జనవిజయంజాతీయంశతశాతం పీఎంజీకే కేటాయింపులు

శతశాతం పీఎంజీకే కేటాయింపులు

న్యూఢిల్లీ, మే 19 (జనవిజయం): కరోనా వైరస్ వల్ల ఆర్ధికంగా దెబ్బతిని సమస్యలను ఎదుర్కొంటున్న పేదలను ఆదుకోవడానికి కేంద్రం ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన (పీఎంజీకే) కింద అందుతున్న ఆహారధాన్యాలను రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రతాలు అర్హులైనవారికి సరఫరా చేస్తున్నాయి. ఇప్పటి వరకూ అన్ని 36 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు భారత ఆహార సంస్థ గిడ్డంగుల నుంచి 31.80 లక్షల ఎంటీల ఆహారధాన్యాలను తీసుకున్నాయి. మే, జూన్ నెలల కేటాయింపులను లక్ష దీవులు పూర్తిగా తీసుకున్నాయి. ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, అండమాన్ నికోబార్ దీవులు, గోవా, ఛత్తీస్‌ఘర్, హిమాచల్ ప్రదేశ్, కేరళ, లడఖ్, మేఘాలయ, మిజోరాం, నాగాలాండ్, పుదుచ్చేరి, తమిళనాడు, తెలంగాణ త్రిపురలు 2021 మే కేటాయింపులను పూర్తిగా తరలించాయి.

పీఎం జీకే కేటాయింపులను అర్హులైన లభ్డిదారులకు అందించడానికి రాష్ట్రాలు, యూటీలు చర్యలను తీసుకుంటున్నాయి. ఈ పథకం కింద ఎన్ఎఫ్ఎస్ఏ పరిధిలోకి వచ్చే79.39 కోట్ల మంది లబ్ధిదారులకు మనిషికి అయిదు కేజీల చొప్పున వారికి సరఫరా చేయవలసిన మొత్తం కంటే ఎక్కువగా ఆహార ధాన్యాలు (బియ్యం/గోధుమలు) మే, జూన్‌లలో రెండు నెలల పాటు ఉచితంగా అందించనున్నారు. ఎన్ఎఫ్ఎస్ఏ కింద కేటాయిస్తున్న ఆహారధాన్యాలు అదనంగా 79.39 లక్షల ఎంటీల ఆహారధాన్యాలను కేటాయించడం జరిగింది. రాష్టాలు/యూటీలకు అందిస్తున్న కేంద్ర సహకారం కింద ఆహారధాన్యాల ఖరీదు, రవాణా తదితర అయ్యే 26,000 కోట్ల రూపాయల ఖర్చును కేంద్రం భరించాలని నిర్ణయించింది.

ఇంతకుముందు, భారత ప్రభుత్వం పిఎమ్‌జికె-I (ఏప్రిల్-జూన్ 2020), పిఎమ్‌జికెఎ- II (జూలై-నవంబర్ 2020) కింద ఎన్‌ఎఫ్‌ఎస్‌ఎ లబ్ధిదారులకు ఉచిత ఆహార ధాన్యాలు అందించింది. వీటిలో 104 ఎల్‌ఎమ్‌టి గోధుమలు, 201 ఎల్‌ఎమ్‌టి బియ్యం, మొత్తం 305 ఎల్‌ఎమ్‌టి ఆహార ధాన్యాలను సంబంధిత రాష్ట్రాలు, యుటిలకు భారత ఆహార సంస్థ సరఫరా చేసింది.

'జనవిజయం' జనరల్ ఆర్టికల్స్, విశ్లేషణలు పొందడానికి, సమస్యలను 'జనవిజయం' దృష్టికి తీసుకురావడానికై జనవిజయం సోషల్ మీడియా ప్రొఫైల్స్ లలో జాయిన్ అవ్వండి:
జనవిజయం Join Link
జనవిజయం Join Link
జనవిజయం
జనవిజయం
 
ఇవీ చూడండి..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ఈ వారంలో ఎక్కువగా వీక్షించినవి:

- Advertisment -

ఎక్కువగా వీక్షించిన పోస్టులు (ఆల్-టైం):

వ్యాఖ్యలు

కట్టెకోల చిన నరసయ్య on పరిశీలన,సాధన.. రచనకు ప్రయోజనకరం

విభాగాలు

తెలంగాణజాతీయంరాజకీయంపరిపాలనఆరోగ్యంఆంధ్రప్రదేశ్ప్రత్యేకంసినిమాసాహిత్యంవాణిజ్యంస్పూర్తిఅంతర్జాతీయంప్రముఖులువ్యవసాయంవీడియోలుఆయుర్వేదంఅధ్యయనంపోల్స్వినదగునెవ్వరు చెప్పినమంతెన ఆరోగ్య సలహాలువిద్యఎడిటర్ వాయిస్జర్నలిజంవికాసంవార్త-వ్యాఖ్యతెలుసుకుందాంపర్యావరణంపిల్లల పెంపకంవీరమాచనేని డైట్ సలహాలునేర వార్తలుఎన్నికలువిజ్ఞానంసమాజంన్యాయంఆధ్యాత్మికంజీవనంఆర్ధికంఉపాధిప్రకృతిరాజ్యాంగంవాతావరణంవార్తలువినోదంసాంకేతికతకుటుంబంక్రీడలుచరిత్రనాడు-నేడుపర్యాటకంప్రకృతి వ్యవసాయంటెక్నాలజీప్రజఎడిట్ఈపేపర్టీవీపల్లెప్రపంచంపీపుల్స్ ఇంటర్వ్యూబ్లాగ్మంచిమాటమన భూమిమహా విశ్వంమా బృందంవిజయపథంవివిధసంప్రదించండి