రెండు గదులు ఇంటికి 50 వేల రూపాయలు కరెంట్ బిల్
- లబోదిబోమంటున్న వినియోగదారుడు
మధిర, జులై 21(జనవిజయం):
మధిర మండలానికి చెందిన విద్యుత్ వినియోగదారుడు తన బాధని చెపుతూ ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన చెప్పిన వివరాలు ఇలా ఉన్నాయి.
నా పేరు ఐలూరు కృష్ణారెడ్డి s/o లక్ష్మారెడ్డి, జాలిముడి గ్రామం, మధిర మండలం. మేము 1994 నుండి 2023 వరకు కరెంట్ బిల్లు ఒక్క నెల కూడా మిస్ కాకుండా కడుతూ వస్తున్నాము. మాకు రెండు గదులు ఇల్లు మాత్రమే ఉన్నది. గతంలో ఎప్పుడూ కూడా 200 కి మించి కరెంట్ బిల్లు రాలేదు. కానీ నాలుగు నెలల క్రితం 50 వేల రూపాయలు కరెంట్ బిల్లు వచ్చినది. ఇదేమిటని సంబంధిత కరెంటు అధికారులను అడిగితే వచ్చినది కాబట్టి కట్టాల్సిందే అని మా మీద ఒత్తిడి తీసుకొస్తున్నారు. మా ఇంటిలో నేను నా భార్య మాత్రమే ఉంటాము. మాకు ఎటువంటి వ్యవసాయ భూములు కూడా లేవు. మేము చాలా పేదవాళ్ళము. ఇలా కరెంటు డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి ఒత్తిడి చేస్తే మాకు ఆత్మహత్య శరణ్యము. కావున మా యందు దయవుంచి ఈ విషయాలను సంబంధిత విద్యుత్తు అధికారులకు తెలియజేసి మా సమస్యను పరిష్కరించవలసిందిగా కోరుచున్నాము. లేని పక్షంలో మాకు ఆత్మహత్య శరణ్యమని తెలియజేస్తున్నాము.
టెక్నికల్ ప్రాబ్లం వల్ల ఇలా అధిక కరెంట్ బిల్లు రావచ్చు, ఇలా అధిక బిల్ వచ్చినవారు మధిర కరెంట్ ఆఫీస్ నందు సంప్రదించవలసిందిగా విద్యుత్ అధికారులు తెలిపారు.