Tuesday, October 3, 2023
Homeవార్తలుఓటు ప్రాధాన్యత పై 19 న 5 కె రన్ : కలెక్టర్ ప్రియాంక

ఓటు ప్రాధాన్యత పై 19 న 5 కె రన్ : కలెక్టర్ ప్రియాంక

భద్రాద్రి కొత్తగూడెం, ఆగస్ట్ 17 (జనవిజయం): ఓటు హక్కు ప్రాధాన్యత, వినియోగం, ఓటరు నమోదు కార్యక్రమాలపై 19వ తేదీ శనివారం ఉదయం 6 గంటలకు అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో 5 కే రన్ నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక తెలిపారు. ఇందుకు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేయాలని నియోజకవర్గ తహసిల్దార్లను కలెక్టర్ ఆదేశించారు. కొత్తగూడెంలో ఉదయం 6 గంటలకు కొత్తగూడెం పోస్ట్ ఆఫీస్ సెంటర్ నుంచి లక్ష్మీదేవిపల్లి మండలంలోని సెంట్రల్ పార్క్ వరకు 5కే రన్ నిర్వహించడం జరుగుతుందని కలెక్టర్ స్పష్టం చేశారు. ప్రతి ఒక్కరు చిన్న, పెద్ద వయోభేదం లేకుండా ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని కలెక్టర్ సూచించారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ఈ వారం పాపులర్

ఆల్ టైమ్ పాపులర్

Recent Comments