర : సాబీర్ పాష సీపీఐ జిల్లా కార్యదర్శి
భద్రాద్రి కొత్తగూడెం, ఆగస్ట్ 28 (జనవిజయం): సిపిఐ సీనియర్ నాయకులు, మాజీ రాష్ట్ర సహాయ కార్యదర్శి సిద్ది వెంకటేశ్వర్లు స్మారక విగ్రహావిష్కరణ రేపు పాల్వంచలో జరగనున్నది. ఈ సందర్భం గా సభ నిర్వహించబోతున్నట్లు సిపిఐ జిల్లా కార్యదర్శి sk సాబీర్ పాష తెలిపారు. సోమవారం రాజేశ్వరరావు భవన్లో సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాల్వంచతోపాటు రాష్ట్రవ్యాప్తంగా పార్టీ ప్రజాసంఘాల నిర్మాణంలో కీలకపాత్ర పోషించిన సిద్ధి వెంకటేశ్వర్లు ఆశయ సాధన కోసం, భావితరాలకు ఉద్యమ స్ఫూర్తిని నింపటానికి స్మారక విగ్రహావిష్కరణ నిర్వహిస్తున్నట్లు ఈ విగ్రహావిష్కరణ సభకు సిపిఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కే నారాయణ, రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, జాతీయ కార్యవర్గ సభ్యులు చాడా వెంకటరెడ్డి, జాతీయ సమితి సభ్యులు బాగం హేమంతరావు తదితర రాష్ట్ర జిల్లా నేతలు హాజరుకానున్నట్లు తెలిపారు. విగ్రహావిష్కరణ అనంతరం జరిగే సభలో జిల్లా వ్యాప్తంగా ఉన్న సిద్ధి అభిమానులు, శ్రేయోభిలాషులు, పార్టీ ప్రజాసంఘాల నాయకులు కార్యకర్తలు హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. *ఈ కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర సమితి సభ్యులు ముత్యాల విశ్వనాథం, మండల కార్యదర్శి వీసంశెట్టి పూర్ణచంద్రరావు, జిల్లా సమితి సభ్యులు బండి నాగేశ్వరరావు ఉప్పుశెట్టి రాహుల్, గుండాల నాగరాజు, డి సుధాకర్, ఏఐటియుసి పట్టణ అధ్యక్ష కార్యదర్శులు వీసంశెట్టి విశ్వేశ్వరరావు, అన్నారపు వెంకటేశ్వర్లు, శనగరపు శ్రీనివాస్ రావు, జకీరయ్య, ఎండి పాషా తదితరులు పాల్గొన్నారు.