జనవిజయంతెలంగాణ2023 నాటికి యాదాద్రి పవర్ ప్లాంట్ పూర్తి

2023 నాటికి యాదాద్రి పవర్ ప్లాంట్ పూర్తి

నిర్మాణ పనులపై కోవిడ్ ప్రభావం: మంత్రి జగదీష్

నల్గొండ, మే 19 (జనవిజయం): మిర్యాలగూడ నియోజకవర్గ పరిధిలోని యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ నిర్మాణం 2023 నాటికి పూర్తి అవుతుందని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. యాదాద్రి పవర్ ప్లాంట్ నిర్మాణం ప్రారంభ దశలో కొందరు కుట్రలు చేసి గ్రీన్ ట్రిబ్యునల్‌కు వెళ్లి ఆపే ప్రయత్నం చేశారని ఆయన ఆరోపించారు. అటువంటి అవాంతరాలను అధిగమించి నిర్మాణంలో పురోగతిని సాధించినట్లు ఆయన వెల్లడించారు. నల్లగొండ జిల్లా దామరచర్ల మండలం వీర్లపాలెం వద్ద రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తున్న యాదాద్రి పవర్ ప్లాంట్‌ను ఆయన ట్రాన్స్‌కో, జెన్‌కో చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ (సీఎండీ) దేవులపల్లి ప్రభాకర్ రావుతో కలసి సందర్శించారు.

అనంతరం నిర్మాణం పురోగతిపై ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సమీక్షా సమావేశంలో ఆయన పాల్గొన్నారు. అనంతరం మంత్రి జగదీష్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ భవిష్యత్ తరాల అవసరాలను దృష్టిలో పెట్టుకొని ముఖ్యమంత్రి కేసీఆర్ అత్యంత ప్రతిష్టాత్మకంగా మొదలు పెట్టిన ఈ నిర్మాణం వేగవంతంగా జరుగుతున్న సందర్భంలోనే కరోనా వైరస్ వ్యాప్తి చెందడంతో పనులు కొంత మేరకు మందగించాయన్నారు. కరోనా మొదటి దశ పూర్తి అయి పనులు తిరిగి వేగవంతం అయ్యేసరికి కరోనా సెకండ్ వేవ్ రావడంతో కొంత అవాంతరం ఏర్పడిందని ఆయన చెప్పారు. అయినా ట్రాన్స్‌కో, జెన్కో సీయండీ దేవులపల్లి ప్రభాకర్‌రావు ఇతర ఉన్నతాధికారుల సూచన మేరకు ఇక్కడ పనిచేస్తున్న కార్మికులకు అందుబాటులో వైద్యం అందించాలని నిర్ణయించామన్నారు. ఇప్పటికే అయిదు యూనిట్లు నిర్మాణంలో ఉన్నాయని మరో యూనిట్‌కు టెండర్ల ప్రక్రియ పూర్తి అయిందని ఆయన వెల్లడించారు. ట్రాన్స్‌కో, జెన్కో సీయండీ దేవులపల్లి ప్రభాకర్ రావు మాట్లాడుతూ ఇప్పటికే జెన్కో ఆధ్వర్యంలో రాష్ట్రంలో 4,000 మెగావాట్ల థర్మల్ పవర్ ఉందన్నారు. ఇక్కడ నిర్మిస్తున్న పవర్ ప్లాంట్‌తో మరో 4,000 వేల మెగావాట్ల ఉత్పత్తి కాబోతుందన్నారు. కరోనా సమయంలోనూ నిర్మాణం పనులు ఎక్కడ ఆగడం లేదన్నారు. ఎప్పటికప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్మాణం పురోగతిపై సమీక్షిస్తున్నారని ఆయన చెప్పారు. ఈ సమీక్షా సమావేశంలో బీహెచ్ఈఎల్ డైరెక్టర్ సిసోడియా, ట్రాన్స్‌కో డైరెక్టర్లు అజయ్, సచ్చితానంద్, టీఆర్‌కే రావు, కోల్ సీయండీ జెయస్ రావు తదితరులు పాల్గొన్నారు.

'జనవిజయం' జనరల్ ఆర్టికల్స్, విశ్లేషణలు పొందడానికి, సమస్యలను 'జనవిజయం' దృష్టికి తీసుకురావడానికై జనవిజయం సోషల్ మీడియా ప్రొఫైల్స్ లలో జాయిన్ అవ్వండి:
జనవిజయం Join Link
జనవిజయం Join Link
జనవిజయం
జనవిజయం
 
ఇవీ చూడండి..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ఈ వారంలో ఎక్కువగా వీక్షించినవి:

- Advertisment -

ఎక్కువగా వీక్షించిన పోస్టులు (ఆల్-టైం):

వ్యాఖ్యలు

కట్టెకోల చిన నరసయ్య on పరిశీలన,సాధన.. రచనకు ప్రయోజనకరం

విభాగాలు

తెలంగాణజాతీయంరాజకీయంపరిపాలనఆరోగ్యంఆంధ్రప్రదేశ్ప్రత్యేకంసినిమాసాహిత్యంవాణిజ్యంస్పూర్తిఅంతర్జాతీయంప్రముఖులువ్యవసాయంవీడియోలుఆయుర్వేదంఅధ్యయనంపోల్స్వినదగునెవ్వరు చెప్పినమంతెన ఆరోగ్య సలహాలువిద్యఎడిటర్ వాయిస్జర్నలిజంవికాసంవార్త-వ్యాఖ్యతెలుసుకుందాంపర్యావరణంపిల్లల పెంపకంవీరమాచనేని డైట్ సలహాలునేర వార్తలుఎన్నికలువిజ్ఞానంసమాజంన్యాయంఆధ్యాత్మికంజీవనంఆర్ధికంఉపాధిప్రకృతిరాజ్యాంగంవాతావరణంవార్తలువినోదంసాంకేతికతకుటుంబంక్రీడలుచరిత్రనాడు-నేడుపర్యాటకంప్రకృతి వ్యవసాయంటెక్నాలజీప్రజఎడిట్ఈపేపర్టీవీపల్లెప్రపంచంపీపుల్స్ ఇంటర్వ్యూబ్లాగ్మంచిమాటమన భూమిమహా విశ్వంమా బృందంవిజయపథంవివిధసంప్రదించండి